S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయమైన పరిహారం చెల్లిస్తేనే భూములిస్తాం

గోదావరిఖని, ఆగస్టు 28: కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని.. ప్రాజెక్ట్ నిర్మాణం పేరిట తమ భూములకు తక్కువ పరిహారం చెల్లించి భూములు తీసుకుంటానంటే సరికాదని.. న్యాయమైన పరిహారం చెల్లిస్తూ.. భూములు కోల్పోయిన వారందరికి ప్రాజెక్ట్‌లో ఉపాధి అవకాశం కల్పిస్తానంటేనే తమ భూములిస్తామని గోలివాడ రైతులు తెగేసి చెప్పారు. ఆదివారం రామగుండం మండలం గోలివాడలో భూసేకరణపై అభిప్రాయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్డీఓ అశోక్‌కుమార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్‌ఇ సుధాకర్ రెడ్డి, తహశీల్దార్ గుడూరి శ్రీనివాస రావు పాల్గొన్నారు.

జగిత్యాలలో నకిలీ ఇళ్ల ప్రొసిడింగ్‌ల కలకలం

జగిత్యాల, ఆగస్టు 28: ఇళ్ల పట్టాలకు సంబంధించి నకిలీ ప్రొసిడింగ్‌లతో పట్టాలు విక్రయించడం జగిత్యాలలో కలకలం రేపుతోంది. నిరుపేదలకు మంజూరైన ఇళ్ల పట్టాలనే నకిలీ ప్రొసిడింగ్‌లను తయారు చేసి విక్రయించడం స్థానికంగా చర్చనీయంగా మారింది. ఇదివరకు పని చేసిన గృహ నిర్మాణ శాఖ అధికారే సూత్రదారిగా అనుమానిస్తున్నారు. మల్యాల మండలం నూకపల్లి గృహ నిర్మాణ కాలనీలో నిరుపేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలనే మధ్య దళారులు సదరు అధికారి సహకారంతో ఈవ్యవహరాన్ని నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కాలనీలో జగిత్యాల పట్టణానికి చెందిన దాదాపు వెయ్యి మంది నిరుపేదలకు గత ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద పట్టాలు పంపిణీ చేసింది.

అన్యాయం జరిగినచోటే ప్రతిఘటన

బోయినిపల్లి, ఆగస్టు 28: ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే ప్రతిఘటన ప్రారంభమవుతుందని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ విమలక్క అన్నారు. ఆదివారం బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో పోరాటాల రాజవ్వ సంస్మరణ సభ చెన్నమనేని పురుషోత్తం రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న విమలక్క మాట్లాడుతూ 1978కి ముందు నుండి అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా రాజవ్వ జనశక్తి కార్యకర్తగా కొదురుపాక చిట్యాల రాజవ్వ పనిచేస్తూ పెత్తనం కోసం సాగుతున్న పోరాటంలో వ్యతిరేకంగా తిరగబడిందన్నారు.

నీటి తొట్టిలో పడి ఇద్దరు బాలుర మృతి

కోహెడ, ఆగస్టు 28: మండలంలోని తంగళ్లపల్లిలో లంకెల శివ (3) అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి ఆదివారం మృతి చెందాడు. బ్రతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్న లంకెల వెంకటేశం-పద్మలు గ్రామ దేవతల మొక్కులు చెల్లించుకునేందుకు గాను శనివారం స్వగ్రామమైన తంగళ్లపల్లికి కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. ఆదివారం మొక్కులు చెల్లించుకొనే కార్యక్రమంలో ఉండగా వీరి మూడేళ్ల బాలుడు శివ ఆడుకుంటూ తొట్టిలో పడి మృతి చెందాడు. బాలుడు కనిపించకపోవడంతో వెతకగా నీటితొట్టిలో శవమై కనిపించడంతో బోరున విలపించారు. ఈ సంఘటన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులను కలచివేసింది.
నీటి గుంతలో పడి బాలుడి మృతి

