S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షట్టర్ల వినియోగానికి అనుమతి ఇవ్వండి!

శ్రీకాకుళం, జూలై 4: ఏభై కోట్ల రూపాయల వంశధార షట్టర్ల కుంభకోణాన్ని సి.ఐ.డి. అధికారులు విచారణలు చేసీచేసి... చివరికి ఐదు కోట్లు విలువచేసే షట్టర్లు తుప్పుపట్టిపోతున్నాయంటూ నివేదికలు ప్రభుత్వానికి ఇచ్చారు. దీంతో కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో మిగిలిన ఆ మాత్రం షట్టర్లు అయినా అనుమతిస్తే వంశధార కుడి, ఎడమ కాల్వల కింద గల కాలిబాట బ్రిడ్జిలకు వినియోగిస్తామంటూ కోరిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం అవినీతి షట్టర్లలో మిగిలిన వాటిని వినియోగించుకోవడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

యువత చైతన్యవంతులు కావాలి

శ్రీకాకుళం, జూలై 4: స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజుల స్ఫూర్తితో యువత చైతన్యవంతులు కావాలని, దేశానికి దశదిశ నిర్థేశించేది యువత మాత్రమేనని పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్‌నాయుడు అన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో సోమవారం స్వామివివేకానంద అమృతోత్సవాలు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మదినోత్సవం, సిక్కోలు యువశక్తి ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచానికి భారతదేశ ఔన్నత్యాన్ని, ఉనికిని చాటిచెప్పిన మహనీయుడు స్వామివివేకానంద అని అన్నారు.

పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి

ఎచ్చెర్ల, జూలై 4: తాతదండ్రుల నుండి సాగులో ఉన్న రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసి భూవిస్తరణ ప్రాప్తికి మ్యుటీషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కొంగరాంపంచాయతీ ఏజిఎన్ పేట రైతులు ఇంచార్జ్ తహశీల్దార్ బలివాడ శ్రీహరికి వినతిపత్రం అందించారు. సుమారు 150మంది రైతులు సర్వే నెంబర్ 501నుండి 520వరకు 125 ఎకరాలు భూమి కలిగి ఉన్నారు. వీరందరికీ సాగు హక్కులు కల్పించడమే కాకుండా ఆక్రమణలు తొలగించి పంట రుణాలు అందివ్వాలని కోరారు. బచ్చు నర్శింగరెడ్డి అలపాన రమణ, దువ్వు తాతయ్య, బాకి బచ్చువాడు, బస లక్ష్మణతోపాటు మరికొంతమంది రైతులు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఈ సమస్యను పరిష్కరించాలని ఏకరువు పెట్టుకున్నారు.

గిరిజన ఉత్పత్తులకు గిరాకీ

శ్రీకాకుళం(టౌన్), జూలై 4: జిల్లాలో గిరిజన ఉత్పత్తులకు మంచి గిరాకీ లభిస్తోంది. నాబార్డు ఆధ్వర్యంలో ఆర్ట్స్ సంస్థ సౌజన్యంతో మాతోట ఉత్పత్తి ద్వారా అమ్మకాలు సాగిస్తున్న ఈ ఉత్పత్తులు నాణ్యతతో పాటు బయట మార్కెట్‌లో కంటే తక్కువ ధరకు అందజేస్తున్నట్టు ఉద్యానవన శాఖ ప్రతినిధులు శంకరరావు తెలిపారు. సోమవారం ఈ మేరకు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వారు నాబార్డ్ ద్వారా అందజేసిన వ్యాన్‌లో ఈ గిరిజన ఉత్పత్తులను అమ్మకానికి పెట్టారు.

