S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్

హైదరాబాద్, ఆగస్టు 4: ఇప్పటివరకు దేశంలో తాము పర్యటించిన రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే పరిశ్రమలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని యునైటెడ్ కింగ్‌డమ్ బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. ఈ బృందం ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావును గురువారం కలిసింది. భారత దేశంలోని ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అంశాన్ని పరిశీలించేందుకు ఈ బృందం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలతో భేటీ అవుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన బృందం ఇప్పటివరకు తాము సందర్శించిన రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే మంచి వాతావరణం ఉందని స్పష్టం చేసింది.

భర్త సాహసం... వాగుతో పోరాటం

దుమ్ముగూడెం, ఆగస్టు 4: గిరిజన ప్రాంతానికి చెందిన ఓ నిండు గర్భిణిని కాపాడేందుకు భర్త, స్థానికులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగుతో పోరాడి గెలిచిన సంఘటన ఇది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం పైడాగులమడుగు గ్రామానికి చెందిన గొంది లక్ష్మి అనే గర్భిణికి బుధవారం అర్థరాత్రి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఆశావర్కర్లు, కుటుంబ సభ్యులు కలిసి ఆటోలో పర్ణశాల పిహెచ్‌సీకి బయలుదేరారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కె.లక్ష్మీపురం, చింతగుప్ప గ్రామాల మధ్య వాగు ఉధృతి తగ్గకపోవడంతో అక్కడి చేరుకున్న వారు 108కి సమాచారం అందించారు. సిబ్బందితో అత్యవసర వాహనం లక్ష్మీపురం చేరుకుంది.

హైకోర్టు విధులకు నేడు హాజరుకావొద్దు

హైదరాబాద్, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్రంలోని వివిధ బార్ అసోసియేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు 5వ తేదీ శుక్రవారం హైకోర్టు విధులకు హాజరు కాకూడదని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు నిర్ణయించారు. ఏపి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఆంధ్రప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని తెలిపారు. కేంద్రం తక్షణమే ఏపికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా 13 మంది న్యాయవాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసినందుకు నిరసనగా 5వ తేదీ శుక్రవారం విధులకు హాజరు కాకూడదని తెలంగాణ న్యాయవాదుల సంఘం నిర్ణయించింది.

ఎన్టీపిసి నియామకాలను నిలిపివేసిన హైకోర్టు

హైదరాబాద్, ఆగస్టు 4: సికింద్రాబాద్‌లోని సదరన్ రీజియన్ ఎన్టీపిసి సంస్థ చేపట్టిన జూనియర్ మజ్దూర్ ఉద్యోగాల భర్తీపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్‌లో ఎన్టీపిసి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సి అరవిందరావు పిటిషన్ దాఖలు చేశారు. వౌఖిక పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం అక్రమమని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వి రవికిరణ్‌రావు వాదనలు వినిపిస్తూ అవకతవకలను అరికట్టేందుకు రాత పరీక్ష నిర్వహించాలనేది కేంద్రం విధానమన్నారు.

పొగాకు రైతుల ఆత్మహత్యలను నివారించాలి

హైదరాబాద్, ఆగస్టు 4: వచ్చే 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్న ప్రధాన నరేంద్రమోదీ సంకల్పానికి, కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకు మద్దతు తెలుపుతున్నట్లు అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) ప్రకటించింది. గురువారం అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ విలేఖర్లతో మాట్లాడుతూ, వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు, భారత ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి ప్రధాని చొరవ ఉపయోగపడుతాయన్నారు. దేశ జిడిపి వృద్ధికి పాటుపడుతున్న పొగాకు రైతులను సంక్షోభం నుంచి బయటకు తీసుకురావాలన్నారు. దేశంలో4.6 కోట్ల మంది పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. గత ఏడాది పొగాకు రైతులకు రూ.

మిషన్ భగీరథ ప్రారంభానికి ప్రధాని దూరంగా ఉండాలి

హైదరాబాద్, ఆగస్టు 4: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వౌలానా అబుల్‌కలాం అజాద్ సుజల స్రవంతి స్కీం పేరు మార్చి మిషన్ భగీరథ పేరును పెట్టారని, ఈ స్కీంను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. మిషన్ భగీరథ ప్రారంభానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దూరంగా ఉండాలని టిపిసిసి సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, టి జగ్గారెడ్డి, మల్లు రవి ప్రధానిని కోరారు. మిషన్ భగీరథకు కాకుండా వేరే కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరు కావాలని వారు కోరారు. ఈ నెల 7న అనేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

ప్యాకేజీ ఇస్తాం... తీసుకోండి!

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలపై చర్చించారు. తెలుగు దేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, లోక్‌సభలో పార్టీ పక్షం నాయకుడు తోట నరసింహం, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో కేంద్రం ఇవ్వజూపుతున్న ప్రత్యేక ప్యాకేజీ గురించి అరుణ్ జైట్లీ వివరించినట్టు చెబుతున్నారు.

వట్టిపోయిన సింగూర్‌లోకి వడివడిగా వరద

సంగారెడ్డి, ఆగస్టు 4: రెండేళ్లు నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో చరిత్రలో ఎన్నడు లేని విధంగా సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా వట్టిపోగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతోంది. వడివడిగా వస్తున్న వరదతో 6.23 టిఎంసిలకు నీరు నిల్వకొచ్చింది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల ద్వారా మంజీర నదిలోకి వరద నీరు వస్తోంది. ఎగువన మహారాష్ట్ర, కర్నాటకల్లోని ప్రాజెక్టులు నిండుకుంటే మరింతగా వరద తాకిడి పెరిగే అవకాశం ఉంది. గురువారం సాయంత్రానికి 516.65 మీటర్ల నీటి మట్టంతో 6.23 టిఎంసిల నీటి నిల్వకు చేరుకుంది.

కొత్తగా మరో ఐదు మద్యం డిపోలు

ఖమ్మం, ఆగస్టు 4: మద్యాన్ని దుకాణాలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్టవ్య్రాప్తంగా కొత్తగా ఐదు మద్యం డిపోలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల పరిధిలో ఇప్పటికే 17మద్యం డిపోలు ఉండగా, కొత్తగా మరో 5ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలోనే కొత్త డిపోలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, నల్గొండ జిల్లా సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట, రంగారెడ్డి జిల్లా మోహినాబాద్, మెదక్ జిల్లా సిద్ధిపేటలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు

జిన్నారం, ఆగస్టు 4: మెదక్ జిల్లా ఐడిఎ బొల్లారంలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న ఓ కుంటుంబాన్ని సజీవ దహనానికి యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రస్తుతం బాధితులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానికుల కధనం ప్రకారం... ఐడిఎ బొల్లారం గ్రామానికి చెందిన సుంకయ్య కుటుంబం బొల్లారం నివాసం వుంటున్నారు. జగన్నాధం సుంకయ్య అనే వ్యక్తికి భార్య సునీత, కుమారులు వీరన్న (5) క్రిష్ (3) డానియల్ (1). సుంకయ్య పందుల పెంపకంతో జీవనం కొనసాగిస్తున్నాడు. యధావిధిగా వారంతా బుధవారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.

Pages