S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్‌లో ఓటమి భయం

ఖమ్మం, మే 14: పాలేరు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని, ప్రజా విశ్వాసం కోల్పోయిన తుమ్మల ధనం, అధికార బల ప్రయోగానికి పాల్పడుతున్నారని ఏఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి ఆరోపించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భర్త మరణించడంతో అదే స్థానానికి పోటీ చేస్తున్న ఒక మహిళను ఓడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రంగంలోకి దిగడంతోనే కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. తాను గెలవకుంటే అభివృద్ధి ఆగిపోతుందని బెదిరిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా ఎపి హక్కు

హైదరాబాద్, మే 14: ప్రత్యేక హోదా సాధన ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, ఎపి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కుంటిసాకులు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఎపిలోని చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. శనివారం నాడిక్కడ మఖ్ధుంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హోదా విషయంలో రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు జవాబు చెప్పలేని దుస్థితి కేంద్రానికి నెలకొందని అన్నారు.

బాబూ నీ బండారం బయటపడింది

హైదరాబాద్, మే 14: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ అడగలేదని, కనీసం లేఖ కూడా రాయలేదని బిజెపి కేంద్ర నాయకత్వం కుండబద్దలు కొట్టినట్లు చెప్పినా టిడిపిలో చలనం లేదని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీనికోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు చెప్పారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఇకనైనా నాటకాలు మాని వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిన చంద్రబాబు ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దాసోహమయ్యారన్నారు.

అవినీతికి అడ్రస్ కాంగ్రెస్

ఖమ్మం, మే 14: దేశంలో అవినీతి అంటే తొలుత గుర్తుకు వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ నేతలు మానవత్వం, అవినీతి అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. శనివారం ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలు ప్రజల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. పాలేరు ఉప ఎన్నికలో మానవత్వం, విలువల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు గతంలో భువనగిరి, చేవెళ్ళ, నారాయణఖేడ్‌లలో ఎందుకు మాట్లాడలేకపోయారని దుయ్యబట్టారు.

సఖ్యతతోనే సాధించుకుంటాం!

విజయవాడ, మే 14: కేంద్రంలో సఖ్యతగా ఉంటూనే అక్కడి నుంచి రావల్సిన నిదులు, హోదా సాధించుకుంటామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలియచేశారు. శనివారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు లేఖ రాయలేదని కేంద్ర పెద్దలు చెప్పడం విడ్డూరంగా ఉందని అంటూ, ఆయన రాసిన లేఖలను మీడియా ముందుంచారు. రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని పదేపదే కోరుతునే ఉన్నామని అన్నారు. హోదా ఇస్తామని కేంద్ర పెద్దలు పదేపదే చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

రైల్వేస్టేషన్‌కు నిప్పు పెట్టిన మావోలు

భద్రాచలం, మే 14: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు రైల్వేస్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అప్రమత్తమై రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. బస్తర్ జిల్లా కోడెనార్ పోలీసుస్టేషన్ పరిధిలోని కుమార్‌సాంద్రా రైల్వేస్టేషన్‌కు తెల్లవారుజామున భారీ సంఖ్యలో వచ్చిన మావోయిస్టులు, మిలీషియా సభ్యులు స్టేషన్‌పై దాడి చేశారు. రైల్వేస్టేషన్ కార్యాలయంలోకి ప్రవేశించి పరికరాలను ధ్వంసం చేశారు. స్టేషన్‌కు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. ప్రధానంగా సిగ్నలింగ్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. దీంతో అధికారులు అప్రమత్తమై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

పార్టీలన్నీ ఐక్యంగా పోరాడితేనే హోదా

ద్వారకాతిరుమల, మే 14: రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలూ కలిసికట్టుగా పోరాడితేనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయాన్ని సందర్శించిన అనంతరం శేషాచల కొండపై అతిథిగృహంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. చిన వెంకన్న ఆలయ అభివృద్ధి బాగా జరిగిందని కితాబునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ పోరాడాలని సూచించారు. ఫైనాన్స్ కమిషన్ నివేదికను పరిశీలిస్తే రాష్ట్ర విభజనలో ఎన్నో సమస్యలు ఉన్నట్టు స్పష్టమైందన్నారు.

ఏలేరు రెండో దశకు టెండర్ల ఆహ్వానం

రాజమహేంద్రవరం, మే 14: ఏలేరు రెండవ దశ ఆధునికీకరణ పనులకు టెండర్లు పిలిచారు. మొదటి, రెండవ దశలు కలిపి మొత్తం రూ.238 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. తొలి ఆధునికీకరణలో రూ.108 కోట్లతో టెండర్లు పిలవగా, అందులో రూ.98 కోట్లు విలువైన పనులు చేపట్టారు. ఈ పనులు దాదాపు 20 శాతం పూర్తయ్యాయి. ఇందులో ప్రధానంగా రూ.54 కోట్ల వరకూ హెడ్‌వర్క్స్‌వి ఉన్నాయి. రెండవ దశలో రూ.130 కోట్లతో పనులు చేపడుతున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది.

ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర!

ఖమ్మం, మే 14: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక చివరి అంకానికి చేరింది. సోమవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి తెరదింపి ప్రలోభాలతో ఓటర్లకు ఎరవేయడానికి ఉపక్రమించాయి. నాలుగు మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో గత 20రోజులు విస్తృత ప్రచారం చేసిన మంత్రులు, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా పార్టీల రాష్ట్ర, కేంద్ర నాయకులు గడువు ముగియడంతో జిల్లా వదిలి వెళ్ళారు. అయితే వారంతా గ్రామాల వారీగా తయారు చేసిన టీమ్‌లు ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి.

పోర్టు భూముల ట్యాంపరింగ్‌పై నిర్లక్ష్యం

కాకినాడ, మే 14: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ పరిసరాలలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల దుమారం చెలరేగుతోంది. భూముల ట్యాంపరింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తున్నట్టు గతంలో అధికారులు చెప్పినప్పటికీ, ఆచరణలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కాజేసిన అక్రమార్కుల గుట్టు బయట పెట్టడం లేదంటూ సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన శాసన సభ్యుడు జిల్లా అధికారులపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశమయ్యింది.

Pages