S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ పరిమళం (కథ)

కిరణ్ డ్యూటీ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదయింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో శ్రీమతి పరిమళకి ఫోన్ చేశాడు.
అయితే ఫోన్ స్విచ్ఛ్ఫా చేసి ఉండడంతో ఏం చెయ్యాలో తోచలేదు. పక్కింటి వాళ్లకి తాళం చెవి ఇచ్చిందేమో అని వెళ్లాడు.
అతన్ని చూడగానే ‘‘కిరణ్ వచ్చావా? నువ్వు వస్తే తాళం ఇవ్వమని మీ ఆవిడ ఇచ్చి వెళ్లింది’’ అని పక్కింటి లక్ష్మమ్మ చెప్పింది.
‘‘తను ఎక్కడికి వెళ్లింది ఆంటీ?’’ తాళం అందుకుంటూ అడిగాడు.
‘‘నీకు చెప్పలేదా? చెప్పానని నాతో అంది కదా’’
‘‘ఆ గుర్తుకొచ్చింది. చెప్పింది లెండి’’ అనేసి అక్కడి నుండి వచ్చేశాడు.

వధూవరుల జాతక పరిశీలన

జన్మలగ్నము - చంద్ర లగ్నముల లగాయితు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు ఉన్న యెడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం ఇరువురికీ ఉన్ననూ లేదా ఇరువురికీ దోషం లేకున్ననూ వివాహం చేయవచ్చును. ఈ దోషం ఒకరికి వుండి మరొకరికి లేని యెడల వైవాహిక జీవితం కలహప్రదంగా ఉంటుంది. కుజుడు కలహప్రదుడు. శని ఆయుర్దాయ కారకుడు కావున పైన చెప్పిన విధానంలోనే శనిదోషం కూడా చూడవలెను అని పరాశర మతం. ‘సచేచ్ఛ భయం వేక్షితః’ అని ఉన్న కారణంగా కుజునికి శుభ గ్రహముల కలయిక (లేదా) శుభ గ్రహ వీక్షణ ఉన్నచో దోషం ఉండదు. కేవలం ఆడవారి జాతకంలో దోషం ఉంటే మగవారికి ఇబ్బంది. కేవలం మగవారి జాతకంలో ఉంటే ఆడవారికి ఇబ్బంది.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336

సంస్కారం (కథ)

సాయంత్రం 6 గంటలయ్యింది. తిరుపతిలో నా పనులు అన్నీ పూర్తి చేసుకొని మా ఊరు రామచంద్రాపురానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండులోకి వచ్చాను. అప్పుడే మా ఊరిమీదుగా కాసీరావుపేటకు వెళ్లే బస్సు 32వ ప్లాట్‌ఫారం వద్దకు వచ్చి ఆగింది. ఆ బస్సు ఎక్కి కిటికీ వద్ద కూర్చున్నాను. అప్రయత్నంగా వెలుపలికి చూశాను. ఒక అందమైన అమ్మాయి ఎవరో వెంట పడుతున్నట్లుగా వచ్చి నా పక్కన కూర్చుంది. మరికొంతమంది బస్సు ఎక్కగానే డ్రైవర్ బస్సును స్టార్ట్ చేశాడు.
బస్టాండునుంచి రుయా ఆసుపత్రి వరకు ఎవరూ ఎక్కలేదు. అక్కడ నలుగురు కుర్రాళ్ళు ఎక్కారు. వాళ్ళను చూడగానే ఆ అమ్మాయి నాకు బలంగా ఆనుకుని కూర్చుంది.

నైరుతి దోషంతో ఆర్థిక ఇబ్బందులు (వాస్తు)

బుజ్జి (పాలకొల్లు)
ప్రశ్న: నేను వ్యాపారం చేస్తుంటాను. ఒకరోజు వ్యాపారం బాగా సాగితే, మరోరోజు వ్యాపారం అస్సలు ఉండదు. దీనికి వాస్తు కారణం అవుతుందా? అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం.
జ: మీ వ్యాపారం సాఫీగా సాగాలి అంటే మొదటిగా మీరు వ్యాపారం నిర్వహిస్తున్న స్థలంలో నైరుతిపరమైన లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకోండి. అలాగే ప్రతిరోజూ మీ వ్యాపార సంస్థలో సాంబ్రాణి ధూపం వేయండి. అలాగే గుమ్మడికాయను మీ వ్యాపార సంస్థ ప్రధాన ద్వారం దగ్గర వేలాడదీయండి. వీటి వల్ల కొన్ని దృష్టి దోషాలు తగ్గుతాయి. అలాగే మీ వ్యాపారం లాభాల బాట పడుతుంది.
కౌశిక్‌రెడ్డి (రేణిగుంట)

