S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చుట్టం చూపుగా.. గడప గడపకూ వైఎస్‌ఆర్‌సిపి

ఆత్మకూరు, సెప్టెంబర్ 19: రాష్ట్ర విపక్ష నేత జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చిన గడప గడపకూ వైఎస్‌ఆర్‌సిపి కార్యక్రమం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో చుట్టం చూపుగా కొనసాగుతోంది. మొత్తం 140 రోజుల వ్యవధిలో నియోజకవర్గాల్లోని అన్ని గడపలకూ వెళ్లి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలనేది వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర నేతలు సూచించిన పార్టీ క్యాలండర్. ఇందులో ఇప్పటివరకు 70 రోజులు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ ప్రజల చేతికి పార్టీపరంగా రూపొందించిన వివిధ ప్రశ్నలతో కూడిన కరపత్రాన్ని అందజేసి అభిప్రాయాలను సేకరించాలి.

28 టన్నుల పిడిఎస్ బియ్యం పట్టివేత

వెంకటాచలం (మనుబోలు), సెప్టెంబర్ 19: వెంకటాచలం మండల పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద సోమవారం వేకువజామున సుమారు రూ.6 లక్షల విలువచేసే 28 టన్నుల ప్రజాపంపిణీ బియ్యాన్ని విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు, ఆంధ్రాకు చెందిన పిడిఎస్ బియ్యాన్ని తడ నుండి నెల్లూరుకు అక్రమంగా లారీలో అదివారం రాత్రి అక్రమార్కులు తరలిస్తున్నారు. ఈవిషయంపై విజిలెన్సు అధికారులకు సమాచారం అందడంతో హుటాహుటిన ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో సోమవారం వేకువజామున లారీలో తరలిస్తున్న బియ్యాన్ని గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో విజిలెన్సు డిఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అంతా ఏకపక్షం!

నెల్లూరుసిటీ, సెప్టెంబర్ 19: నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీలో పొందుపరిచిన అన్ని అంశాలకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. గత స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేటర్లు దాసరి రాజేష్, కినె్నర ప్రసాద్‌లు మేయర్‌పై ఏకదాటిగా మాటల యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో మాత్రం వారు అన్ని అంశాలకు జూ హుజూర్ అంటూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం గమనార్హం. పత్రిక పేరుతో దోపిడీకి రంగం సిద్ధం చేసిన అంశాన్ని కూడా సభ్యులు ఎటువంటి అభ్యంతరం తెలపకుండా ఆమోదించడం విశేషం. పత్రికా సంపాదకుడికి ఏకంగా నెలకు 50 వేల రూపాయల జీతం ఇచ్చేందుకు సభ్యులు ఆమోదించారు.

భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం

నెల్లూరు, సెప్టెంబర్ 19: జిల్లాలో భారీ ఎర్రచందనం డంప్‌ను జిల్లా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ విశాల్ గున్ని సోమవారం స్థానిక ఉమేష్ చంద్ర కానె్ఫరెన్స్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. సీతారామపురం మండలం చిన్నగంపల్లి గ్రామ శివార్లలో దాచి ఉంచిన 34 ఎర్రచందనం దుంగలను కావలి డిఎస్పీ రాఘవరావు పర్యవేక్షణలో ఉదయగిరి సిఐ నేతృత్వంలో సీతారామపురం, దుత్తలూరు ఎస్సైలు, కానిస్టేబుళ్లతో కూడిన బృందం గుర్తించి స్వాధీనం చేసుకుంది.

మున్సిపల్ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్సీ

వేదాయపాళెం, సెప్టెంబర్ 19 : నగరంలోని నగరపాలక సంస్థ పాఠశాలలను పట్ట్భద్రుల ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులురెడ్డి సోమవారం పరిశీలించారు. పాఠశాలల స్థితిగతులను, ఉపాధ్యాయుల సమస్యలు, పిల్లల విద్యాప్రమాణాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర పాఠశాల ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను తెరచి జనరల్ ఫండ్‌లో ఉన్న మొత్తాన్ని సిఎస్‌ఎస్‌లో ఉన్న మొత్తాన్ని వారివారి వ్యక్తిగత పిఎఫ్ ఖాతాలను జమచేయవలసిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సిపిఎస్ విధానం రద్దు తదితర సమస్యలపై పిడిఎఫ్ ఎమ్మెల్సీలు అందరం విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కృషి చేస్తామన్నారు.

నెల్లూరు కార్పొరేషన్‌పై మంత్రి దృష్టిపెట్టాలి

వేదాయపాళెం, సెప్టెంబర్ 19: పురపాలక శాఖ మంత్రి నారాయణ విజయవాడకే పరిమితం కాకుండా నెల్లూరు కార్పొరేషన్‌పై కూడా దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టాలని నగర ఎమ్మెల్యే పి.అనీల్‌కుమార్‌యాదవ్ అన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి నారాయణ విజయవాడకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లను చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో రోజురోజుకు అవినీతి పెరిగిపోతోందన్నారు.

లైంగిక దాడి కేసులో ఆర్‌టిసి డ్రైవర్‌కు పదేళ్ల జైలు

పొదలకూరు, సెప్టెంబర్ 19: మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో నిందితుడైన ఆర్‌టిసి డ్రైవర్ ఓరుపల్లి పోలయ్యకు పదేళ్లు జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధిస్తూ సోమవారం గూడూరు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఏడుకొండలు తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2012 ఫిబ్రవరి 3వ తేదీన పట్టణంలోని విఘ్నేశ్వరపురం కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులపై నిందితుడు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. పాఠశాలకు వెళుతున్న చిన్నారులకు సమీపంలో నివాసం ఉంటున్న పోలయ్య జామకాయలు ఇస్తానని ఆశ చూపి, వారిని తన ఇంటికి తీసుకెళ్లేవాడు. వీరికి సెల్‌ఫోన్ ద్వారా నీలిచిత్రాలు చూపి లైంగిక దాడులకు ఒడిగట్టాడు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి:కలెక్టర్

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 19: పారిశుద్ధ్య చర్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని గ్రీవెన్స్‌హాలులో సోమవారం వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టాస్క్ఫోర్స్ అధికారులు తప్పనిసరిగా తమ పరిథిలో ఉన్న గ్రామాలను సందర్శించి అక్టోబర్ నుండే పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. రాబోవు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయని, నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

రైతులు రాయితీలు పొందాలి

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 19: రైతులు సకాలంలో పంట రుణాలను పునరుద్ధరించుకుని రుణ రాయితీలు పొందాలని సిండికేట్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరసింహమూర్తి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వింటేజ్ హోటల్‌లో సోమవారం వ్యవసాయ శాఖ, బ్యాంకర్ల సమన్వయంతో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలామంది రైతులు పంట రుణాన్ని రెన్యూవల్ చేసుకుంటే రుణ విముక్తి పథకానికి అర్హులు కారనే అపోహలో ఉన్నారని, ఇది పూర్తిగా అవాస్తమన్నారు. ఇప్పటికే రుణ విముక్తికై రెండు విడతల నగదు చెల్లించటం జరిగిందన్నారు.

ప్రజా సంక్షేమమే టిడిపి ఆశయం:సోమిరెడ్డి

తోటపల్లిగూడూరు, సెప్టెంబర్ 19: ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ఆశయమని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ఈదూరు జడ్పీ హైస్కూల్‌లో 42 లక్షల 35 వేలుతో అదనపు పాఠశాల గదులు, వాటర్ ట్యాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. టిడిపి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి తమ నేత చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధిపథకంలో నడుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మి సురేంద్ర, బి శ్రీనివాసులు, వీరబోయిన గంగాధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Pages