S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చదువు’ చూపులు!

అనంతపురం, ఆగస్టు 4 : విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా జిల్లాలో అనేక మంది విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు మీడియం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా ఇంకా సుమారు ఐదారువేల మందికి అందనట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, మున్సిపల్, జడ్పీ మేనేజ్‌మెంట్లతోపాటు ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెట్, ఇతర మేనేజ్‌మెంట్లలో 5,024 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 5,80,413 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

అట్టహాసంగా మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

కదిరి టౌన్, ఆగస్టు 4: కదిరి మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణ స్వీకారం గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట అశేష జనవాహిని మధ్య అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అత్యంత సుందరంగా రూ. 15 లక్షలు ఖర్చు చేసి వేదికను తయారుచేయించారు. నియోజకవర్గం నుండి వేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి రాగా, ఈ కార్యక్రమానికి కందికుంట అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా సమాచార శాఖా మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాలు పాల్గొన్నారు.

పకడ్బందీగా సిఎం పర్యటన ఏర్పాట్లు

బుక్కరాయసముద్రం, ఆగస్టు 4: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో భాగంగా 6వ తేదీ బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జరగనున్న సభా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. గురువారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాక కోసం అనంతపురం-తాడిపత్రి రహదారి సమీపంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ స్థలం, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న బుక్కరాయసముద్రం పంచాయతీ కార్యాలయాన్ని, అనంతరం గాంధీనగర్ సమీపంలో ఉన్న కస్తూరిబాగాంధీ పాఠశాల సమీపంలో ఏర్పాటుచేస్తున్న సభా స్థలంను పరిశీలించారు.

మంత్రి అచ్చెన్నాయుడితో బాలయ్య భేటీ

హిందూపురం, ఆగస్టు 4 : కార్మిక, క్రీడల శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని గురువారం ఎపి సచివాలయంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధి, వివిధ పథకాల కింద చేపట్టే పనులకు నిధులు మంజూరు చేయాలనే తదితర అంశాలపై మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందూపురం పట్టణంలోని ఎంజిఎం క్రీడా మైదానంలో ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం రూ.17 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి కనుమూరి శేఖర్ తెలిపారు.

రైతు ఆత్మహత్య

గుత్తి, ఆగస్టు 4 : మండల పరిధిలోని పెద్దొడ్డి గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి(45) గురువారం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కర్‌రెడ్డి తనకున్న అర్ధ ఎకరా పొలంతోపాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. కౌలుకు తీసుకుని పొలంలో మూడు చోట్ల బోర్లు వేశాడు. అయితే నీళ్లు పడలేదు. అంతేగాకుండా తన అర్ధెకరా పొలంలో మిర్చి పంట సైతం దిగుబడి రాకపోవడంతో మూడేళ్లుగా అప్పులు పెరిగిపోయాయి. దీంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికం కావడంతో గురువారం ఇంట్లో పురుగుల మందు తాగాడు.

ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు

నిజామాబాద్, ఆగస్టు 4: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధిస్తూ ప్రైవేటు బడులకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు హితవు పలికారు. సర్కారీ బడుల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంపొందిస్తూ అత్యుత్తమ ఫలితాలను సాధించినప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తిని కనబరుస్తారని అన్నారు.

కళకళలాడుతున్న వరద కాల్వలు

బాల్కొండ, ఆగస్టు 4: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు చెందిన ప్రధాన కాల్వలైన కాకతీయ, సరస్వతి, లక్ష్మి కెనాల్‌తో పాటు వరదకాల్వకు నీటి విడుదల కొనసాగుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన గోదావరి బేసిన్‌లో కురిసిన వర్షాలతో పాటు మహారాష్టల్రోని విష్ణుపురి, ఆమ్రేడ్ ప్రాజెక్టు జలాలు తోడు కావడంతో ప్రాజెక్టులోకి 13వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ఎఇ మహేందర్ తెలిపారు.

123జీవో రద్దు మల్లన్నసాగర్ భూనిర్వాసితుల విజయం

కంఠేశ్వర్, ఆగస్టు 4: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బుధవారం 123జీవోను రద్దు చేయడం మల్లన్నసాగర్ భూనిర్వాసితుల విజయం అని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు వేల్పూర్ భూమయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ కోసం జీవో నెంబర్ 123ను తీసుకువచ్చి, రైతుల నుండి భూసేకరణ చేపట్టారని అన్నారు. దీంతో రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేపట్టడం జరిగిందని, ఇందుకు స్పందించిన హైకోర్టు 123జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించడం ముమ్మాటికి మల్లన్నసాగర్ రైతుల విజయమేనని అన్నారు.

ఇ-నామ్ మార్కెట్లలో రూ. 90కోట్ల విక్రయాలు

నిజామాబాద్, ఆగస్టు 4: జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం(ఇ-నామ్)కు ఇటీవల అనుసంధానమైన రాష్ట్రంలోని ఆయా మార్కెట్లలో 90కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి.పార్థసారథి తెలిపారు. ఇ-నామ్‌కు అనుసంధానమైన వాటిలో నిజామాబాద్‌తో పాటు భాగేపల్లి, వరంగల్, మలక్‌పేట, తిరుమలగిరి మార్కెట్ యార్డులు ఉన్నాయని అన్నారు. సదరు మార్కెట్ యార్డులలో ఇ-బిడ్డింగ్ ద్వారా 90కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని, రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లభించేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఆన్‌లైన్ సేవలతోనైనా మంచి పేరొచ్చేనా...?

నిజామాబాద్, ఆగస్టు 4: అవినీతి ఆరోపణల్లో ముందు వరుసలో నిలిచే రవాణా శాఖలో ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టడంతో ఇకనైనా ఆ అపప్రద నుండి సంబంధిత శాఖ అధికారులు బయటపడతారా? అన్నది సందిగ్దంగానే మారింది. ఆర్టీఎ కార్యాలయాల్లో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ ఏజెంట్లు తిష్టవేస్తూ, వివిధ పనుల కోసం వచ్చే వారిని నిలువు దోపిడీకి గురి చేయడం సర్వసాధారణ అంశంగా మారింది. వసూలైన పైకం నుండి వివిధ స్థాయిలలో పర్సంటేజీల చెల్లింపులు జరగడంతో ఆర్టీఎ ఆఫీసులలో ప్రైవేట్ ఏజెంట్లదే హవాగా కొనసాగుతూ వచ్చింది. ఎసిబి అధికారులు నిర్వహించిన దాడుల సందర్భంగా అనేక పర్యాయాలు ఈ విషయం బట్టబయలైంది.

Pages