S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ఇచ్చోడ, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాలతో పాటు విద్యారంగాన్ని అభివృద్దిపర్చేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం మండలంలోని ముక్రాకె గ్రామంలో రూ.28లక్షల నిధులతో నిర్మించిన పాఠశాల అదనపు గదులు, కోకస్‌మన్నూర్ గ్రామంలో సుమారు రూ.19లక్షల నిధులతో నిర్మించిన ప్రైమరి పాఠశాల అదనపు గదుల ప్రారంభోత్సవంతో పాటు హరితహారం, ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్న అనంతరం కోకస్‌మన్నూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బియ్యాల తిరుపతి

లక్సెట్టిపేట, ఆగస్టు 28: లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బియ్యాల తిరుపతిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి తెరాస పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో చేరి పార్టీ జెండా పట్టుకొని పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని గ్రామాల్లోని యువకులను సైతం ఉత్తేజపరిచాడు. తెలంగాణ వచ్చే ముందు సకల జనుల సమ్మె కాలంలో ఆయన ప్రతీ రోజు గోదావరిలో స్నానమాచరించి తెలంగాణ రావాలని గంగాదేవి ఆలయంలో పూజలు చేశాడు. ఇదివరకు ఎంపిటిసిగా పనిచేసిన అతన్ని గుర్తించిన అదిష్టానం ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్ రావు ఆశీస్సులతో మార్కెట్ కమిటీ పీఠాన్ని అప్పగించారు.

రెండేళ్లలో బీడు భూములకు పెన్‌గంగా జలాలు

ఆదిలాబాద్, ఆగస్టు 28: ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో ఇనే్నళ్లుగా వృదాగా పోతున్న పెన్‌గంగా జలాలను బీడు భూముల్లోకి మళ్ళించి ఆదిలాబాద్ ప్రాంతాన్ని సస్యశామలం చేయడ మే ప్రభుత్వ లక్ష్యమని, రూ.368 కోట్ల వ్యయంతో మంజూరైన పనులను రెండేళ్లలో పూర్తిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో చెనాకకోర్ట బ్యారేజీ నిర్మాణ పనుల్లో భాగంగా ఆదివారం మంత్రి జోగు రామన్న కలెక్టర్ జనగ్మోహన్‌తో కలిసి హట్టిఘాట్ వద్ద నిర్మించే పంపుహౌస్ పనులను, గూడ గ్రామం వద్ద నిర్మిస్తున్న కాల్వల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.

నూతన జిల్లాలకు వెళ్లే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆప్షన్

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 28: నూతన జిల్లాలకు వెళ్లే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆప్షన్ ఇవ్వాలని, జిల్లాకేంద్రాల్లో 20శాతం హెచ్‌ఆర్‌ఎ అమలు చేయాలని ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు సడిమెల యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డిలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో 25అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు.

పేదల సొంతింటి కల డబుల్ బెడ్‌రూం ఇళ్లు

సిద్దిపేట, ఆగస్టు 28: పేదల సొంతింటి కల డబుల్‌బెడ్ రూం..అర్హులైన పేదలందరికి డబుల్‌బెడ్ రూం ఇచ్చేందుకే తెలంగాణ సర్కార్ కృతనిశ్చయంతో పని చేస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సిఎం కెసిఆర్ డబుల్‌బెడ్ రూం కోసం 5.40లక్షలు వెచ్చిస్తున్నారని తెలిపారు. పేదల ఆత్మగౌరవం కోసమే డబుల్ బెడ్‌రూంల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. మెదక్ జిల్లా సిద్దిపేట నర్సాపూర్‌లో నిర్మిస్తున్న డబుల్‌బెడ్ రూంల నిర్మాణ పనులను మంత్రి హరీష్‌రావు, అంచనాల కమిటి చైర్మన్ రామలింగారెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి పర్యవేక్షించారు.

కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలి

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 28: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలని, సెప్టెంబర్ 2న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర ద్వితీయ మహాసభలను పురస్కరించుకొని ఆదివారం సంగారెడ్డి కేవల్ కిషన్ భవన్‌లో 25యేళ్ల సంస్కరణలు- కార్మికులపై ప్రభావం అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌కు రఘవులు ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా కార్మికులకు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోందు, దోందేనని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతం

సిద్దిపేట, ఆగస్టు 28: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో ఆదివారం రాత్రి అంచనాల కమిటి రాష్ట్ర చైర్మన్ రామలింగారెడ్డితో కలిసి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ ప్యాకేజీల వారీగా పలు ప్రాజెక్టుల పై అధికారులతో సమీక్షించారు. సకాలంలో పనులు పూరె్తైయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు.

నవరాత్రోత్సవాలకు నవ్యరూపాల్లో గణనాథుడు

దౌల్తాబాద్, ఆగస్టు 28 : సెప్టెంబర్ 5 నుండి వినాయక నవరాత్రులు ప్రారంభం కానుండడంతో ఆయా గ్రామాల్లో గణపతి ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దౌల్తాబాద్‌లో గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటుచేసిన విగ్రహాల అమ్మక కేంద్రంలో ఉన్న వివిధ ఆకృతుల గణనాథుని విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో విగ్రహం 15వందల రూపాయల నుంచి 8వేల రూపాయల వరకు లభిస్తున్నాయి. గత యేడాది మండలంలోని ఆయా గ్రామాల్లో సుమారు 2వందల వరకు విగ్రహాలను ఏర్పాటుచేసి ఉత్సవాలను జరిపారు. ప్రతిమలను మూడు రోజులు మొదలుకొని 10 రోజుల వరకు నిర్వాహకుల వీలును బట్టి సమీప చెరువులో నిమజ్జనం చేస్తారు.
పోలీసుల అనుమతి తప్పనిసరి

ఆలయ భూమి అన్యాక్రాంతం!

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 28: జిల్లాలోని వర్గల్ మండలం నాచారం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమి కబ్జా చేసి వెంచర్లు వేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని లక్ష్మీనరహింహ సేవా ఆశ్రమ ట్రస్టీ చైర్మన్ ఆర్.ఇ నాగేశ్వర్‌రావు జిల్లా అధికారులను వేడుకున్నారు. ఆదివారం సంగారెడ్డి ఐబి అతిధి గృహంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 341/3 సర్వేనంబర్‌లో ఉన్న 21గుంటల ఆలయ భూమిని కొందరూ 341 సర్వేనంబర్‌లో అక్రమంగా కలుపుకొని లేఅవుట్లు వేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

యోగతోనే ఆరోగ్యం: మంత్రి హరీష్

సిద్దిపేట, ఆగస్టు 28: యోగాతోనే ఆరోగ్యమని..యోగా ప్రతి మనిషికి అవసరమని, దినచర్యలో భాగం కావాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం సుందర సత్సంగ్‌భవన్‌లో దత్తక్రియ యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసిక ఒత్తిడితో చాలామంది ఆరోగ్యాన్ని విస్మరిస్తు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మనిషికి ధనం గొప్పకాదని, ఆరోగ్యమే ముఖ్యమన్నారు. నిత్యం భయంతో బతికితే మనిషికి ఆరోగ్యం మంచిది కాదన్నారు. వ్యక్తిత్వ వికాసంతో జీవిస్తేనే మంచి ఆరోగ్యమన్నారు. రోజువారీ కార్యక్రమాల్లో యోగా పై దృష్టి సారిస్తే అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చన్నారు.

Pages