S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబిసి కోటా ఆర్డినెన్స్‌ను కొట్టివేసిన హైకోర్టు

అహ్మదాబాద్, ఆగస్టు 4: పటేళ్లకు రిజర్వేషన్ల విషయంలో గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడినవారికి (ఇబిసిలకు) పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టివేసింది. రిజర్వేషన్లకోసం ఆందోళనకు దిగిన పటేళ్లను శాంతపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మే ఒకటిన జారీ చేసిన ఈ ఆర్డినెన్స్ అనుచితమైనదని, రాజ్యాంగ వ్యతిరేకమైనదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.సుభాశ్ రెడ్డి, న్యాయమూర్తి వి.ఎం.పంచోలితో కూడిన హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో ప్రకటించింది.

10 లక్షల మందికి 18 మందే జడ్జీలు!

న్యూఢిల్లీ, ఆగస్టు 4: దేశంలో పది లక్షల మంది జనాభాకు 18 మంది న్యాయమూర్తులున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1987 నివేదిక ప్రకారం 10 లక్షల మందికి 50 మంది జడ్జీలుండాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. అయితే ఇప్పటికీ న్యాయమూర్తులు సంఖ్య పెరగలేదు. కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం వివిధ రాష్ట్రాల జనాభా, న్యాయమూర్తుల వివరాలు ఇలా ఉన్నాయి. దేశం మొత్తాన్ని చూస్తే పది లక్షల మంది జనాభాకు 17.86 మంది జడ్జిలున్నారు. మిజోరంలో ఈ నిష్పత్తి 57.74, ఢిల్లీలో 47.33, అత్యధిక జనాభాగల యూపీలో 10.54 మంది ఉన్నారు.

జడ్జీల నియామకంలో రిజర్వేషన్ల ప్రతిపాదన లేదు

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఉన్నత న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాజ్యాంగ సవరణ ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. రాజ్యాంగంలోని 124, 217 ఆర్టికల్స్‌కు లోబడే సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని పలు సంఘాలు కోరుతున్నట్టు చెప్పారు. ‘ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిల నియామకంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందాయి.

దూసుకెళుతున్న హిల్లరీ క్లింటన్!

వాషింగ్టన్, ఆగస్టు 4: అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ కీలక రాష్ట్రాల్లో దూసుకెళుతున్నారు. తాజాగా జరిగిన సర్వేలో హిల్లరీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించినప్పటికీ అదెంతో కాలం నిలవదంటూ ట్రంప్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. హిల్లరీ సాధించిన ఆధిక్యతను ట్రంప్ రెండు మూడు వారాల్లోనే సమం చేసేస్తారన్న నమ్మకంతో ఆయన విధేయులు ఉన్నారు. తాజా సర్వే వివరాలను బట్టి పెన్సిల్వేనియాలో 11శాతం, న్యూ హాంప్‌షయర్‌లో 17శాతం, మిచిగన్‌లో ఏడు శాతం ఆధిక్యత హిల్లరీకి లభించింది.

ఏపిలో ఎన్‌ఎమ్‌డిసి వజ్రాల అనే్వషణ

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ప్రభుత్వరంగ మైనింగ్ సంస్థ ఎన్‌ఎమ్‌డిసికి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో వజ్రాల అనే్వషణకు కావాల్సిన అనుమతిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో అత్యున్నత వ్యవస్థ అయిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్‌ఎసి) ఈ అనుమతిని ఎన్‌ఎమ్‌డిసికి అందించింది. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ అనుమతినిచ్చినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. కాగా, ఈ అనుమతితో అనంతపురం జిల్లాలో 152 హెక్లార్ల విస్తీర్ణంలో ఎన్‌ఎమ్‌డిసి వజ్రాల అనే్వషణ చేపట్టనుంది. 64 బోర్లను వేయనుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక ఉద్యోగుల వేతన ముఖచిత్రం

దేశంలోనే సంపన్నుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వేతనం వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా 15 కోట్ల రూపాయలుగానే ఉంది. సంస్థకు చెందిన మిగతా ఉద్యోగులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వేతనాలు పెరిగినప్పటికీ అంబానీ మాత్రం 15 కోట్ల రూపాయలనే తీసుకుంటున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి అంబానీ వేతనం 15 కోట్ల రూపాయలు (జీతం, అలవెన్సులు, పెర్కులు, కమీషన్‌సహా)గానే ఉంటుండగా, ఏటా సాధారణంగా పెరిగితే 2015-16 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు 24 కోట్ల రూపాయలకు చేరి ఉండేది. 2009 అక్టోబర్‌లో తన వేతనాన్ని 15 కోట్ల రూపాయల వద్దే ఉంచుకోవాలని అంబానీ స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్నారు.

జిఎస్‌టితో జిడిపి పరుగులు

న్యూఢిల్లీ, ఆగస్టు 4: సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంపట్ల పారిశ్రామిక, వ్యాపార రంగం ఆనందం వ్యక్తం చేసింది. ఈ పరోక్ష పన్ను సంస్కరణ ద్వారా భారత్‌కు విదేశీ మదుపరులు పోటెత్తుతారని, ఉత్పాదక రంగం కార్యకలాపాలు పెరుగుతాయని, దీంతో దేశ జిడిపి కనీసం 2 శాతమైన వృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది. ‘జిడిపితో ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయవచ్చు. ఆర్థిక క్రమశిక్షణకు ఆస్కారముంటుంది. ఉత్పాదకత పెరిగి, పారదర్శకత కనిపిస్తుంది.’ అని హిందుజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండియా చైర్మన్ అశోక్ పి హిందుజా అన్నారు.

అక్రమ సంస్థల కట్టడికి పోర్టల్ ప్రారంభించిన ఆర్‌బిఐ

ముంబయి, ఆగస్టు 4: విలువలు, నీతి, నియమాలు లేని సంస్థల ద్వారా వచ్చే అక్రమ ధనానికి కళ్లెం వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గురువారం sachet. rbi.org.in అనే ఓ వెభ్‌సైట్‌ను ప్రారంభించింది. సదరు సంస్థల సమాచారం తెలిసినవారికి ఈ వెబ్‌సైట్ ఉపకారిగా ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, తద్వారా ఎవరూ తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోకుండా నివారించినవారమవుతామని అన్నారు. నిజాయితీగల సంస్థల్లో మదుపు చేయడానికి కూడా ఈ పోర్టల్ దోహదపడగలదని అభిప్రాయపడ్డారు.

మరోసారి భంగపాటు

ముంబయి, ఆగస్టు 4: మళ్లీ అదే జరిగింది. మాల్యా ఆస్తుల వేలానికి దిగిన బ్యాంకర్లకు మరోసారి భంగపాటు తప్పలేదు. ధర తగ్గించినప్పటికీ కింగ్‌ఫిషర్ హౌస్‌ను కొనేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు మరి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరిట బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని, వాటిని చెల్లించలేక మాల్యా విదేశాలకు పారిపోయినది తెలిసిందే. ఈ క్రమంలో బకాయిల వసూళ్లలో భాగంగా మాల్యా ఆస్తుల అమ్మకానికి బ్యాంకులు సిద్ధమవగా, మార్చిలో 150 కోట్ల రూపాయలకు వేలం వేసిన కింగ్‌ఫిషర్ హౌస్‌ను గురువారం 135 కోట్ల రూపాయలకే వేలానికి పెట్టారు. అయినా స్పందన శూన్యం.

Pages