గోపాలమిత్ర ద్వారా మంచి బ్రీడ్

తిమ్మాపూర్, ఆగస్టు 28: జిల్లాలో పాల ఉత్పత్తిదారుల సభ్యులకు గోపాలమిత్ర ద్వారా మంచి బ్రీడ్ డెవలప్‌మెంట్ కోసం పశువులకు కృత్రిమ గర్భదారణ చేయిస్తున్నట్లు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, కరీంనగర్ డెయిరీ చైర్మన్ సిహెచ్ రాజేశ్వర్ రావు అన్నారు. మండలంలోని నుస్తులాపూర్‌లోని కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాల ఉత్పత్తిదారుల కేంద్రంలో ఆదివారం ‘ఆమ్ ఆద్మీ బీమా యోజన’, విద్యార్థులకు స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ఉత్పత్తిదారుల పిల్లలకు అధికంగా మార్కులు వచ్చిన విద్యార్థులకు 337 మందికి గాను రూ.2,69,600 లు పంపిణీ చేశారు.

కరీంనగర్‌లో కురిసిన వర్షం..

కరీంనగర్, ఆగస్టు 28: కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓ మోస్తారు వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో సుమారు గంట పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అలాగే సిరిసిల్ల, జగిత్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. పక్షం రోజులుగా దంచికొడుతున్న ఎండలకు ఉక్కపోతతో బేజారవుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరట కలిగించింది. ఓ మోస్తారుగా వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అటు వర్షాలు లేక ఎండిపోయే దశకు చేరుకున్న వివిధ రకాల పంటలకు కూడా ఈ వర్షం కాస్తంతా ప్రాణం పోసినట్లయింది.

మిషన్ కాకతీయ పనులను పరిశీలించిన ఓఎస్‌డి

ఇచ్చోడ, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా పునర్నిర్మాణం చేపట్టిన ఎల్లమ్మకుంట చెరువును ఆదివారం నీటి పారుదల శాఖ ఓ ఎస్‌డి శ్రీదర్ దేశ్‌పాండేతో పాటు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరిశీలించారు. ఈ చెరువు కింద ఉన్న ఆయకట్టు వివరాలతో పాటు చెరువు పునర్నిర్మాణానికి నిధుల చెల్లింపు వివరాలు నీటి పారుదల శాఖ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మిషన్ కాకతీయ పథకం రాష్ట్రంలో సత్ఫలితాలను ఇస్తుందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేక దృష్టిని పెట్టారని ఓ ఎస్‌డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

వన సంరక్షణకు పాటుపడాలి

బాసర, ఆగస్టు 28: వన సంరక్షణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాసర అమ్మవారి ఆలయానికి చెందిన భూములలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ ఒక్కరు వన సంరక్షణకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 23 శాతం ఉన్న అడవి సంపదను 33 శాతానికి పెంచేందుకు అందరూ కృషిచేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటి దాని సంరక్షణకు పాటుపడాలని సూచించారు. మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, వాటిని సంరక్షిస్తే రాబోయే తరాలకు అవి ఫలాలను అందిస్తుందని పేర్కొన్నారు.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 28: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని (ఏఐకెఎస్) తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. ఆదివారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులందరికి రుణమాఫీ చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాల వల్ల ఎందరో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

వచ్చే యేడాదికల్లా వంతెనలు పూర్తి చేస్తాం

బెజ్జూరు, ఆగస్టు 28: వచ్చే యేడాదికల్లా బెజ్జూరు మండలంలో ఉన్న వంతెనలను పూర్తి చేస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం బెజ్జూరు మండలంలోని దింద, గూడెం వంతెనలను పరిశీలించారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహితపై తెలంగాణ ప్రభుత్వం రూ.56కోట్లతో వంతెనకు నిధులు మంజూరు చేసిందని, అట్టి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వంతెన పూర్తయతే తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలకు రహదారి సౌకర్యం కలుగుతుందన్నారు. మండలంలోని దిందవాగుపై రూ.5కోట్లతో వంతెనకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

Pages