S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు, రేపు భారీ వర్షాలు

విశాఖపట్నం, మే 14: నైరుతి బంగాళాఖాతం అనుకుని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన తర్వాత తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే కోస్తాంధ్రలోని పలు చోట్ల శనివారం వాతావరణం చల్లబడింది. తేలిపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి.

పునాదుల్లోనే సమాధి

గుంటూరు, మే 14: గుంటూరు నగరం నడిబొడ్డున లక్ష్మీపురం నాలుగు కూడలిలో బహుళ అంతస్తుల భవనం నిర్మాణ పనుల్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి కార్మికులు పనుల్లో నిమగ్నమైన సమయంలో మట్టిపెళ్లలు విరిగిపడటంతో 8మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. శిధిలాల కింద నుంచి తురకా శేషుబాబు (20), సాల్మన్ (22) మృతదేహాలను వెలికితీశారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురిని వెలికితీసేందుకు రక్షణ బలగాలు రంగంలోకి దిగాయి. భవనం అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన చుక్కపల్లి రమేష్ బినామీలదిగా ప్రచారం జరుగుతోంది.

ఆత్మరక్షణలో టిడిపి

హైదరాబాద్, మే 14: ప్రత్యేక హోదా అంశంలో అధికార తెలుగుదేశం పార్టీని మిత్రపక్షమైన బిజెపి అడ్డంగా ఇరికించింది. హోదాకోసం ఇంటా బయటా డిమాండ్లు వినిపిస్తున్న టిడిపి చిత్తశుద్ధిని శంకించే రీతిలో బిజెపి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇంచార్జి సిద్ధార్థనాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా పరిణమించడంతో, టిడిపి సంకట పరిస్థితి ఎదుర్కొంటోంది. బాబు ఏనాడూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడగలేదని, లేఖ కూడా రాయలేదని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాత్రమే లేఖలు రాశారని సింగ్ స్వయంగా వెల్లడించటంతో టిడిపి ఇరుకునపడింది. ‘నాకర్థం కాదు.

ధర్మాసుపత్రిలో దారుణం!

కర్నూలు, మే 14: రాయలసీమకే తలమానికంగా నిలిచిన కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో దారుణం వెలుగుచూసింది. ఆసుపత్రిలో మృతిచెందిన శిశువుల మృతదేహాలను పూడ్చి పెట్టాల్సి ఉండగా కాంట్రాక్టర్ ఆసుపత్రిలోని గైనిక్ వార్డులో శిశువుల 7 మృతదేహాలను ప్లాస్టిక్ బకెట్లో దాచిపెట్టారు. అయితే ఆ మృతదేహాలు కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లడంతో ఈ వ్యవహారం శనివారం వెలుగులోకి వచ్చింది. సమచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ హుటాహుటిన ఆసుపత్రిలోని గైనిక్ వార్డుకు చేరుకుని ఒక గదిలో దాచిన శిశువుల 7 మృతదేహాలను పరిశీలించి అవాక్కయ్యారు. వెంటనే సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిపించి విచారించగా ఒక శిశువు మృతదేహాన్ని ఖననం చేయడానికి రూ.

కంటైనర్లలో డబ్బు కట్టలు

కోయంబత్తూరు, మే 14: ఎన్నికల వేళ తమిళనాడులో భారీ మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనం సృష్టించింది. శనివారం తిరుపూర్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులు మూడు కంటైనర్లలో తరలిస్తున్న రూ.570 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నగదును కోయంబత్తూరులోని ఎస్‌బిఐ బ్రాంచ్‌నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం బ్రాంచీలకు తరలిస్తున్నట్లు కంటైనర్ వాహనాల వెంట ఉన్న సిబ్బంది చెప్పారని, అయితే వారి వద్ద అందుకు సరయిన డాక్యుమెంట్లు లేవని అధికారులు చెప్పారు.

వైభవంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, మే 14: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది. అంతకుముందు ఉదయం 3.30 నుంచి 5 గంటల వరకు స్వామివారికి బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

భక్తులతో తిరుమల కిటకిట

తిరుమల, మే 14: తిరుమలలో శనివారం కూడా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి రెండు కిలోమీటర్ల మేర భక్తులు స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో బారులు తీరారు. దీంతో సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా కాలినడకన వెళ్లే భక్తులకు దివ్యదర్శనం ద్వారా 8 గంటలు సమయం పడుతోంది. శనివారం తెల్లవారుజాము 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 62,659 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 25 వేల మందికిపైగా స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తుల రద్దీ పెరగడంతో వసతి కొరత ఏర్పడింది. గదులు దొరకని భక్తులు ఉద్యానవనాలు, పేవ్‌మెంట్‌లను ఆశ్రయించారు.

కర్నాటక నుంచి ఒక టిఎంసి నీరు

హైదరాబాద్, మే 14: తెలంగాణ మంచినీటి అవసరాల కోసం ఒక టిఎంసి నీటిని విడుదల చేస్తున్నట్టు కర్నాటక ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మహబూబ్‌నగర్ మంచినీటి అవసరాల కోసం నాలుగు టిఎంసిల నీటిని విడుదల చేయాలని మంత్రి హరీశ్‌రావు కర్నాటక వెళ్లి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఒక టిఎంసి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. కర్నాటక జల వనరుల ప్రిన్సిపల్ సెక్రటరీ రాకేష్ సింగ్ తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు లేఖ రాశారు.

జాతీయ స్థాయిలో బ్రాహ్మణ కార్పొరేషన్

హైదరాబాద్, మే 14: పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు జాతీయ స్థాయిలో జాతీయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ ఉద్యోగులు, అధికారులు, ప్రొఫెషనల్స్ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎ.సూర్యప్రకాశ్, కార్యదర్శి వి.సుధాకర్ కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయకు వినతిపత్రాన్ని అందజేశారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని ప్రభుత్వాలు నడుపుతున్నాయని తెలిపారు.

ఎంసెట్‌పై మళ్లీ సుప్రీంకోర్టుకు

విశాఖపట్నం, మే 14: రాష్ట్రంలో ఎంబిబిఎస్, డెంటల్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి నెలకొన్న సందిగ్ధతపై మరోసారి సుప్రీంను ఆశ్రయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మెడిసిన్‌లో ప్రవేశానికి సంబంధించి కేంద్రం అధీనంలోని నీట్ ద్వారానే భర్తీ చేయాలని సుప్రీం ఇప్పటికే తెగేసి చెప్పిన నేపథ్యంలో ఈసారికి వెసులుబాటు కల్పించే రీతిలో సుప్రీంను ఒప్పించేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేయనున్నట్టు మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

Pages