S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయవంచన బాబును నమ్మకండి

ఆమదాలవలస, ఆగస్టు 4: ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి నయవంచన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నమ్మవద్దని మాజీ మంత్రి తమ్మినేని పిలుపునిచ్చారు. పట్టణంలోని 7వ వార్డు పాతినవానివీధిలో గురువారం సాయంత్రం నిర్వహించిన గడపగడపకూ వైసిపి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్వాక్రారుణాలు మాఫీ చేస్తామని ఇంటికో ఉద్యోగం ఇస్తామని, పక్కా ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం వాగ్దానాలు చేసి ఆయా లబ్ధిదారుల నోట మట్టి కొట్టిందని సీతారాం అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులను అధికారంలోనికి వచ్చిన వెంటనే రెగ్యూలర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి చిరు ఉద్యోగులను మోసం చేసందని ఆయన అన్నారు.

పారిశ్రామికాభివృద్ధికి సాంకేతిక శిక్షణ దోహదం

ఎచ్చెర్ల, ఆగస్టు 4: పారిశ్రామికాభివృద్ధికి సాంకేతిక శిక్షణ మరింత దోహదపడుతుందని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం స్పష్టంచేశారు. ఏఏ వలస పరిధిలో ఉన్న నాగార్జున ఆగ్రికమ్ పరిశ్రమ ఆవరణలో జ్ఞాన వికాస భవన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ వికాస్ భవన్ కేంద్రంగా స్థానికంగా పనిచేస్తున్న సిబ్బందితోపాటు పరిసర గ్రామాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా సాంకేతిక శిక్షణను అందిపుచ్చుకోవచ్చునన్నారు. ఇక్కడ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తిస్తే పరిశ్రమ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. నాగార్జున గ్రూఫ్ ఆఫ్ కంపెనీ వ్యవస్థాపకుడు దివంగత కెవికె రాజు ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు.

డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఎచ్చెర్ల, ఆగస్టు 4: జిల్లాలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం అనుబంద డిగ్రీ కళాశాలకు సంబంధించిన ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టరీ ఫలితాలను వీసి ఛాంబర్‌లో గురువారం విడుదల చేశారు. 27.18 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. 12,456మంది హాజరు కాగా 3,386మంది పాసై 22.91శాతం ఫలితాలు సాధించగా వర్శిటీ అధికారులు 1.1శాతం గ్రాస్ మార్కులు కలపడంతో ప్రస్తుతం 27.18శాతానికి పెరిగిందన్నారు. రీ వాల్యూషన్‌కు ఒక సబ్జెక్ట్‌కు రూ.500 రుసుం చెల్లించాలని జవాబు పత్రాలు చూపించేందుకు ప్రతీ సబ్జెక్టుకు రూ.800 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 15 రోజులలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కస్తూర్బా విద్యాలయంలో ప్రబలిన డయేరియా

భీమిని, ఆగస్టు 4: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గత మూడు రోజులుగా 35మంది విద్యార్థినిలు విరేచనాలు, వాంతులు, తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురవగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్సలు అందించారు. అనంతరం విద్యార్థినిలను వారి ఇండ్లకు పంపించినట్లు ప్రత్యేకాధికారి నారాయణ రావు తెలిపారు. గురువారం ఉదయం 16మంది విద్యార్థినిలు విరేచనాలు, వాంతులతో సతమతమవుతుండగా వారికి కూడా చికిత్సలు అందించినట్లు తెలిపారు. పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడంతో విద్యార్థినిలు వ్యాధుల భారిన పడుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

