S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్రాంతికి ఎంత సమయం కేటాయిస్తారు? (పజిల్)

రిటైర్ అయిన రామకృష్ణ దినచర్య ఇలా.. నిద్రకి ఆరు గంటలు, దినచర్యలకు నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు, వాకింగ్‌కి గంటన్నర, న్యూస్ పేపర్‌కి ఒక గంట ఎనిమిది నిమిషాలు, టీవీతో గంటా నలభై ఐదు నిమిషాలు, మిత్రులతో, కుటుంబ సభ్యులతో రెండున్నర గంటలు, లైబ్రరీలో నాలుగు గంటల పది నిమిషాలు, మిగిలిన సమయం విశ్రాంతికి కేటాయిస్తారు. అది ఎంత?

జ: రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల సమయం
విశ్రాంతికి కేటాయిస్తారు.

-చామర్తి వెంకట రామకృష్ణ

పవన్..చిరులతో చేస్తానో లేదో!

దిల్ రాజు సినిమాలంటే ముఖ్యం గా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఆసక్తి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు నిర్మిస్తారన్న పేరున్న ఆయన లేటెస్టుగా తీసిన సినిమా ‘సుప్రీమ్’. సాయిధరమ్‌తేజ్ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దిల్‌రాజు చెప్పిన విశేషాలు...
రెస్పాన్స్ అదిరింది

- శ్రీ

నెలాఖరులో కబాలి పాటలు

రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పడు ‘కబాలి’ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈమధ్యే విడుదలైన టీజర్‌తో రెట్టించిన ఉత్సాహంతో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు జూలై వరకు ఇలా ఎదురుచూస్తూనే వుండాలి. అయితే ఈలోగా అభిమానుల్లో ఉత్సాహాన్ని అలాగే కొనసాగించేందుకు నెలన్నర పాటు ప్రమోషన్స్‌తో ‘కబాలి’ టీమ్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో భాగంగానే మొదట ఆడియో వేడుకను ఈనెలాఖర్లో భారీ ఎత్తున చేపట్టనున్నారని సమాచారం. తెలు గు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో కూడా రెండు వర్షన్స్ ఒకే రోజు విడుదల చేసేలా టీమ్ ప్లాన్ చేస్తోంది.

జూన్‌లో జెంటిల్‌మన్

నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘జెంటిల్‌మన్’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ‘అష్టాచమ్మ’ తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. ఇటీవల విడుదలైన తొలి టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా, కలర్‌ఫుల్‌గా సాగిన టీజర్‌కు వస్తున్న స్పందన చూసి చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది.

బిందువులే సిందువు

రామనాథం, రంగనాథం మంచి స్నేహితులు. ఒకే ఆఫీసు. ముఖ్యమైన పని ఉండటంతో ఇద్దరూ రంగనాథం ఇంటికొచ్చారు. రంగనాథం ఇల్లు పూర్వీకులు కట్టింది. విశాలంగా ఉంటుంది. ఇంటి ముందు ఖాళీ స్థలం, పెద్దపెద్ద చెట్లతో అందంగా ఉంటుంది. వీరు వెళ్లేప్పటికి ఖాళీ స్థలంలో పిల్లలు ఆడుకొంటున్నారు. గోలగోలగానే ఉంది. కానీ రంగనాథం వారినేమీ అనలేదు సరికదా ‘లోపలికి పోదాం. ఇక్కడ గొడవగా ఉంటుంది’ అంటూ రామనాథాన్ని ఇంటిలోపలికి తీసుకెళ్లాడు.

-ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి

నిత్యామీనన్ జతగా..

మలయాళంలో విజయవంతమైన ఉస్తాద్‌హోటల్ చిత్రాన్ని తెలుగులో జతగా అనే పేరుతో అనువదిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జతగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు రషీద్ అన్వర్, నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ మలయాళంలో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంలో కథాకథనాలు సరికొత్తగా ఉంటాయని, ముఖ్యంగా దుల్కర్, నిత్యామీనన్‌ల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. లవ్ సెంటిమెంట్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో పేద ధనిక వర్గాల మధ్య వుండే బేధాలు, సమానమైన అంశాలు చర్చించారని తెలిపారు.

సీతాదేవి పాటలు

సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి ప్రధాన తారాగణంగా సందీప్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ రూపొందిస్తున్న చిత్రం ‘నేను సీతాదేవి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన ఆడియోను ఎం.ఎస్.రాజు, పాశం యాదగిరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బిగ్ సీడీని విడుదల చేశారు. తొలి ఆడియో సీడీని ఎం.ఎస్.రాజు విడుదల చేసి యాదగిరిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మల్లం మాట్లాడుతూ, సీత, దేవి అనే ఇద్దరు అమ్మాయిల కథనంతో సాగే ఈ చిత్రంలో సంగీతం, కెమెరా పనితనం హైలెట్‌గా నిలుస్తాయని తెలిపారు.

అదరగొట్టిన ఐష్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ ఓ మెరుపు మెరిసింది. అందమైన దుస్తుల్లో మెరిసిపోయింది. కువైట్‌కు చెందిన ప్రఖ్యాత డిజైనర్ అలి యూనిస్ రూపొందించిన దుస్తులు ధరించిన ఐష్ రెడ్‌కార్పెట్‌పై హొయలుపోతూ నడుస్తూంటే ఆహూతులు కళ్లార్పకుండా చూస్తూండిపోయారు. బంగారువర్ణంతో ఉన్న పొడవైన గౌను ధరించిన ఐష్‌ను చూడటానికి మీడియా తహతహలాడింది. ప్రముఖ కాస్మొటిక్ సంస్థ ఎల్‌ఓరియల్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ తార సోనమ్‌కపూర్ ఆదివారంనాడు రెడ్‌కార్పెట్‌పై సందడి చేయనున్నారు. అలాగే ఈ వారంతంలో జరిగే చిత్ర ప్రదర్శనకు ‘తు హై మేర సండే’లో నటించిన బాలీవుడ్ భామ సహానా గోస్వామి రానున్నారు.

కన్నల పండువగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి: శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం సాగింది. ఉత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తితిదే అధికారులు తెలిపారు.

2019నాటికి 53లక్షల మరుగుదొడ్లు : కోడెల

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో 2019 నాటికి 53 లక్షల మరుగుదొడ్లు పూర్తి చేయడమే లక్ష్యంగా వరల్డ్ టాయిలెట్స్ ఆర్గనైజేషన్‌తో ఒప్పందం కుదర్చుకున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు.

Pages