S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులు అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మేడ్చల్, ఆగస్టు 4: విద్యార్థులు కాలక్షేపం పేరుతో అమూల్యమైన సమయాన్ని వృధా చేయసుకోకుండా దానిని సద్వినియోగం చేసుకోని ఉన్నతంగా రాణించాలని ఎంఆర్‌ఇసి కళాశాల చైర్మన్, మల్కాజ్‌గిరి ఎంపి చామకూర మల్లారెడ్డి సూచించారు. మండలంలోని మైసమ్మగూడ గ్రామంలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గురువారం మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఎంపి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రెండు పర్యాయాలు ఎన్‌బిఎ, నాక్ గుర్తింపు పొందిన కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంలో ఎక్కడ రాజీపడే ప్రసక్తేలేదన్నారు.

7న ‘చక్ దే ఇండియా-2 రైడ్’

హైదరాబాద్, ఆగస్టు 4: కాలుష్య కారకం కాని వాహనం.. తొక్కితే ఆరోగ్యకరమైన సైక్లింగ్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్న హైదరాబాద్ బై సైక్లింగ్ క్లబ్ క్లబ్ ఆధ్వర్యంలో 7వ తేదీన ‘చక్ దే ఇండియా-2 రైడ్’ను నిర్వహించనున్న నిర్వాహకులు వెల్లడించారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బై సైక్లింగ్ క్లబ్, ఆలిండియా బై సైక్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ డి.వి.

మందకృష్ణ ఎంఆర్‌పిఎస్ ఉద్యమానికి దళిత నేతల మద్దతు

వికారాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ డిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మంద కృష్ణ మాదిగ చేపట్టిన నిరసన ఉద్యమానికి దళిత నేతలు మద్దతు పలికారు. మద్దతు ప్రకటించిన వారిలో ప్రజాభిప్రాయ వేదిక రాష్ట్ర సమన్వయకర్త పెండ్యాల అనంతయ్య, మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సి.జగదీశ్ మాదిగ, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం నాయకుడు కె.అశోక్, మీసేవ మేనేజర్ డి.మొగులయ్య ఉన్నారు.

10న వర్గీకరణకు మద్దతుగా ఛలో ఢిల్లీ

ఖైరతాబాద్, ఆగస్టు 4: ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఈనెల 10న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విద్యార్థి నేతలు స్వామి మాదిగ, కోటా శ్రీనివాస్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయిందని విమర్శించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు. దళిత కులాలన్నింటికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

‘మహా’ అసంతృప్తి

హైదరాబాద్, ఆగస్టు 4: జిహెచ్‌ఎంసిలో కొత్త పాలక మండలి కొలువుదీరి ఆరు నెలలు గడుస్తున్నా, పరిపాలనలో గానీ, అభివృద్ధిలో గానీ ప్రభావమేమీ కన్పించటం లేదు.

రైల్వే అభివృద్ధి పనులు పూర్తి చేయండి

హైదరాబాద్, ఆగస్టు 4: రైల్వేశాఖలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా అధికారులను ఆదేశించారు.

అక్రమ నీటి కనెక్షన్లను గుర్తించండి

హైదరాబాద్, ఆగస్టు 4: సికింద్రాబాద్‌లోని డివిజన్-7 మారెడ్‌పల్లి పరిదిలోని లాలాపేట్ సెక్షన్ శ్రీనివాస్‌నగర్‌లో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ గురువారం ఆకస్మీక తనిఖీ నిర్వహించారు. నీటి సరఫరా, డ్రైనేజీ సమస్య వంటి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం లాలాపేట్ సెక్షన్ కార్యాలయంలో సెక్షన్ మేనేజర్‌తో పాటు లైన్‌మెన్‌లు, మీటర్ రీడర్లతో ఎండి సమావేశమయ్యారు. స్థానికంగా ఉన్న అక్రమ నీటి కనెక్షన్లను గుర్తించి వేంటనే క్రమబద్దీకరించాలని, నీటి సరఫరాకు సంబంధించి ఇండ్లలో నీటి మీటర్లు లేనివారు మీటర్లు అమర్చుకవాలని వినియోగదారులకు నోటీసులు జారీ చేయాలన్నారు.

ర్యాగింగ్ చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దు

ఘట్‌కేసర్, ఆగస్టు 4: ర్యాగింగ్‌లకు పాల్పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సైబరాబాద్ ఈస్ట్ సిపి మహేష్‌భగవత్ అన్నారు. మండల పరిధి యంనంపేట్ గ్రామంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఓరియంటేషన్, యాంటీ ర్యాంగింగ్, డ్రంకన్ డ్రైవ్‌లపై అవగాహన కార్యక్రమం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటు సరదా కోసం ర్యాగింగ్‌లకు పాల్పడి తమ ఉజ్వల భవిష్యత్‌ను స్వయంగా నాశనం చేసుకుంటున్నారన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని సాధించే వరకు నిరంతరం కృషి చేయాలన్నారు.

పోటెత్తిన పుష్కరఘాట్లు

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: గోదావరి నది వరద ఉద్ధృతి పెరిగింది..గోదావరి ప్రవాహం పెరిగి వడివడిగా సముద్రంలోకి మళ్లుతోంది భక్త జనం అదే ఉరవడిలో అంత్య పుష్కర స్నానాలకు తరలివచ్చారు. అంత్య పుష్కరం గురువారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్ధేశించిన అన్ని ఘాట్లలో సుమారు ఐదు లక్షల మంది వరకు పుష్కర స్నానాలు ఆచరించారు. గురువారం అఖండ గోదావరి నది ఎగువ రాజమహేంద్రవరంలోని స్నాన ఘట్టాల్లోనూ, అఖండ గోదావరి దిగువ స్నాన ఘట్టాల్లోనూ సుమారు 70వేల మంది వరకు పుణ్య స్నానాలు ఆచరించారు.

సిఎం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

నెల్లూరు, ఆగస్టు 4: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన యువభేరి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి జాబు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

Pages