S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి: కలెక్టర్

హైదరాబాద్, ఏప్రిల్ 30: మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు వీలుగా ఆయా వర్గాలను చైతన్యపరిచేందుకు ఉద్దేశించిన ప్రచార వాహనాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా శనివారం కలెక్టరేట్‌లో లాంఛనంగా జెండా వూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ రెసిడెన్షిల్ పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చాయని, అదేరకమైన వాతావరణాన్ని సదుపాయాలను మైనార్టీ విద్యార్థులకు కూడా అందచేసి విద్యాపరంగా వారికి మంచి భవిష్యత్తును కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు అనుగుణణంగా ఇటీవలనె రాష్టవ్య్రాప్తంగా 68 గురుకుల పాఠశాలలను నెలకొల్పాలని నిశ్చయించిందన్నారు.

పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత బలోపేతం

మేడ్చల్, ఏప్రిల్ 30: పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, గ్రామీణ వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవశ్యకత ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం ఉదయం మంత్రి జిల్లాలోని మేడ్చల్ మండలం ఎల్లంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారమే బాధ్యతలను స్వీకరించిన మంత్రి జూపల్లి.. మొదటిసారిగా ఎల్లంపేట్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేయడం గమన్హారం. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పన్నుల విధింపు విధానంలో మార్పు తీసుకు వస్తామని అన్నారు. వాస్తవ ఆదాయానికనుగుణంగా పన్నులు విధించే విధానంలేదని వివరించారు.

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి

గచ్బిబౌలి, ఏప్రిల్ 30: ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. కమిషనరేట్‌లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు. జెఎన్‌టియు అధికారులను సంప్రదించిన తర్వాత వారి సూచనల మేరకు కమిషనరేట్‌లో ఆరు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షం నీటిని పరిరక్షించుకొని భావితరాలకు మంచినీటిని అందించాలని చెప్పారు. అన్ని పోలీస్‌స్టేషన్లలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని ఆదేశించామని గుర్తుచేశారు. స్వచ్చంద సంస్థలు చేయూనివ్వాలని కోరారు.

గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30: తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 2016-17 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురుకులంలో ప్రవేశానికి మే 5 నుండి 7 వరకు మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. జిల్లాలో బాలురకు బాల్‌నగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, పరిగి, బాలికలకు రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, తాండూర్‌లలో కొత్తగా పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. వీటిల్లో ప్రవేశానికి గానూ విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు వివరించారు.

కరవుపై నివేదిక ఇస్తే సహాయం అందిస్తాం

ముషీరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువుపై సమగ్ర నివేదిక పంపిస్తే కేంద్రం నుంచి సహాయం అందిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇప్పటికే రూ.385 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. హరే కృష్ణా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని దత్తాత్రేయ ముఖ్య అతిధిగా హాజరై తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ తో కలిసి ప్రారంభించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ హరేకృష్ణ ఫౌండేషన్ కేవలం రూ.5కే 500 కేంద్రాలలో భోజనాన్ని సరఫరా చేస్తుండటం అభినందనీయమని అన్నారు. కానీ నగరంలో భోజనం ధరతో సమానంగా మంచినీటి ధర ఉందని చెప్పారు.

పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగాలు

మంచాల: రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పట్నం మహేంధర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీలో భూనిర్వాసితులైన యాచారం మండలం కుర్మిద్ధ గ్రామ రైతులకు పరిహారాన్ని పంపిణీ చేశారు. మొత్తం 363 మంది రైతుల్లో 144 మందికి 20కోట్ల రూపాయల పరిహారాన్ని పంపిణీ చేశారు. ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. నూతన పారిశ్రామిక విధానానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు.

నగరంలో గాలి దుమారం

హైదరాబాద్, చార్మినార్, ఏప్రిల్ 30: నగరంలో మధ్యాహ్నం పూట ఎండలు బాగా మండిపోతూనే సాయంత్రం వేళల్లో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై గాలి దుమారం రేగింది. దీంతో పలు చోట్ల చెత్తాచెదారం ఎగిరిపడటంతో బైక్‌లపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో ఎనిమిది గంటలకు ప్రారంభం కావల్సిన ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌కు వానా కాస్త ఇబ్బందులు కల్గించింది. ఒక్కసారిగా దుమ్ము, దూళితో కూడిన గాలి దుమారం రేగటంతో అప్పటి వరకు మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన జనం గాలికి తట్టుకోలేక ఇంటి ముఖం పట్టారు.

లక్ష్యాల సాధనకు పూర్తి సహకారం

హైదరాబాద్, ఏప్రిల్ 30: రైల్వేలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ పనులను నిర్ధేశిత లక్ష్యం మేరకు పూర్తిచేసేందుకు ప్రయత్నించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా తమ విభాగానికి చెందిన ఇంజనీర్లను ఆదేశించారు. ఇందుకు రైల్వేలోని సంబందిత శాఖలన్నీ పూర్తి సహకారం అందిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు.

తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

ఖైరతాబాద్, ఏప్రిల్ 30: ఎన్నో పోరాటాల అనంతరం ఏర్పడ్డ తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. శనివారం లక్డీకాపూల్‌లోని ఫ్యాప్సీ భవన్‌లో యుద్ధవీర్ ఫౌండేషన్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఏడు యుద్ధవీర్ అవార్డుకు ఎంపికైన భాష్యకారుడు, సంస్కృత పండితుడు డాక్టర్ విజయ్ వీర్ విద్యాలంకార్‌కు యుద్ధవీర్ స్మారక పురస్కారాన్ని కేశవరావు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేశవరావు యుద్ధవీర్ స్మారకోపన్యాసం చేశారు.

ఉద్యమ వ్యతిరేకులకు కేసిఆర్ పెద్దపీట

సికింద్రాబాద్, నాచారం, ఏప్రిల్ 30: దొంగలందరినీ పిలిచి కండువాలు కప్పుతున్న కెసిఆర్ ఇదే తెలంగాణ పునరేకీకరణ అంటున్నారని తెలంగాణ ఉద్యమసంఘాల జెఎసి చైర్మన్ డాక్టర్ చెరుకు సుధాకర్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి నుంచి యావత్ తెలంగాణలో బస్సుయాత్రను నిర్వహించి శనివారం ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

Pages