బాసరకు పోటెత్తుతున్న భక్తులు

బాసర, ఆగస్టు 4: గోదావరి అంత్యపుష్కరాలు బాసర క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. గురువారం అంత్యపుష్కరాలు 5వ రోజుకు చేరుకున్నాయి. శ్రావణమాసం ప్రారంభం కావడంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు బాసరకు వేలాదిగా తరలివస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు గోదావరి ఘాట్లు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో చెత్తాచెదారం దర్శనమిస్తుండడంతో భక్తులు ఇబ్బందుల పాలవుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు నదీతీరం వద్ద కొలువైన శివాలయంలో అభిషేక, అర్చన పూజలు నిర్వహించి నదితీరంలో దీపాలను వదులుతున్నారు. భక్తులు, చిన్నారులు అమ్మవారి దర్శన క్యూలైన్‌లో బారులు తీరారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై టిడిపి పోరాటం

ఉట్నూరు, ఆగస్టు 4: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్ హెచ్చరించారు. గురువారం ఆర్డీవో కార్యలయం ముందు టిడిపి అధ్వర్యంలో ప్రజా సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరు, ఇంద్రవెల్లి, జన్నారం, కడెం, ఖానాపూర్‌కు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా తెలుగు యువత రాష్ట్ర నాయకుడు రితిష్ రాథోడ్ అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఏజెన్సీలో రాష్ట్ర మంత్రుల పర్యటన

ఉట్నూరు, ఆగస్టు 4: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు గురువారం ఏజెన్సీలో పర్యటించారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, కోవలక్ష్మిలతో పాటు ఆధికార యంత్రాంగంతో కలిసి ఉట్నూరు, జైనూర్, సిర్పూర్ మండలాల్లోని పలు గిరిజన గ్రామాల్లో పర్యటించి ఏజెన్సీలో గిరిజనులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ముందుగా మంత్రులు హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ అధ్వర్యంలో గంగాపూర్‌కు చేరుకొని మొక్కలు నాటారు. అనంతరం ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రసూతి గదిని ప్రారంభించారు.

కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్

దండేపల్లి, ఆగస్టు 4: కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌ల రీ డిజైనింగని ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. గురువారం దండేపల్లి మండల కేంద్రంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన సాగు నీటి ప్రాజెక్ట్‌లను రీడిజైనింగ్ పేరుతో మాయ చేస్తు తన అనుచరులకు ముఖ్యమంత్రి కెసిఆర్ పనులు కట్టబెడుతున్నాడని ఆయన ఆరోపించారు. మహుబూబ్‌నగర్ జిల్లాలో మూడు ప్రాజెక్ట్‌లు కాంగ్రెస్ హయంలో శంకుస్థాపనలు చేస్తే ఇటీవల కెసిఆర్ శంకుస్థాన చేయడం శోచనీయమన్నారు.

ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయం

తిర్యాణి, ఆగస్టు 4: ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ పేర్కొన్నారు. తిర్యాణి మండలంలోని రోంపల్లి గ్రామంలో గురువారం జనమైత్రి, పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా వైద్య శిభిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువస్తే వాటిని పరష్కరించడానికి పోలీసులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించి అభివృద్దికి బాటలు వేసుకోవాలన్నారు. గుండాల గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం రూ.25లక్షలు మంజూరయ్యాయన్నారు.

జిల్లాలో ఆగని గిరి మరణాలు

ఆదిలాబాద్, ఆగస్టు 4: జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో విష జ్వరాలు డయేరియా వ్యాధులు గిరిజనులను కుదిపేస్తున్నాయి. కిషోర బాలుర నుండి వృద్దుల వరకు వ్యాధులు అతలాకుతలం చేస్తున్నా జిల్లా యంత్రాంగం ఆశించినస్థాయిలో స్పందించడంలేదన్న విమర్శలు ఉన్నాయి. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి గురువారం ఏజెన్సీలోని ఉట్నూరు, జైనూర్, సిర్పూర్‌యు మండలాల్లో పర్యటించి వైద్యసేవలపై ఆరా తీయగా ఆసుపత్రుల్లో అడుగడుగునా వైద్య సిబ్బంది ఖాళీలు, సౌకర్యాలు లేకపోవడంతో పాటు ఆపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపించింది.

Pages