S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లా అభివృద్ధికి సమష్ఠి కృషి అవసరం

విజయనగరం, ఆగస్టు 4: జిల్లాలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు తాము కష్టపడి పనిచేయడంతోపాటు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా సక్రమంగా పనిచేసేలా చూడాలని గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కష్టపడితేనే వెనుకబడిన విజయనగరం జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లల్లో వివిధ కార్యక్రమాల అమలులో కొన్ని సందర్భాల్లో అధికారుల కారణంగా కొన్ని తప్పులు జరిగినా సర్ధుకుపోయామని, ఇకనుంచి పథకాల అమలులో లోపాలను సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

రైతుల సమగ్ర మేలుకు పటిష్ఠ చర్యలు

ఏలూరు, ఆగస్టు 4: జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్ది నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు సమగ్ర మేలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం మైక్రో ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నూతన పండ్లతోటలను ప్రోత్సహించాలని తక్కువ ఖర్చుతో రైతు అధిక దిగుబడి సాధించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోనికి తీసుకురావాలని అప్పుడే జిల్లాలో ఉద్యానవన పంటలు అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు.

పోటెత్తిన భక్తులు

కొవ్వూరు, ఆగస్టు 4: కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో అంత్య పుష్కరాలు అయిదవ రోజు గురువారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి వరద గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుఝాము నుండీ భక్తులు తొలుత తక్కువ సంఖ్యలో వచ్చినా క్రమేణా భక్తుల తాకిడి పెరుగుతూ వచ్చింది. గోదావరికి వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నీటివల్ల స్నానమాచరించేందుకు భక్తులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. గోష్పాద క్షేత్రంలోని స్నాన ఘట్టంలో మెట్లపైకి వరద నీరు రావడంతో భక్తులు చెంబులతో నీళ్లుపోసుకుని స్నానమాచరించారు. గోష్పాద క్షేత్రంలోని స్నాన ఘట్టాలు భక్తులతో నిండిపోయాయి. పిండ ప్రదాన క్రతువులు అధికంగా జరిగాయి.

ఆధ్యాత్మిక ఝరి.. పులకిరచిన గోదావరి

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: గోదావరి నది ఒడ్డు ఒక ప్రకృతి రమణీయ దృశ్యం.. ఆ దృశ్యాల మధ్య సెల్ఫీ స్నానాలతో యువత కేరింతలు కొడుతోంది. గోదావరి నది వరద జలాల ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. దీంతోపాటు భక్త జనంలో భక్త్భివం ఉరకలేస్తోంది. గోదావరి గల గలల మధ్య తీరమంతా అంత్య పుష్కర శోభాయమానంలో పుణ్య స్నానాలతో పునీతమవుతున్న భక్తజనం పుణ్య స్నానాల మధురానుభూతిని సెల్ఫీలతో బంధిస్తున్నారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తజనం అంత్య పుష్కర స్నానాలను స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరిస్తూ మధుర స్మృతిగా పదిలపర్చుకుంటున్నారు. ఎక్కువగా యువత సెల్ఫీల్లో ఒడ్డున దృశ్యాలను తీసుకోడడం కన్పించింది.

రైలుకింద పడి యువకుడి మృతి

రైల్వేకోడూరు, ఆగస్టు 4 : మండలంలోని బాలుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం గుర్తుతెలియని యువకుడు రైలుకిందపడి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ముంబాయి నుంచి చెన్నై వెళ్లే రైలు నుంచి కిందపడి మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ సమాచారంపై రేణిగుంట రైల్వే పోలీసులకు ఫోన్ చేయగా వారు సమాధానం ఇవ్వలేదు.
అనుమానాస్పదంగా మహిళ మృతి

రాష్ట్రానికే తలమాణికంగా గండి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం

