S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంపాదకీయం
వేగం భద్రత విస్తరణ, స్వచ్ఛత వంటి పదజాలంతో నిర్మించిన పట్టాలపై ధూమశకటాలు దూసుకొని పోతున్న దృశ్యాన్ని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంట్‌లో మరోసారి ఆవిష్కరించారు. ‘‘ఆయన తీరు వేరు..’’ అన్నది మరోసారి ధ్రువపడింది. ధూమశకటాలు-పొగబండ్లు-నిర్థూమ-పొగలేని-శకటాలుగా మారుతున్నాయన్న ఆదర్శాన్ని వాస్తవం చేయనున్నట్లు మంత్రి ప్రకటించడం స్వచ్ఛతకు నిదర్శనం కావచ్చు.
ఉల్లిగడ్డల ధరలు భయంకరంగా పెరిగినప్పుడు వినియోగదారుని కళ్లలో నీరు తిరిగింది. ఇప్పుడు ధరలు ఆకాశంనుండి భూమి మీదకి కుప్ప కూలినందుకు ఉల్లిగడ్డ విలపిస్తోంది! టన్నులకొద్దీ ట్రక్కులకొద్దీ తరలివస్తున్న ఈ ఎర్రగడ్డలను మార్కెట్‌లో అడిగేవాడు లేడు! అందువల్ల ఆరు బయట ఆచ్ఛాదన లేకుండా పొర్లుదండాలు పెడుతున్న నీరుల్లి మరింతగా నీరుకారిపోతోంది! ఆరు నెలల క్రితం ఉల్లి గడ్డ కిలో ధర వంద రూపాయల వరకు పలికింది,.
తరుముతున్న పోలీసులు తడబడితే ఏమవుతుంది? దేశద్రోహులు తప్పించుకొని పోతారన్నది అందరికీ అర్థమయ్యే మామూలు వ్యవహారం. దేశద్రోహులు అంతర్గత విచ్ఛిన్నకారులు కావచ్చు, బాహ్య శత్రువులు కావచ్చు. ఆయుధాలతో అమాయకులపై, నిరాయుధులపై దాడి చేసి హత్యలు చేసే భౌతిక బీభత్సకారులు కావచ్చు. చాపకింది విషయం వలె విస్తరించిపోయి ఈ దేశపు అస్తిత్వ మూలాలను వికృత భావాలతో తెగనరుకుతున్న బౌద్ధిక బీభత్సకారులు కావచ్చు.
కనపడని శత్రువుతో ఎలా యుద్ధం చేయాలన్న విషయమై మన ప్రభుత్వం ఇప్పుడైనా గుణపాఠాలు నేర్చుకోవడం జాతిహితకరమైన చర్య కాగలదు! పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న జిహాదీ తోడేళ్లు కనబడని శత్రువులు! ఫిబ్రవరి 20వ తేదీనుండి కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ సమీపంలోని సుమపురం-సెంపోరా-పాంపోరా-లో ప్రభుత్వ భవనంలో ఈ కనబడని శత్రువులు మళ్లీ చెలరేగుతున్నారు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినిపించిన సమన్వయ వాణి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు విచిత్రమైన నేపధ్యం! నరేంద్ర మోదీ ఈ సర్వజనామోద-కాన్సనె్సస్-విధానాన్ని మరోసారి ఈనెల 16వ తేదీన ఆవిష్కరించిన సమయంలోనే ప్రతిపక్షాలవారు సంఘర్షణ స్వరాలను యధావిధిగా సంధించారు! వెరసి కలసి నిగ్గుతేలుతున్నదేమిటంటే పార్లమెంట్ హేమంత సమావేశాల కథ బడ్జెట్ సమావేశాలలో సైతం పునరావృత్తం అయ్యే ప్రమాదం ఉన్నది!
నాసిరకం మందులు చైనా నుండి దిగుమతి అవుతుండడానికి దేశమంతటా విస్తరిస్తున్న నకిలీ మందుల వ్యవస్థ వికృతమైన నేపథ్యం. నకిలీ మందుల పుట్టలు పగులుతున్న సమయంలోనే చైనా నుండి నాసిరకం ఔషధాలు దిగుమతి అవుతుండడం సమాంతర విపరిణామం. ఆరోగ్యాన్ని పెంచవలసిన ఔషధాలు హతమార్చడానికి దోహదం చేస్తుండడానికి కారణం నకిలీ ఉత్పత్తులు...నాసిరకం దిగుమతులు!
ఉన్నత విద్యా సంస్కార స్వభావం అనైతిక భావ వికృతులతో సంకరమై పోతుండడం వివిధ రంగాలలో పెచ్చు పెరుగుతున్న అవినీతి కలాపాలకు ప్రధాన కారణం. 2015లో అవినీతి గ్రస్తులైన రెండువేల రెండువందల ఉన్నత ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా దర్యాప్తులు ప్రారంభించినట్టు కేంద్ర నేర పరిశోధక విభాగం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్-సిబిఐ-వారు బుధవారం దేశ రాజధానిలో ప్రకటిండం సమాజ హిత చింతకులకు ఆందోళన కలిగిస్తోంది.
పాకిస్తాన్‌కు యుద్ధ సామగ్రిని విక్రయించడానికి అమెరికా మరోసారి నిర్ణయించడం ఆశ్చర్యకరం కాదు! తొడగిల్లి తొట్టెలను ఊపే ద్వంద్వనీతికి అమెరికా ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందన్నది ఇలా మరోసారి ధ్రువపడిన దౌత్యవైచిత్రి! మన ప్రభుత్వంతో అత్యంత మైత్రిని అభినయిస్తున్న అమెరికా వేల కోట్ల రూపాయల విలువైన వాణిజ్య ప్రయోజనాలను పొందడం సమీప గతం!
గతంలో న్యాయవ్యవస్థలో అంకురించిన అయోమయం విచిత్రమైన గందరగోళంగా విస్తరించిపోతుండటం వర్తమాన దృశ్యం. మదరాసు ఉన్నత న్యాయమూర్తి సి.ఎస్. కర్ణన్ సోమవారం నాడు న్యాయవ్యవస్థను తల్లక్రిందులుగా ఆవిష్కరించడం రాజ్యాంగ కోవిదులను విస్మయ చకితులను చేసిన అద్భుతం.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వ పరిరక్షణ అనుమానాస్పదంగా మారి వుండడం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శాసన సభలకు జరగనున్న ఎన్నికలకు నేపథ్యం! 2014 నాటి లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారాన్ని మాత్రమేకాక, లోక్‌సభలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయిన కాంగ్రెస్ వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు తోకగానో, ఈకగానో ఏర్పడడానికి సైతం సిద్ధమైపోయింది.