S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సాగర్’కు 4659 క్యూసెక్కుల నీరు

విజయపురిసౌత్, మే 14: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్‌కు శనివారం సాయంత్రం 4659 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం 507.60 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 127.6327 టీఎంసీలకు సమానం. జంట నగరాలకు మంచి నీటి అవసరాల నిమిత్తం సాగర్ జలాశయం నుండి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. టోటల్ అవుట్ ఫ్లోగా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రస్తుతం సాగర్‌లో విద్యుత్ ఉత్పాదన పూర్తిగా నిలిచిపోయింది.

విశాఖ చేరుకున్న నేవీ చీఫ్

విశాఖపట్నం, మే 14: మరి కొద్దిరోజుల్లో పదవీ విరమణ చేయనున్న భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్‌కె.్ధవన్ రెండురోజుల పర్యటన నిమిత్తం శనివారం విశాఖపట్నం చేరుకున్నారు. పదవీ విరమణకు ముందు లాంఛనంగా వీడ్కోలు పర్యటన చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆయన తూర్పు నౌకాదళంలో పర్యటించేందుకు రాగా, ఐఎన్‌ఎస్ డేగాలో తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెసిఎస్ బిస్త్ స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం వివిధ యుద్ధనౌకల పనితీరును పరిశీలిస్తారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు నౌకాదళానికి సేవలందించిన ధోవన్ మే 31న పదవీ విరమణ చేయనున్నారు. నేషనల్ డిఫెన్సు అకాడమీలో ఆయన శిక్షణ పొందారు.

‘పుష్పగిరి’ వివాదంపై విచారణ ప్రారంభం

తిరుమల, మే 14: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన పుష్పగిరి మఠం వివాదంపై విచారణ ప్రారంభమైంది. తిరుమలలోని పుష్పగిరి మఠం నిర్వాహకులు ఇద్దరు పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకొని కోర్టుకెక్కిన నేపథ్యంలో విచారణ జరపాలంటూ న్యాయశాఖ ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీకాళహస్తి ఇఓ భ్రమరాంబను విచారణ అధికారిగా నియమించిన విషయం విధితమే. గత వారం కడపలోని పుష్పగిరి పీఠంలో విచారణ జరిపిన ఆమె శనివారం ఉదయం తిరుమలలోని పుష్పగిరి మఠంలో విచారణ జరిపారు. కడపలోని పుష్పగిరి పీఠంలో చేపట్టిన విచారణలో 80 శాతం వరకు కీలకపత్రాలను, జమా ఖర్చుల పట్టికలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక హోదా సాధనలో బాబు విఫలం

చీడికాడ, మే 14: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విఫలం చెందారని పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా చీడికాడలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించమని మొట్టమొదట సంతకం చేసింది చంద్రబాబునాయుడేనని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రికి రాసిన లేఖలో ప్రత్యేకహోదా అంశం ప్రస్తావించలేదని బిజెపి నాయకుడు సిద్దార్ధ్‌సింగ్ శుక్రవారం చేసిన ప్రకటనను బట్టి చూస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం బాబుకు ఇష్టం లేదని స్పష్టమవుతోందన్నారు.

‘జామ్’లో ఏపి నెంబర్ వన్

విజయవాడ, మే 14: జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్ యాప్ ట్రాన్జాన్షన్స్ (జామ్)ను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని ఆధార్ డైరెక్టర్ జనరల్ అజయ్ భూషణ్ పాండే తెలియచేశారు. అజయ్ భూషణ్‌తోపాటు ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు తదితరులు జిల్లాలో ఆధార్, జన్ ధన్ యోజన, మొబైల్ యాప్ ట్రాన్జాక్షన్స్ అమలు జరుగుతున్న తీరును శనివారం స్వయంగా పరిశీలించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రం ప్రకటించిన పథకాలను త్వరితగతిన అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందన్నారు.

నేడే ఎమ్సెట్

హైదరాబాద్, మే 14: తెలంగాణ ఎంసెట్ 2016కు ఉభయ రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయ. ఆదివారం నిర్వహించనున్న పరీక్షకు 2,46,522 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష హాలులోకి గంటముందు నుంచి అనుమతిస్తారని, పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఈసారి జరిగే ఎంసెట్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. గతంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహించేవారు. మొట్టమొదటిసారి పూర్తిగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఎంసెట్ నిర్వహిస్తున్నారు.

1160 పోస్టుల భర్తీ

హైదరాబాద్, మే 14: బీబీనగర్‌లోని నిమ్స్‌లో 1160 పోస్టులు భర్తీ చేయాలని నిమ్స్ పాలక మండలి నిర్ణయించింది. వైద్య మంత్రి లక్ష్మారెడ్డి నేతృత్వంలో శనివారం నిమ్స్ పాలక మండలి సమావేశం జరిగింది. నిమ్స్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీబీనగర్‌లో నిర్మిస్తున్న నిమ్స్ వైద్యశాలలో అన్ని రకాల టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు మొత్తం 1160 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిమ్స్ పాలక మండలి దీనికి సంబంధించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదానికై సిఎంకు పంపిస్తారు. అదేవిధంగా మానవ వనరుల విభాగానికి అవసరమయ్యే ఉద్యోగుల భర్తీకి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి సిఎంకు పంపాలని నిర్ణయించారు.

టిప్పర్- ఆటో ఢీ పది మంది దుర్మరణం

నిర్మల్, మే 14: ఆదిలాబాద్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన ఇటుకబట్టీ కార్మికులు. సారంగాపూర్ సమీపాన ఆరెల్లి మహాపోచమ్మ ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు 14మంది కార్మికులు శనివారం పొద్దుపోయాక సెవెన్ సీటర్ ఆటోలో బయలుదేరారు. బాసర-్భంసా రహదారిలో పడ్గాం గ్రామ సమీపాన ఎదురుగా కంకరలోడ్‌తో వస్తున్న టిప్పర్ వీరి ఆటోను ఢీకొంది. ఈ దుర్ఘటనలో టిప్పర్‌లోని కంకర అంతా ఆటోమీద పడటంతో లోపల ఉన్న పది మంది కార్మికులు ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు.

కెసిఆర్‌ది మాటల గారడీ

హైదరాబాద్, మే 14: గోదావరి నీటి పారుదల ప్రాజెక్టులపై సిఎం కె. చంద్రశేఖర్ రావు మాటల గారడి చేస్తున్నారని గోదావరి నదీ జలాల సద్వినియోగంపై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్టు నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు విమర్శించారు. 2050 నాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర ప్రకృతి వైపరీత్యాల నిరోధక సంస్థ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి శనివారం బేగంపేటలోని ‘సెస్’ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గోదావరి నదీ జలాల వినియోగంపై సిఎం కెసిఆర్ మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు.

క్రూరాతి క్రూరంగా..

హైదరాబాద్/ నార్సింగ్, మే 14: నగర శివారులోని గండిపేట సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో శుక్రవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కత్తులతో బెదిరించి ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం గండిపేట సమీపంలోని కోకాపేట గ్రామానికి చెందిన గూజ హిల్స్‌లోని అమృతానంద నిలయం ఫాంహౌస్‌లో మనోజ్‌కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నారు. అయితే ప్రతి రోజు మాదిరిగానే ఫాంహౌస్ శుక్రవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయారు.

Pages