S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ ఎయు

జగదాంబ, ఆగస్టు 4: ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని స్మార్ట్ క్యాంపస్‌గా తీర్చిదిద్దుతున్నామని ఎయు ఉప కులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం ఎయు వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన ‘యుఎస్ డెలిగేషన్ ఆన్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐటి ట్రెండ్స్’ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్ ప్రాజెక్ట్స్ నిర్వహణ దిశగా పని చేస్తున్నామన్నారు. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు నోడల్ వ్యవస్థగా ఎయు నిలుస్తుందన్నారు. వైఫై, ఇంటర్నెట్ వంటి వసతులతో ఎయు స్మార్ట్ క్యాంపస్ దిశగా నడుస్తోందన్నారు.

టిడిపిలో చేరిన మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు

విజయవాడ : విశాఖ నగర మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. దొరబాబు చాలా కాలంపాటు కాంగ్రెస్‌లో పని చేశారు. గత జివిఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. మేయర్ పదవిని ఆశించిన దొరబాబు అందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నారు. చివరి నిముషంలో మేయర్ పదవిని బిసికి ఇవ్వాలని నిర్ణయించడంతో ఆ పదవి పులుసు జనార్దనరావుకు దక్కింది. దీంతో దొరబాబు డిప్యూటీ చైర్మన్ పదవితో సరిపెట్టుకున్నారు. దొరబాబు చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన అనుచరులతో చర్చించిన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చారు.

ప్రత్యక్ష పరిజ్ఞానమే మేలు : విసి

జగదాంబ, ఆగస్టు 4: ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే దిశగా కృషి చేయాలని ఎయు ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఎయు వృక్షశాస్త్ర విభాగంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వర్సిటీని సుందరంగా తీర్చిదిద్దడంలో విద్యార్థుల భాగస్వామ్యం అవసరమన్నారు వర్సిటీలో ప్రవేశ మార్గాలు, ప్రధాన కూడళ్ళ వద్ద పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు. విద్యార్థులు మంచి ఆలోచనలతో వస్తే వర్సిటీ సుందరీకరణలో విద్యార్థుల సూచనలు స్వీకరించడం జరుగుతుందన్నారు.

ప్రతి గురువారం గ్రామాల్లో తిరగాల్సిందే!

విశాఖపట్నం, ఆగస్టు 4: అధికారులు ప్రతి గురువారం గ్రామాల్లో తిరగాల్సిందేనని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు పర్యటన ఏర్పాట్లపై గురువారం సమీక్షించిన కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను మరింత మెరుగైనరీతిలో క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో భాగంగా పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఎక్కువగా పర్యటించడం ద్వారా ఆయా కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా, మెరుగ్గా అమలు చేయవచ్చనే లక్ష్యంతో నోడల్ అధికారుల వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నారు.

గెయిల్ గ్యాస్‌ను అందుబాటులోకి తేవాలి

విశాఖపట్నం, ఆగస్టు 4: గృహ వినియోగదారులకు వీలైనంత త్వరితగతిన గెయిల్ ద్వారా వంట గ్యాస్ సరఫరా అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి గెయిల్‌తో ప్రభుత్వం జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేయడం స్వాగతిస్తున్న అంశంగా ఆయన పేర్కొన్నారు. అయితే ఇంటింటికి వంట గ్యాస్‌ను సరఫరా చేసే చర్యలు మరింత వేగవంతం కావాల్సి ఉందన్నారు. నాలుగేళ్ళ కిందట తాను శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అడవులు పార్లమెంటరీ స్థాయి సంఘ చైర్మన్‌గా ఉన్నపుడు గెయిల్ అధికారులతో సంప్రదింపులు జరిపానన్నారు.

