S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుస్తకం ఓ ఆయుధం

కంఠేశ్వర్, ఏప్రిల్ 30: జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా కొనసాగుతున్న తొగర్ల సురేష్ రచించిన ‘మన కోసం..’ పుస్తకాన్ని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు.

నిర్విఘ్నంగా ’మిషన్ భగీరథ‘

నిజామాబాద్, ఏప్రిల్ 30: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులు జిల్లాలో మరింత వేగవంతం అవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా జిల్లాకు చెందిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని నియమించడంతో సొంత జిల్లాలో పనులను పరుగులు పెట్టిస్తారని భావిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే వేముల ప్రశాంత్‌రెడ్డి సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో వాటర్‌గ్రిడ్ పనులపై సమీక్ష జరిపారు.

విదేశీ వర్సిటీలను అనుమతించొద్దు

కంఠేశ్వర్, ఏప్రిల్ 30: విద్యారంగంలో విదేశీ యూనివర్శిటీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించ వద్దని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట్‌గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహిస్తున్న విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులకు శనివారం ఆయన హాజరై మాట్లాడారు. విద్యారంగంలో విదేశీ యూనివర్శిటీలను ఆహ్వానిస్తూ స్వదేశీ సంస్థలను అన్యాయం చేస్తున్నారని అన్నారు. పాలకులు విద్యను వ్యాపార దృష్టితో చూస్తూ ఈ రంగాన్ని విదేశాలకు అప్పగిస్తున్నాయని దుయ్యబట్టారు. పెట్టుబడిదారులకు కొమ్ముగాస్తూ విశ్వవిద్యాలయాలను విదేశాలకు స్థానం కల్పించడం ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నారు.

ఆసుపత్రి ముందు పసివాడి తల్లిదండ్రుల ధర్నా

నల్లగొండ టౌన్, ఏప్రిల్ 30: ఆర్‌ఎంపి వైద్యుని నిర్లక్ష్యం తమ 8నెలల పసి బాలుడు శశాంక్ ప్రాణం తీసిందంటూ బాలుని తల్లిదండ్రులు స్థానిక దేవరకొండ రోడ్డులోని ఆర్‌ఎంపి వైద్యుని ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. గత పది సంవత్సరాల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం వేముల గ్రామం నుండి వేపూరి పరుశురాములు తన భార్య సుకన్యతోసహా పట్టణంలోని వెంకటరమణ కాలనీలో దినసరి కూలీగా జీవిస్తున్నారు. అతనికి 8నెలల బాబు శశాంక్‌కు గత ఎనమిది రోజులుగా కుడి కాలుకు గడ్డతో జ్వరంతో బాధపడుతుండగా ఆర్ ఎంపి వైద్యుని సంప్రదించాడు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

వలిగొండ, ఏప్రిల్ 30: భువనగిరి-నల్లగొండ ప్రధాన రహాదారిపై నాతాళ్లగూడెం స్టేజీ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే భువనగిరి మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన భార్యభర్తలు రాసాల సోములు, జయమ్మ రామన్నపేట మండలం నీర్నెంల గ్రామానికి ఒక శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తుండగా నాతాళ్లగూడెం స్టేజీ సమీపంలో ఊక(పొట్టు) లారీ వెనకనుండి ఢీకొట్టడంతో లారీక్రింద పడి మృతి చెందారు.

ఆటోను ఢీకొన్న లారీ: ఒకరి మృతి

నేరేడుచర్ల, ఏప్రిల్ 30: నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి గ్రామసమీపంలోని మూసినది వంతెనపై ఆటోను లారీ ఢీకొనడంతో ఆటో బోల్తాపడి యాదగిరిపల్లికి చెందిన నేరెళ్ల నాగరాజు(19) మృతిచెందగా గువ్వల నాగేందర్(20)కు తీవ్రగాయాలైనాయి. నేరేడుచర్ల ఎఎస్‌ఐ సాగర్‌రావు వివరాల ప్రకారం మిర్యాలగూడ నుండి హుజూర్‌నగర్‌కు వెళ్తున్న ఎపి 24పిబి19 గల లారీ గడ్డిపల్లి నుండి యాదగిరిపల్లికి వెళ్తున్న ఆటోను చిల్లెపల్లి మూసినది వంతెనపై ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడి ఈ ప్రమాదం జరిగింది.

న్యాయం, ధర్మం పనిచేస్తే పాలేరులో కాంగ్రెస్‌దే గెలుపు

కోదాడ, ఏప్రిల్ 30: పాలేరు ఉప ఎన్నికల్లో న్యాయం, ధర్మం పనిచేస్తే కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కోదాడ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టి, డబ్బులు వెదజల్లి పాలేరు ఎన్నికల్లో గెలిచేందుకు తెరాస ప్రయత్నిస్తున్నదని కాని చైతన్యవంతులైన పాలేరు ప్రజలు ఈ ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణ తెచ్చి అన్నం పెట్టిన సోనియమ్మకు కెసిఆర్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నే తిడతారా?

నల్లగొండ, ఏప్రిల్ 30: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అధికారం వెలగబెడుతూ అధికార అహంకారం తలకెక్కించుకుని కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన దరిద్రం..శని అంటూ ఈ దేశం నుండి రాష్ట్రం నుండి కాంగ్రెస్‌ను పారదోలాలంటూ మంత్రి కెటిఆర్ విమర్శించడం ఎంతవరకు సబబని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెటిఆర్ విమర్శలు తల్లిపాలు తాగి రొమ్మునే గుద్దినట్లుగా ఉన్నాయని దుయ్యబట్టారు.

కరవు జిల్లాగా ప్రకటించాలి:టిడిపి

రామగిరి/నాంపల్లి/చింతపల్లి/గుర్రంపోడు, ఏప్రిల్ 30: నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాలను కలిపి కరువు జిల్లాగా ప్రకటించాలని తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు హరికెల నర్సిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహ్ములు డిమాండ్ చేశారు. శనివారం తెలుగుదేశం నాయకులు వివిధ మండలాలలో పర్యటించి జిల్లా కేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే 22మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు.

అమెరికా పరిజ్ఞానంతో తెలంగాణలో సేద్యం

నల్లగొండ, ఏప్రిల్ 30: తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధికి అమెరికాలో పంటల సాగులో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను వినియోగించుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం తన అమెరికా పర్యటనలో భాగంగా ఆయన కాలిఫోర్నియాలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అక్కడి రైతులు పంటల సాగులో వినియోగిస్తున్న ఆధునిక యంత్రాలను, సాగు పరికరాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో వాటి వినియోగంపై సాధ్యాసాధ్యాలను ఆయన స్థానిక వ్యవసాయ రంగ నిపుణలను అడిగి తెలుసుకున్నారు.

Pages