S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువర్స్ లవ్వింగ్లీ... 38

‘‘ఓకే, ఒక పని చేద్దాం. మనం పైకి వెళ్దాం పద. వెళ్లి షాపర్స్ స్టాప్ షోరూమ్‌లో చూద్దాం. తెల్ల చుడీదార్లో ఎవరైనా అమ్మాయి ఉందేమో వెదుకుదాం. అలాంటి అమ్మాయి అక్కడ కనిపిస్తే నీ అనుమానం తీరిపోతుంది కదా?’’ అన్నాము మేము.
‘‘షాపర్స్ స్టాప్‌కా? నేను రాను’’ భయపడుతున్నట్టుగా అన్నాడు భరణి.
మేమంతా నవ్వాము. ‘‘్భరణీ నువ్వింత పిరికివాడివనుకోలేదు’’ అన్నాము.

వరలక్ష్మి మురళీకృష్ణ

నేర్చుకుందాం

క. అతనికి ననంత పుణ్యా
న్విత యనఁదగు మాద్రవతికి నీ నఖిల జగ
న్నుత జనమేజయ పుట్టితి
ధృతిఁ బాండవవంశమునకు ఁ దేజం బెసఁగన్

హరివంశం 203

అవి మీ సొమ్ము. మీరు తీసుకొని పోవాలి అని కుంభాండుకు చెప్పగా కృష్ణుడు ఉషానిరుద్ధులను మయూరంపై అధివసింపచేసి తానూ అగ్రజుడూ, కుమారుడూ గరుడారూఢులై పశ్చిమాంభోనిధి తీర ప్రాంతానికి చేరారు. అక్కడ వాళ్ళు అసంఖ్యాకమైన బహు చిత్ర చిత్ర వర్ణితమైన గోవులు అక్కడి వనాంతరాలలో ఉండటం చూశారు వారు. పుట్టినప్పటినుంచీ పసువులను ప్రీతిగా కాచినవాడూ, పశుగణాలలో పెరిగినవాడూ కాబట్టి వాటిని మచ్చికగా పిలిచి తోలుకొనిపోవచ్చునని కృష్ణుడు గరుడుడి నుంచి అధిరోహించి వాటివైపు వెళ్లాడు.

మానవసేవే మాధవసేవ

ఒక అడవికి దగ్గరగా వున్న గ్రామంలో ఒక కట్టెలు కొట్టి అమ్ముకునేవాడు వుండేవాడు. అతడు శివభక్తుడు. ప్రతిరోజూ కట్టెలు కొట్టి ఇంటికి వెళ్ళేముందు శివాలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకొనేవాడు. ఒక రోజు అతడు ఆలయానికి వెళ్ళేసరికి అక్కడ ఒక స్వామీజీ ఉపన్యాసం ఇస్తున్నాడు. కట్టెలవాడు ఆ ఉపన్యాసాలను శ్రద్ధగా విన్నాడు. ఆ స్వామీజీ చెప్పిన ఉపన్యాసంలో సారమేమంటే, ప్రతివారూ తాము సంపాదించే సొమ్ములో కొంతభాగం దేవుని వాటాగా హుండీలో వేయమన్నాడు. అలా సొమ్మును భక్తితో సమర్పించినట్లైతే వారికి దేవుని దర్శనం కలుగుతుందని చెప్పారు. అంతేకాదు మానవసేవే మాధవసేవ అన్న విషయం ప్రతివారూ గ్రహించాలి అని బోధించారు.

- కుంటముక్కుల సత్యవాణి

లక్ష్మీబాంబ్ నాకు మైలురాయ

మంచు లక్ష్మి ముఖ్య పాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న లక్ష్మి బాంబ్ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమా పూర్తికావచ్చిందని, కామెడీ ఎంటర్‌టైనర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలగలసిన సినిమా ఇదని, రెండు పాటలు రెండు ఫైట్స్ వుంటాయని, ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని, ఈనెల 15తో టాకీ పూర్తిచేసి త్వరలోనే పాటలని విడుదల చేస్తామని, దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.