చక్రాయపేట, ఆగస్టు 4: రాయలసీమలో పేరు, ప్రఖ్యాతులు కలిగిన గండి క్షేత్రంలో రాష్ట్రంలో తలమాణికంగా అభివృద్ధి చేస్తామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం గండిక్షేత్రంలో నూతన పాలకమండలి సమావేశం దేవాదాయ సహయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, ప్రధాన అర్చకులు కేసరి స్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి సతీష్‌కుమార్‌రెడ్డితోపాటు పౌర సరఫరాల రాష్ట్ర చైర్మన్ లింగారెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండిక్షేత్రం గతంలో టిటిడి ఆధ్వర్యంలో ఉండేదన్నారు. ఈ క్షేత్రంలో లక్షలాది రూపాయల ఆదాయం వచ్చినా అభివృద్ధి అంతంత మాత్రమే ఉందన్నారు.

రాజంపేట వాణిజ్య పన్నుల శాఖలో అదనపు పన్ను!

రాజంపేట, ఆగస్టు 4:రాజంపేట ప్రభుత్వ శాఖల్లో అవినీతి రోజురోజుకు పెరుగుతూ పోతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఈ శాఖ ఆ శాఖ అన్నది లేకుండా అన్ని ప్రభుత్వశాఖల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. దీంతో సామాన్యులు పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిపై దృష్టి పెడితే తప్ప అవినీతి తగ్గుముఖం పట్టే పరిస్థితులు కానరావడం లేదు. రాజంపేట వాణిజ్య పన్నులశాఖలో ప్రతి పనికీ అదనపుపన్ను చెల్లించాల్సిన దుస్థితిని ఇక్కడి వ్యాపారస్తులు ఎదుర్కొంటున్నారు. రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నట్టే వాణిజ్య పన్నుల శాఖలో కూడా ప్రతి పనికీ ఒక రేటు ఉంది.

ఫ్లెక్సీలకెక్కిన టిడిపి విభేదాలు!

ధర్మవరం రూరల్, ఆగస్టు 4: జిల్లా తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభేదాలు మళ్లీ ఫ్లెక్సీలకెక్కాయి. నిన్నటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో బహిర్గతమయ్యాయి. నేతల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరులో క్యాడర్ నలిగిపోతోంది. ధర్మవరం నియోజకవర్గంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య తలెత్తిన విభేదాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. స్థానిక ప్రజాప్రతినిధి అంతాతానై వ్యవహరిస్తున్న తీరు పార్టీ క్యాడర్, ముఖ్యంగా మంత్రి అనుచరులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయండి

అనంతపురం, ఆగస్టు 4 : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు విజవయంతం చేయాలని కలెక్టర్ కోన శశిధర్ కోరారు. ఈమేరకు గురువారం ఎస్పీ రాజశేఖరబాబు, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతంతో కలిసి బుక్కరాయసముద్రం, ధర్మవరంలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. తొలుత ధర్మవరం సమీపంలోని కుణుతూరు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, ఫారంపాండ్స్ పనులతో పాటు ఎన్‌టిఆర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, ధర్మవరంలోని జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంతంలో మొక్కలు నాటే ప్రదేశం, బహిరంగ సభ ఏర్పాట్లు, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను పరిశీలించారు.

రైలు ఢీకొని ఇద్దరి మృతి

రాప్తాడు, ఆగస్టు 4 : మండల పరిధిలోని పండమేరు వంకలో వున్న రైల్వే బ్రిడ్జి మీద బుధవారం రాత్రి రైలు ఢీకొన్న ప్రమాదంలో గిరీష్‌నాయుడు(31), అరవిందకుమార్(30) దుర్మరణం చెందారు. ధర్మవరం రైల్వే పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మంత్రి పరిటాల సునీత మేనమామ ఆత్మకూరు మండలం గొరిదిండ్ల గ్రామానికి చెందిన కృష్ణమూర్తినాయుడు కుమారుడు గిరీష్‌నాయుడు, గుంటూరు జిల్లా అమరావతికి చెందిన అరవిందకుమార్‌లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలో పనిచేస్తున్నారు. గిరీష్‌నాయుడు సైట్ కో ఆర్డినేటర్‌గా, అరవిందకుమార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

Pages