S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊపందుకోనున్న సాగర్ ప్రక్షాళన

హైదరాబాద్, ఏప్రిల్ 30: గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో జరుగుతుందా? లేదా అన్న అనుమానానికి తెర పడింది. సాగర్ కలుషితం, చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై జిహెచ్‌ఎంసి అధికారులు ప్రత్యేక కార్యచరణను సిద్దం చేయాలని ఆదేశిస్తూ, శాస్ర్తియంగా నిమజ్జనం జరగాలని సూచించటంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. కానీ హుస్సేన్‌సాగర్‌తో పాటు గణేష్ విగ్రహాల నిమజ్జనం ఎక్కడికక్కడే వికేంద్రీకరణగా జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు గాను గ్రేటర్‌లోని మరో తొమ్మిది చెరువుల్లో కూడా ప్రత్యేక పాండ్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

బాలల చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేయాలి

హైదరాబాద్, ఏప్రిల్ 30: బాలల న్యాయ చట్టం (జువనైల్ జస్టిస్) 2015ను సమర్ధవంతంగా అమలు చేసి బాధిత పిల్లలకు సత్వర న్యాయం జరిగేలా అన్నిచర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయ సేవల సంస్థ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం బేగంపేటలోని మేరీగోల్డ్ హోటల్‌లో జువనైల్ జస్టిస్ చట్టంపై బాలల సంక్షేమ సంస్కరణ సర్వీసులు మరియు వీధి బాలల సంక్షేమం, పోలీసు శాఖ (సిఐడి) యునిసెఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్టస్థ్రాయి సమన్వయ సమావేశాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

పరుగుతీస్తూ ప్రాణం వదిలాడు

హైదరాబాద్, ఏప్రిల్ 30: ఉద్యోగం కోసం ఒడిసా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ యువకుడు ఫిజికల్ ఫిట్నెస్‌లో భాగంగా మైదానంలో అందరితో కలిసి రన్నింగ్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంఘటన శనివారం ఉదయం చాంద్రాయణగుట్ట పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీసుల కథనం ప్రకారం సిఆర్‌పిఎఫ్‌లో మెడికల్ విభాగంలో వివిధ స్థాయి ఉద్యోగాల కోసం చాంద్రాయణగుట్ట సిఆర్‌పిఎఫ్ ట్రెయినింగ్ సెంటర్‌లోని మైదానంలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్టును శనివారం నిర్వహించారు. ఈపరీక్షలకు దేశవ్యాప్తంగా మూడు వందల మంది హాజరు కావాల్సి ఉండగా కేవలం 34 మంది హాజరయ్యారని పోలీసులు తెలిపారు. వీరిలో 12 మంది మహిళలు, 22మంది యువకులు ఉన్నారు.

‘ఎర్లీబర్డ్’తో రూ. 200 కోట్లు

హైదరాబాద్, ఏప్రిల్ 30: మహానగర పాలక సంస్థకు ప్రధాన ఆర్ధిక వనరైన ఆస్తిపన్నులో రిబేటు పొందేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎర్లీబర్డ్ స్కీం శనివారంతో ముగిసింది. ఈ నెల 1వ తేదీ నుంచి రాష్టవ్య్రాప్తంగా అమలైన ఈ పథకానికి సంబంధించి జిహెచ్‌ఎంసిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రూ. 200 కోట్ల వరకు ఆస్తిపన్ను వసూలైంది. పన్ను వసూళ్లను పెంచుకునేందుకు జిహెచ్‌ఎంసి ఎంతో చక్కగా ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకుంది. ఈ స్కీంకు సంబంధించి బకాయిదారులను చైతన్యవంతులను చేసేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రత్యేక ప్రచారం ఫలించి, జిహెచ్‌ఎంసి లక్ష్యంగా పెట్టుకున్న స్థాయిలో పన్ను వసూలు చేసుకోగల్గింది.

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఆదర్శం

సికింద్రాబాద్, ఏప్రిల్ 30: తెరాస ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తుందని తార్నాక డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి పేర్కొన్నారు.
శనివారం డివిజన్‌లో వితంతు ఫించన్లను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేవలం అభివృద్ధిలో మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిందని అన్నారు. దేశంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ ఫించన్లను అర్హులైన పేదలకు అందజేస్తూ వారి జీవితాల్లో కొత్తవెలుగులు నింపిన సిఎం కెసిఆర్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారని అన్నారు.