12న గ్యారేజ్ పాటలు

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ పాటలు ఈనెల 12న విడుదల కానున్నాయి. చిత్రాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేస్తారు. కాగా గురువారం నాడు ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ కొత్త స్టిల్ విడుదల చేశారు.

డర్టీగేమ్ ప్రారంభం

పరుచూరి గోపాలకృష్ణ, సురేష్, ఖయ్యూం ముఖ్యపాత్రల్లో వెంకటేశ్వర శర్మ అక్కపెద్ది దర్శకత్వంలో షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై తాడి మనోహర్‌కుమార్ నిర్మిస్తున్న ‘డర్టీగేమ్’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, నటుడు సురేష్‌తో కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా వుంది. రాజకీయ నేపథ్యంలో నడిచే సినిమా ఇది. ఈ సినిమా చూసి ఒక్క ఎమ్మెల్యే మారినా, మా నిర్మాత మనోహర్ జీవితం ధన్యమైనట్లే. కథ అంత బాగా వచ్చింది అన్నారు. సురేష్ మాట్లాడుతూ, రియాలిటీకి దగ్గరగా వుండే కథ ఇదని, మంచి టీమ్‌తో తెరకెక్కిస్తున్నామన్నారు.

తెలుగుసీమలో మలయ మారుతం

పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువే?. ఈ విషయం తెలుగు సినిమా రంగానికీ వర్తిస్తుంది. తెలుగు తెరపై మెరిసిన కథానాయికల విషయంలో చూస్తే తెలుగు అమ్మాయిల అందం కంటే పొరుగు అమ్మాయిల అందానికే దాసోహం అయ్యారు తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినిమా నిర్మాతలు. పక్క రాష్ట్రాలనుండి కథానాయికలను దిగుమతి చేసుకోవడం సాధారణమైపోయింది. ఇది ఇతర సినీరంగాల్లోనూ సాధారణమైపోయింది. తెలుగు అమ్మాయిలు.. తమిళ, మలయాళ భాషల్లో రాణించినవారు ఉన్నారు. తెలుగులో హీరోయిన్ కోసం ఎక్కువగా ముంబై ఫ్లైట్ ఎక్కే దర్శక నిర్మాతలు ఈమధ్య రూటు మార్చి కేరళ, చెన్నై ఫ్లైట్‌లు ఎక్కుతున్నారు.

-శ్రీ

దూసుకుపోతున్న జక్కన్న

సునీల్, మన్నారా చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్‌పిఎ క్రియేషన్స్ పతాకంపై ఆర్.సుదర్శన్‌రెడ్డి నిర్మించిన జక్కన్న చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ముఖ్యంగా భారీ ఓపెనింగ్స్ వసూళ్లు రాబట్టుకుంటున్న సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, దర్శకుడిగా ఇది తనకు రెండవ చిత్రం. జక్కన్న టైటిల్ ప్రేక్షకుల్లో బాగా పాపులరైందని, ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం ఆనందంగా వుంది అన్నారు. హీరో సునీల్ మాట్లాడుతూ, ఈ విజయం తన ఒక్కడివల్ల వచ్చింది కాదని, రాంప్రసాద్ సినిమా చూసి చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు.

చందమామలాంటి టీజర్

నవీన్‌చంద్ర, ప్రియల్‌గోర్ జంటగా ధర్మరక్ష దర్శకత్వంలో ఐఇఎఫ్ కార్పొరేషన్ పతాకంపై కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చందమామ రావె’. ‘అది రాదు వీడు మారడు’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ హైదరాబాద్‌లో విడుదలైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు మారుతి టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, టైటిల్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా వుందని, చాలా రోజులుగా ధర్మరక్ష పేర్లను వింటున్నానని, ఇపుడు వీరిద్దరూ దర్శకులుగా చేస్తున్న తొలి సినిమా టీజర్ బాగుందని అన్నారు.

Pages