రుషికొండ బీచ్ అందాలు పరిరక్షిస్తాం

జగదాంబ, ఆగస్టు 4: నగరంలో రుషికొండ బీచ్ తీరాన్ని పరిరక్షించి అందాలను కాపాడతామని, పూర్వస్థితికి వచ్చే విధంగా పునరుద్ధరిస్తామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. దీనికోసం రక్షణ గోడ నిర్మించడంతోపాటు బీచ్ సుందరీకరణ పనులు కూడా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చేపడతామన్నారు. బీచ్ కొంత మేరకు కోతకు గురికావడంతో ఆ ప్రాంతాన్ని గురువారం జిల్లా అధికారులతో కలసి సందర్శించారు. పర్యాటకశాఖ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీరాములనాయుడు, జివిఎంసి చీఫ్ ఇంజనీర్ చంద్రయ్య తదితరులతో బీచ్ పునరుద్ధరణ పనులపై చర్చించారు. బీచ్‌కు ఆనుకొని ఉన్న దుఖాణాలను ఖాళీ చేయించి మరోచోట వసతి కల్పిస్తామన్నారు.

‘ ఉపాధి’లో మర్రివలస భేష్!

కె.కోటపాడు, ఆగస్టు 4: ఉపాధి హామీ పనుల అమలులో మర్రివలస గ్రామం ఎంతో ముందుందని జాతీయ గ్రామీణాభివృద్ధి జాయింట్ సెక్రటరీ అపరాజిత సారంగి కొనియాడారు. గురువారం ఆమె 11 రాష్ట్రాలకు చెందిన 18 మంది ఐ.ఎ.ఎస్. అధికారులతో కలసి ఆ గ్రామం లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల తీరుతెన్నులను పరిశీలించారు. 3వ విడత అంతర రాష్ట్ర పరస్పర అవగాహన కార్యక్రమం సందర్భంగా ఆమె విశాఖపట్నం జిల్లా, కె.కోటపాడు మండలంలో మారుమూలన వున్న మర్రివలస గ్రామాన్ని ఆమె తన బృందంతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో నమ్మి నూకాలు గరువులో నీటి గుం తలు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఎఎల్ పురంలో అతిసార

కె.డి.పేట, ఆగస్టు 4: ఎ.ఎల్.పురంలో అతిసార వ్యాధి సోకి 20 మందికి పైగా వాంతులు, విరోచనాలతో మంచాన పడ్డారు. వీరిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి విశాఖ కె.జి.హెచ్.కు తరలించించారు. స్థానిక బి.సి. కాలనీలో రెండు రోజులు గా అతిసార వ్యాధి ప్రబలింది. బుధవా రం రాత్రి ఉడపర్తి బెన్నాస్వామికి తీవ్ర అస్వస్థత గురి కావడంతో కె.జి.హెచ్.కు తరలించినట్లు వైద్యాధికారిణి పద్మప్రియ తెలిపారు. గురువారం బి.సి.

ఐఐపిఎం తరలింపును సత్వరమే నిలిపివేయాలి

విశాఖపట్నం, ఆగస్టు 4: విశాఖలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపిఎం) తరలింపును ఆపాలని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. యల్లమ్మతోట పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీని ఏర్పాటుకు అనకాపల్లిలో భూమి సైతం గుర్తించారన్నారు. ఈ విద్యాసంస్థను కృష్ణాజిల్లా కొండపల్లికి తరలించడం అన్యాయమన్నారు. విశాఖలో ఇప్పటికే ఐఐఎఫ్‌టి, ఇండియన్ ఇన్‌స్టిటూక్యట్ ఆఫ్ ప్యాకేజింగ్ మేనేజ్‌మెంట్ సం స్థలను ఇప్పటికే ఇతర ప్రాంతాలకు తరలించారని గుర్తుచేశారు.

రూ.ఆరు వేల కోట్లతో చేనేత, జౌళి శాఖ అభివృద్ధి

కశింకోట, ఆగస్టు 4: ఆరువేల కోట్లతో చేనేత, జౌళి శాఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చేనేత, జౌళి శాఖ బోర్డు సభ్యులు పొన్నగంటి అప్పారావు అన్నారు. గురువారం మం డలంలో తాళ్లపాలెం గ్రామంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం తరువాత అత్యధిక ప్రాధాన్యత చేనేతకే ఉందని, ఈ రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు.

Pages