సిటీలో కమిషనర్ పర్యటన

హైదరాబాద్, ఏప్రిల్ 30: జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కార్పొరేషన్ జంటనగరవాసులకు అందిస్తున్న పౌరసేవల నిర్వహణ, వివిధ అభివృద్ధి పనులు పురోగతిని ఆయన పరిశీలించారు. కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దిన్‌తో కలిసి కమిషనర్ పనులు పనులను పరిశీలించారు. ప్రస్తుతం టోలీచౌకీలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు.

వైద్యురాలిపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

హైదరాబాద్, చార్మినార్, ఏప్రిల్ 30: పాతబస్తీ పెట్లబుర్జ్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఓ వైద్యురాలిపై మహిళ దాడి చేసిన సంఘటనలో చార్మినార్ పోలీసులు ఇద్దరు మహిళలను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం కర్నూలు జిల్లా కల్లూరు ప్రాంతానికి చెందిన లలిత అనే మహిళ ప్రసవం రెండు రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చి మగబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం లలిత వెంట వచ్చిన అత్త వైబి లక్ష్మిబాయిదేవి(42), వై.సుజాత(26) కలిసి రెండు రోజుల క్రితం జన్మించిన బిడ్డతో వ్యాక్సినేషన్ చుక్కల కోసం ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి వెళ్లి డాక్టర్ శే్వత ప్రియాంకను సంప్రదించింది.

కారు అద్దాలు పగులగొట్టి నగదు, పత్రాలు చోరీ

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30: ఆగి ఉన్న ఇన్నోవా కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న ఐదు లక్షల రూపాయల నగదు, విలువైన పత్రాలు చోరీ చేసిన ఘటన ఇబ్రహీంపట్నంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సిఐ జగదీశ్వర్, బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రామంతాపూర్‌కు చెందిన వ్యాపారి ఆంథోనీ.. సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టేషన్ పని నిమిత్తం వచ్చి సమీపంలో కారును నిలిపాడు. కార్యాలయంలో పని ముగించుకొని తిరిగి వచ్చే సరికి కారులో ఉన్న ఐదులక్షల రూపాయల నగదు, భూములకు సంబంధించిన విలువైన పత్రాలు, బ్యాంకు ఖాతా పాసుపుస్తకాలను గుర్తుతెయని వ్యక్తులు.. ఇన్నోవా అద్దాలు పగులగొట్టి చోరీ చేశారు.

దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ

నాచారం, తార్నాక, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెవెన్యూలో మిగులు రాష్ట్రంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సలహాదారుడు డాక్టర్ జిఆర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఓయులోని ఐసిఎస్‌ఎస్‌ఆర్ హాల్‌లో ఓయు ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ’అనే అంశంపై జరిగిన ఒకరోజు సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. మిగులు రాష్ట్రం అయినప్పప్పటికి అప్పులు ఎందుకు చేస్తున్నారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉన్నాయని అన్నారు. అందుకే అప్పులు చేయక తప్పని పరిస్థితి ఉందని అన్నారు.

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

ఘట్‌కేసర్, ఏప్రిల్ 30: అంకిత భావంతో ఉద్యోగం నిర్వర్తించి అందరి మన్నలను పొందిన ఫీల్డ్ ఆఫిసర్ జగదీశ్వర్‌రెడ్డిని తోటి ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీటిసి సభ్యడు మంద సంజీవరెడ్డి అన్నారు. మండల రైతు సేవా సహకార సంఘంలో 33 సంవత్సరాలు ఫీల్డ్ ఆఫిసర్‌గా విధులు నిర్వర్తిస్తు మండల రైతులకు అనేక విశిష్ఠ సేవలు అందించి మన్నలను పొందినట్లు తెలిపారు. క్రమ శిక్షణతో విధులను నిర్వర్తించి మండల వ్యాప్త ప్రజలకు దగ్గర అయినట్లు పేర్కొన్నారు. మండల రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి మాట్లాడుతు మండల ఫీల్డ్ ఆఫిసర్‌గా తన ఉద్యోగం పూర్తి కాలం ఇక్కడే పని చేసి అందరి మన్నలను పొందినట్లు చెప్పారు.

Pages