S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలందిస్తాం

జైనూర్, ఆగస్టు 4: ఏజెన్సీలో గిరిజనులు విష జ్వరాలతో బాధపడుతున్న విషయం వాస్తవమేనని, ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినందున వైద్యసేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి కోరారు. గురువారం జైనూర్ మండలంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ఐకెరెడ్డిలు పర్యటించి, ఉసేగావ్, దేవుగూడ పిహెచ్‌సిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసి గిరిజనులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అనంతరం పిహెచ్‌సి పరిధిలో మంత్రులు మొక్కలు నాటారు.

వైద్య ఆరోగ్య శాఖలో 2118 పోస్టుల భర్తీ

ఉట్నూరు, ఆగస్టు 4: వైద్య శాఖలో ఖాళీగా ఉన్న 2118 పోస్టులను త్వరలో టిఎస్‌పిఎస్సీ ద్వారా ఈ ఏడాది భర్తీచేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక పిఎమ్మార్సీ భవనంలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి ఏజెన్సీ వ్యాధులు, అందుతున్న వైద్య సేవలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు, పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు

గద్వాల, ఆగస్టు 4: ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. గురువారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 317.88 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు 1,30,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జూరాల అధికారులు అప్రమత్తమై 13 గేట్లను రెండు మీటర్ల ఎత్తుకు తెరచి ప్రాజెక్టు నుంచి దిగువకు 1,38,401 క్యూసెక్కులను వదులుతున్నారు.

మల్లన్న సాగర్‌పై రాజకీయం తగదు

షాద్‌నగర్, ఆగస్టు 4: ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేపట్టిన మల్లన్నసాగర్ విషయంలో రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు తగదని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి హితవు పలికారు. గురువారం షాద్‌నగర్ మార్కెట్ యార్డులో కొత్త మార్కెట్ పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతుంటే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు.

కృష్ణా నదిలోని నికర, వరద జలాల...ప్రతి నీటిబొట్టును వినియోగించుకుంటాం

మహబూబ్‌నగర్, ఆగస్టు 4: కృష్ణానది నీటివాటాలోని నికర, వరదజలాల ప్రతినీటి బొట్టును జిల్లా ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రమిస్తున్నారని ఆ దిశగా ముందుకు వెళ్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలన్ని ఏకమై ప్రాజెక్టులను ఎలా అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

కృష్ణా నీటి వాటాలో నికర జలాల హక్కును విస్మరించొద్దు

మహబూబ్‌నగర్, ఆగస్టు 4: కృష్ణా నీటివాటాలో మహబూబ్‌నగర్ జిల్లాకు సంబందించి నికర జలాల హక్కును జిల్లా మంత్రులు విస్మరించొద్దని నికర జలాలు ఉన్న సంగతిని మరచిపోకూడదని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి కోరారు. గురువారం పర్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద వరినాట్లు వేయవద్దని కలెక్టర్ ఎలా చెబుతారని ఐడిబి సమావేశంలో రైతుల పక్షాన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు జూరాల బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోస్తుండగా వరి సాగు చేయవద్దని ఎలా చెబుతారన్నారు.

ఘాట్ల నిర్మాణంలో నాణ్యత కరువు

గద్వాల, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు పత్రికల్లో చెబుతున్నట్లుగా క్షేత్రస్థాయిలో జరుగడం లేదని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు. గురువారం గద్వాల సమీపంలోని నది అగ్రహారం పుష్కరఘాట్‌ను పరిశీలించారు. గతంలో నిర్మించిన ఘాట్లను పోల్చుతూ ఇప్పుడు నిర్మించిన ఘాట్ల నాణ్యతపై పెదవి విరిచారు. కేవలం 15మీటర్ల వెడల్పు, 70 మీటర్ల పొడవుతో రూ.60కోట్లతో పుష్కరఘాట్ నిర్మిస్తుండగా పార్కింగ్ పేరిట కోటి రూపాయలు మంజూరు చేయడం వెనుక అవినీతి బహిర్గతవౌతుందన్నారు.

123 జిఓ రద్దు...ప్రభుత్వానికి చెంపపెట్టు

ఆమనగల్లు, ఆగస్టు 4: 123 జిఓ రద్దు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని రైతు ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని కల్వకుర్తి ఎమ్మెల్యే డాక్టర్ చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. గురువారం ఆమనగల్లు మార్కెట్ యార్డు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేసి రైతుల నుండి భూములు కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని కొత్త కొత్త జిఓల ద్వారా రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తే రైతుల పక్షాన ప్రజాపోరాటం తప్పదని హెచ్చరించారు.

పీర్లగుట్టను చిట్టడవిగా మార్చాలి

వనపర్తి, ఆగస్టు4: వనపర్తి పట్టణానికి అనుకొని ఉన్న పీర్లగుట్టలో మొక్కలు నాటి వాటిని పెంచి చిట్టడవిగా మార్చాలని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి పట్టణంలోని పీర్లగుట్ట, మెట్టుపల్లి గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని మొక్కలు నాటామనేది ముఖ్యం కాదని, నాటిన ప్రతి మొక్కను పెంచాలని ఆయన సూచించారు. గతంలో పీర్లగుట్టపై చెట్లు అధికంగా ఉండేవని కాలక్రమేణా చెట్లు అంతరించుకుపోయాయని ఆయన అన్నారు. పీర్లగుట్టపై విరివిగా మొక్కలు నాటి చిట్టడవిగా మార్చే బాద్యత ఫారెస్టు అధికారులు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ విద్యావిధానం మహోన్నతమైనది

మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 4: ప్రభుత్వం ఆమలు చేస్తున్న విద్యావిధానం ఎంతో మహోన్నతమైనదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రూ.కోటి వ్యయంతో అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజలందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది వారిని సంస్కరవంతులుగా చేయాలని ప్రభుత్వం ఉచిత నిర్భంద విద్యాను అందిస్తుందన్నారు. ప్రభుత్వం కోట్లాది రుపాయలు ఖర్చు చేసి ఆమలు చేస్తున్న విద్యావిధానం అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసి ఆర్ విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెస్తున్నారన్నారు.

Pages