S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భ్రూణ హత్యలకు పాల్పడ్డ వారిపై చర్యలు

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 4: భ్రూణహత్యలకు పాల్పడ్డ ఎలాంటి వారైనప్పటికి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ భానుప్రసాద్‌నాయక్ తెలిపారు.

హరితహారం లక్ష్యాలు అధిగమించాలి : కలెక్టర్

నల్లగొండ రూరల్, ఆగస్టు 4 : తెలంగాణ హరితహారం లక్ష్యాలను అధికారులు అధిగమించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సి ఎం కార్యాలయానికి హరితహారం వివరాలు రోజువారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డివిజన్ అధికారులు గ్రామస్ధాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రతి గ్రామ పంచాయితీకి 40వేల మొక్కలు నాటాలని సూచించారు. మొత్తం 406 నర్సరీల్లో 1.77 కోట్లు మొక్కలు సిద్దంగా ఉన్నాయన్నారు. రవాణా చేయడానికి 47 లక్షలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. ఎస్ ఎల్ బిసి కెనాల్ వెంట ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటాలన్నారు.

కదం తొక్కిన కమలదళం

నల్లగొండ రూరల్, ఆగస్టు 4: బిజెపి జిల్లా శ్రేణులు గురువారం జిల్లా కేంద్రంలో భారీ మోటార్ సైకిల్, కార్ల ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు స్వాగతం పలుకుతు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొని పట్టణ వీధులగుండా ప్రదర్శనగా సాగారు. బిజెపి జిల్లా పార్టీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్‌రావు జిల్లా పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి ఈ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నూతన కార్యాలయం భవనం వద్ధ మొక్కలు నాటారు.

నేడు జిల్లాకు ఎంపి కవిత రాక

నల్లగొండ, ఆగస్టు 4 : పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్ధాపకురాలు కల్వకుంట్ల కవిత రేపు, ఎల్లుండి రెండురోజుల పాటు జిల్లాలో జరుగబోయే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. నేడు శుక్రవారం రోజున ఉదయం 8 గంటలకు చౌటుప్పల్ ఆంథోని మైసమ్మ దేవాలయంలో పూజలు చేసి, చౌటుప్పల్ టెక్స్‌టైల్ పార్కును సందర్శిస్తారు. తరువాత నల్లగొండలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. 9:30 కు లక్ష్మీ గార్డెన్‌లో జరిగే తెలంగాణ జాగృతి ప్రతినిధుల సమావేశాన్ని ఆమె జెండా ఆవిష్కరించి ప్రారంభిస్తారు. అనంతరం ప్రతినిధుల సభలో ప్రసంగిస్తారు. శనివారం ఉదయం 8కి చెర్వుగట్టు గుడిలో పూజలో పాల్గొంటారు.

మార్కెట్‌లను హరితంగా తీర్చిదిద్దాలి

సూర్యాపేట, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్‌లల్లో భారీ సంఖ్యలో మొక్కలు నాటి హరిత మార్కెట్‌లుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. గురువారం పట్టణంలోని నూతన వ్యవసాయ మార్కెట్‌యార్డును సందర్శించి మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ చుట్టు పెద్దసంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలు

నల్లగొండ, ఆగస్టు 4: ప్రజాకర్షణ హామీలతో మాటల గారడితో తెలంగాణ సెంటిమెంట్ బాసటతో ఎన్నికల్లో గెలిచి గద్దె నెక్కిన సీఎం కెసిఆర్ ప్రభుత్వం పాలనా వైఫల్యాలపై బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నుండి ఉద్యమాలు ఉదృతం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రకటించారు. గురువారం నల్లగొండ పోలీస్ ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా బిజెపి ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతు సీఎం కెసిఆర్ పాలనను దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా రైతాంగాన్ని, నిరుద్యోగుల సంక్షేమం నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు.

ఉత్తరాంధ్రపై ఎందుకింత నిర్లక్ష్యం?

ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయాలే..నవ్యాంధ్రలో కూడా కొనసాగుతున్నాయి. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడి సాగునీటి వనరులను మెరుగుపరిచి భూమిని సాగులోకి తేవాలి. అయితే వెనుకబడిన ఉత్తరాంధ్రలో సాగునీటి రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైం ది. దాని పర్యవసానమే ఈ ప్రాంతంలోని ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతూ పొట్ట చేతపట్టుకుని పొరుగు జిల్లాలకు, పొరు గు రాష్ట్రాలకు, సుదూర ప్రాంతాలైన ఈశాన్య రాష్ట్రాలకు, అండమన్ నికోబార్ తదితర దీవుల ప్రాంతాలకు వలసపోతున్నారు.

-కొణతాల రామకృష్ణ (మాజీ ఎంపి, మాజీ మంత్రి)

గగన ప్రమత్తత

చోదకుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, నిమగ్నతా రాహిత్యం వల్ల కావచ్చు, నిరంతరం పొంచివున్న బీభత్స పిశాచాల దాడుల వల్ల కావచ్చు. విధి వికటించడం వల్ల కావచ్చు...వాహనాలు కూలిపోతున్నాయి, వాహనాలు పేలిపోతున్నాయి, వాహనాలు కాలిపోతున్నాయి. ఢీకొట్టి ప్రాణాలు తీస్తున్నాయి. నదులలోపడి కొట్టుకుపోతున్నాయి. సముద్రాలలో మునిగిపోతున్నాయి. ఒక బోయింగ్ విమానం ఆగస్టు మూడవ తేదీన దుబాయి విమానాశ్రయంలో దిగబోయి భూమిని ఢీకొట్టడం అతికొత్త వైపరీత్యం. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుండి ఉదయం పదిగంటల పంతొమ్మిది నిముషాలకు గగనమెక్కిన ఈ విమానం దుబాయిలో దిగబోయి పడిపోయిందట.

స్పష్టత లోపించిన గీతాలు

అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం అనే శీర్షికతో అన్నమయ్య కీర్తనలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌వారు ప్రసారం చేస్తున్నారు. అయితే ఆ పాటలు వారు (పాడేవారు) తేటగా పాడలేకపోతున్నారనిపిస్తున్నది. ఎందుకంటే ఆ గాయనీ గాయకులంతా, వారి అభ్యసనమంతా సినీ గీతాల ఆలాపనతోనే జరిగింది. అందువల్లనే స్పష్టత లోపించింది. లేదా వారికి ఈ సాహిత్య పదాలు (600 సం.నాటివి కదా) అపరిచితాలు అయి వుండవచ్చు. సినీ రాగాల తోటల్లో స్వేచ్ఛగా విహరించినవారు వారు. అంతేకాకుండా సంగీత వాద్యాల హోరు వల్ల కూడా గీతాలు ‘అ’నర్ధంగా ఉన్నాయి. పూర్వం పాడిన కీర్తనలను వింటే ఎంతో తేటగా- తేనెటీగల నాదంలా విస్పష్టంగా ఉండేవి.

సనాతన సంస్కృతి అనుసరణీయం

ఆ మధ్య రెండు వారాల్లో కేరళ ప్రాంతంలో ఇద్దరు యువతులు మానభంగానికి గురై భయంకరంగా హత్యకు గురయ్యారు. ఇంకా మొన్నమధ్య హైద్రాబాదులో ఒక ఇంజనీరింగు అమ్మాయి యాక్సిడెంటులో చనిపోయిందని, కాదు హత్యేనని ఇంకా ఎటూ తేలలేదు. ఇలా రోజూ వార్తాపత్రికలు తెరవగానే కనీసం వారానికి రెండుమూడు ఇలాంటి సంఘటనలను చదవటం బాధపడటం జరుగుతోంది. ఏదైతేనేం మనుష్యులలోని అమానుషత్వానికి నిండు ప్రాణాలు, మానాలు బలైపోతున్నాయి. వారి బాధ, తల్లిదండ్రుల బాధ ఏ ప్రభుత్వమూ తీర్చలేనిది. 2012 చివరలో జరిగిన ‘నిర్భయ’ సంఘటనల లాంటివి ఈ మూడేళ్ళలో ఎన్ని వెలుగులోకొచ్చాయో గణాంకాలు చెప్పడంకన్నా అసలు దీనికి మూలం ఎక్కడుంది అనే ఆలోచన ఎవరూ చేయటం లేదు.

- కౌస్త్భు

Pages