కార్మికులకు నష్టం కలిగించే జీవోలను రద్దుచేయాలి

శ్రీకాకుళం(టౌన్), జూలై 4: జిల్లాలో పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు నష్టం కలిగించే రీతిలో ఉన్న జీవోలను తక్షణమే రద్దుచేయాలని ఎఐటియుసి నాయకుడు చిక్కాల గోవిందరావు కోరారు. సోమవారం జిల్లా ఫిర్యాదుల విభాగంలో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. మున్సిపల్ కార్మికులకు నష్టం కలిగించే 279 జీవో రద్దుతో పాటు సివిల్ సఫ్లై కార్మికులకు పరిపాలన ఆమోదం తెలిపిన జీవో ప్రకారం బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

అల్లూరి పేరుతో గిరిజన జిల్లా ఏర్పాటు చేయండి

సారవకోట, జూలై 4: స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి మన్యం వీరుడుగా గుర్తింపు పొందిన ఆదర్శమూర్తి అల్లూరి సీతారామరాజు పేరుతో గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని గిరిజన జెఎసి మహిళా విభాగం అధ్యక్షురాలు బొమ్మాళి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సోమవారం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అల్లూరి 119వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

ఆలయాలు కూలదోయడం హిందూ ధర్మమా?

శ్రీకాకుళం(టౌన్), జూలై 4: రాష్ట్ర ప్రభుత్వ ధృతరాష్ట్ర పాలనను ప్రజలు ఎండగట్టేందుకు సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాషరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పొగాకు వేలం కేంద్రాల్లో వ్యాపారుల సిండికేట్

ఒంగోలు, జూలై 4: జిల్లాలోని పొగాకు బోర్డు వేలం కేంద్రాల కొనుగోళ్లలో పొగాకు వ్యాపారులు సిండికేట్ అవుతుండటంతో పొగాకు ధరలు పెరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 20 రోజుల్లో జిల్లాలోని 12 పొగాకు బోర్డు వేలం కేంద్రాలల్లో పొగాకు కొనుగోళ్లు ముగిసే దశకు చేరినప్పటికీ జిల్లాలో ఒక కేజి పొగాకుకు సగటు ధర 112 రూపాయలకు మించి ధర రావటం లేదు, అదే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక కేజికి సగటు ధర 122 రూపాయలు ధర వస్తుండగా, జిల్లాలో మాత్రం ఒక కేజికి 112 రూపాయలు ధర మించి రావటం లేదు. వ్యాపారులు సిండికేట్ కావటం కారణంగానే రైతులకు గిట్టుబాటు ధరలు రావటం లేదని రైతులు వాపోతున్నారు.

దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహాయోధుడు అల్లూరి

ఒంగోలు,జూలై 4:దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహాయోధుడు అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్ సుజాతశర్మ కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 120జయంతి వేడుకలు సోమవారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి కలెక్టర్, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు బ్రిటీష్ పరిపాలనలో అడవుల్లో నివసించే గిరిజనుల పక్షాన నిలబడి వారికి మద్దతుగా పోరాటం చేసి ప్రాణాలర్పించిన మహోన్నతుడు సీతారామరాజు అన్నారు.

ధర్మవరంలో కత్తులతో ఇరువర్గాల దాడులు

అద్దంకి, జూలై 4: ఆస్తి విషయంలో బావ-బావమరుదుల కుటుంబాల మధ్య జరిగిన తగాదా తీవ్రరూపం దాల్చి కత్తులు, వేటకొడవళ్లతో నరుక్కునే వరకు వచ్చింది. వివరాల ప్రకారం ధర్మవరం గ్రామానికి చెందిన దేవరాల పెద్ద రామాంజనేయులు, తాళ్ళూరి అంజయ్య కుటుంబాల మధ్య ఆస్తి విషయంలో వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో వివాదం ఘర్షణగా మారి ఇరువర్గాలకు చెందిన వారు కత్తులు, వేటకొడవళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో తాళ్ళూరి అంజయ్య, దేవరాల పెద్ద రామాంజనేయులుకు తీవ్రగాయాలతో రక్తమోడుతున్న దేహాలతో ఉండగా సమాచారం అందుకున్న 108వాహనం వారు క్షతగాత్రులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Pages