S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబై : శుక్రవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.86 పైసలుగా ఉంది. సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా, నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది.

మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కన్నుమూత

ఖమ్మం: మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం గుండెపోటుతో కొత్తగూడెంలో కన్నుమూశారు. కోనేరు మృతి పట్ల మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్ర, టీడీపీ నేత తుళ్లూరి భద్రయ్య సంతాపం తెలిపారు.

కోటి మందికి పుష్కర ఏర్పాట్లు

గుంటూరు, ఆగస్టు 4: కృష్ణా పుష్కరాలలో భక్తులకు స్వచ్ఛంద సంస్థలు సేవలందించాలని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఓపెన్ ఫోరం నిర్వహించారు. పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ కాంతిలాల్ దండే పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అందరి భాగస్వామ్యంతో పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగుకోట్ల మంది సందర్శకులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకుతగిన వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ప్రజలు సహకరించాలని కోరారు.

హోదాపై కాంగ్రెస్, వైసిపి నాటకాలు

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 4: ప్రత్యేక హోదాపై కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు నాటకాలాడుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. గురువారం అరండల్‌పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ప్రధాన కారకులైన వైఎస్‌ఆర్, కాంగ్రెస్ పార్టీలు అబద్దాలాడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరన్నారు. రాష్ట్రం సర్వనాశనం కావడానికి ప్రధాన భూమిక వహించింది ఈ రెండు పార్టీలేనన్నారు.

మేం అధికార పక్షమా.. ప్రతిపక్షమా?

తుళ్లూరు, ఆగస్టు 4: పార్టీ జెండా మోసిన తాము ప్రతిపక్షమా, అధికారపక్షమా చెప్పమంటూ తెలుగు తమ్ముళ్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎదుట గళమెత్తారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా స్థానిక గంటలమ్మ చెరువుకట్టపై చినరాజప్ప మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు పుష్పాంజలి సమర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు కార్యకర్తలు రెవెన్యూ, పోలీసు అధికారులు తమమాట వినడం లేదంటూ నిరసన వ్యక్తంచేశారు.

పుష్కర యాత్రికులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు

గుంటూరు (కార్పొరేషన్), ఆగస్టు 4: కృష్ణా పుష్కరాలు వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేయాలని పుష్కరాల ప్రత్యేకాధికారి రాజశేఖర్ తెలిపారు. గురువారం గోరంట్లలోని హోసన్న మందిరం వద్ద జరుగుతున్న పుష్కర్‌నగర్ నిర్మాణ పనులను కలెక్టర్ కాంతిలాల్‌దండే, నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మిలతో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. యాత్రికుల సౌకర్యార్ధం నిర్మిస్తున్న షెడ్‌లు, మంచినీటి సరఫరా, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, కరెంట్ సరఫరా, ఫుడ్‌కోర్డు తదితరాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

పుష్కరాలకు ఆర్టీసీ సిబ్బంది సహకరించాలి

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 4: కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీలోని వివిధ యూనియన్లు, సిబ్బంది సహాయ సహకారాలు అందించాలని రీజనల్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పేర్కొన్నారు. గురువారం ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్ తిక్కన కాన్ఫరెన్స్ హాలులో రీజియన్‌లోని అన్ని యూనియన్ల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే సిబ్బందికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. తనిఖీ అధికారులకు పుష్కరాల సమయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లాలో జరుగుతున్న పుష్కరాలను ఒక ఛాలెంజ్‌గా తీసుకుని తమ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు.

రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహంతొలగింపు

అమరావతి, ఆగస్టు 4: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా స్థానిక మ్యూజియం సెంటర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఎట్టకేలకు జిల్లా అధికార యంత్రాంగం సూచన మేరకు బుధవారం రాత్రి పొద్దుపోయాక రాత్రికి రాత్రే ఎన్‌టిఆర్ విగ్రహాన్ని తొలగించారు. రాష్ట్రంలో ఎటువంటి విగ్రహాల అనుమతికి అవకాశం లేకపోయినా అధికార దర్పంతో కొందరు నాయకులు స్థానిక నాయకుల అండదండలతో ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం ఏర్పాటుపై వైసిపి నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించి స్థానిక పోలీసుస్టేషన్‌లో నియోజకవర్గ సమన్వమకర్త కావటి మనోహర్‌నాయుడు ఫిర్యాదు కూడా చేశారు.

స్ర్తి అక్షరాస్యతతోనే సమాజాభివృద్ధి

అచ్చంపేట, ఆగస్టు 4: స్ర్తి అక్షరాస్యతతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎస్ వెంకయ్య అన్నారు. కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల లో గురువారం జరిగిన ఎస్‌ఎంసి మొ దటి సమావేశానికి ఆయన జెడ్పీటీసీ ఎన్ వెంకటేశ్వరరావు, పివి రామారావు, ఆర్ విశే్వశ్వరరావు, ఆశీర్వాదంతో కలిసి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. సమావేశానికి ఎస్‌ఎంసి చైర్మన్ యెనిగండ్ల విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. పాఠశాలలో నెలకొనివున్న సమస్యలపై ఎస్‌ఎంసి ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశం బాలికల ఉన్నత చదువుల కోసం ఇంటర్, డిగ్రీ బాలికల గురుకుల కళాశాలలు స్థాపించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

ప్రత్యేక హోదా బిల్లుకు బిజెపి సహకరించాలి

మంగళగిరి, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ఓటింగ్ జరిగితే తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు సహకరించి ఆమోదింప జేయాలని వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జలీల్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. జిఎస్‌టి బిల్లు ఆమోదించిన మాదిరిగానే ప్రత్యేక హోదా బిల్లును కూడా ఏకగ్రీవంగా రాజ్యసభలో ఆమోదించాలని జలీల్ కోరారు. ప్రత్యేక హోదాకు సహకరించకుంటే రాష్ట్రంలో బిజెపికి పుట్టగతులుండవని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ

Pages