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28

మహావిజేత 3

చంద్రహాసుడూ, అక్షయుడూ, పద్మినీ, దుర్గీ వారు కూర్చున్న చోటనే మిగిలిపోయారు. దుర్గికి మాత్రం మనస్సులో కొంత అసంతృప్తి చోటు చేసుకుంది. పద్మినిలాగా తానూ బాణాల్ని వేయలేక పోయాననే ఆత్మన్యూనత అది. చేతిలోని విల్లును అటూఇటూ మార్చుకుంటూ అధోముఖియై ఆలోచిస్తోంది.

-విహారి 98480 25600

సేద్యం కమిషనర్ కార్యాలయంలో ‘రైతన్న’ దుస్థితి

హైదరాబాద్, మే 14: హైదరాబాద్ (ఎల్‌బి స్టేడియం)లోని తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాయంలో రైతులు (్భర్యాభర్తలు) నాగలితో భూమి దున్నుతున్నట్టు ఒక బొమ్మను గతంలో ఈ శాఖ ఏర్పాటు చేసింది. ఈ బొమ్మ ఇటీవల కింద పడిపోయింది. దీన్ని చూస్తే రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందా అన్న అనుమానం కలుగుతోంది. ఈ పరిస్థితి ఎవరికైనా బాధ కలుగిస్తోంది. రాష్ట్రానికి ప్రధాన కేంద్రమైన కమిషనర్ కార్యాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందో అనిపిస్తోంది కదూ!

బ్లాక్ మనీని వైట్ చేస్తామంటూ మోసం

హైదరాబాద్, మే 14: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం పంజగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో బ్లాక్ మనీని వైట్ చేస్తామంటూ దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్రాష్ట ముఠాను వెస్ట్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 33 లక్షల నగదుతోపాటు రెండు కార్లు, రెండు మ్యాజిక్ సూట్‌కేసులు, పేపర్ నోట్ల బండిల్స్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో వీరిపై దొంగతనాల కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఎస్‌ఇ గారూ.. సెలవుపై వెళ్లండి

హైదరాబాద్, మే 14: మిషన్ కాకతీయ పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. పనుల పురోగతిలో చాలా వెనకబడ్డారని వరంగల్ జిల్లా ఎస్‌ఇ విజయ భాస్కర్‌ను సెలవుపై వెళ్లాలని మంత్రి ఆదేశించారు. మిషన్ కాకతీయ 1, 2 పనులపై జిల్లాల వారిగా మంత్రి సమీక్ష జరిపారు. రాష్ట్ర సగటు కన్నా వెనుకబడిన రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. వరంగల్ ఎస్‌ఇపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. ఆ స్థానంలో కొత్త ఎస్‌ఇని నియమించాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.

పప్పు దినుసుల విత్తనాల ధర మరింత తగ్గింపు

హైదరాబాద్, మే 14: తెలంగాణ రాష్ట్రంలో పప్పు విత్తనాల ధరలను మరింత తగ్గించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐదు రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన ధరలకన్నా ఇవి మరింత తక్కువగా ఉన్నాయి. 2016 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరం’ గా ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కందిపప్పు విత్తనం ధర ఐదురోజుల క్రితం క్వింటాల్‌కు 7750 రూపాయలుగా నిర్ణయించగా, శనివారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ ధర 6230 రూపాయలు ఫిక్స్ చేశారు. అలాగే పెసర విత్తనాల ధరను ఇంతకు ముందు క్వింటాల్‌కు 7750 రూపాయలు ఉండగా తాజా నిర్ణయం ప్రకారం ఈ ధర 6250 రూపాయలైంది.

‘్భరోసా’ కలిగింది..

హైదరాబాద్, మే 14: తెలంగాణ పోలీస్ విభాగం నిస్సహాయకులకు చేయూతనిచ్చేందుకు దేశంలోనే ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన ‘్భరోసా’ మహిళలకు భరోసా కల్పిస్తుంది. హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా నమోదైన కేసు ఫలించడంతో మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోంది. విధినిర్వహణలో నిమగ్నమయిన మహిళా పోలీసులు సామాజిక దృక్పథంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన ఓ నిండు గర్భిణికి కౌనె్సలింగ్ ఇచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. గర్భిణికి పురుడు పోయించి పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మెహిదీపట్నంకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి మూడ్రోజుల క్రితం తన భార్యతో గొడవపడి ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టాడు.

Pages