S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంపాదకీయం
దేశద్రోహం అభియోగంపై వైమానిక దళానికి చెందిన మరో ఇద్దరిని శుక్రవారం ‘నిఘా’ అధికారులు నిర్బంధించడంతో డొంక కదలడం మొదలైంది. కొందరు రక్షకులు భక్షకులుగా మారుతుండడం భద్రతాకుడ్యంలోని కన్నాలు మరింతగా విస్తరిస్తున్నాయనడానికి నిదర్శనం. ఈ కన్నాలగుండా పాకిస్తానీ బీభత్స మృగాలు దేశంలోకి చొరబడుతుండడం దేశానికి అత్యంత అవమానకరం. ఇప్పుడు ఈ మృగాలు మన సైనిక స్థావరాలలోకి సైతం చొరబడి పోతున్నాయి.
షేక్ అబ్దుల్లా తరువాత జమ్మూకశ్మీర్ రాజకీయ గతిని నిర్దేశించిన వారిలో అత్యంత ప్రముఖుడు ముఫ్తిమహమ్మద్ సరుూద్. గురువారం నాడు డెబ్బయి తొమ్మిదేళ్ల ముఫ్తి మరణించడం అందువల్ల ఈ రాజకీయ ప్రపంచానికి తీరని లోటు. 2002 నుంచి మూడేళ్లపాటు ముఫ్తి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయన నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ-పిడిపి-కాగ్రెస్‌తో జట్టుకట్టింది.
సంజయ్‌దత్ అనే చలనచిత్ర నటుడిని శిక్షాకాలం పూర్తి కాక మునుపే జైలునుండి విడుదల చేస్తున్నారట! ఈ దుర్వార్త మహత్తర హర్షణీయ పరిణామంగా ప్రచారం అవుతుండడం అనైతికతా పరిమాణ సూచిక పెరుగుతుండడానికి నిదర్శనం. సంజయ్‌దత్ ఘరానా నేరస్థుడన్నది న్యాయస్థానాలు నిగ్గుతేల్చిన నిజం!
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పద్దెనిమిది వందల కిలోమీటర్ల మేర జాతీయ రాజమార్గాలు ఏర్పడుతుండడం సమాఖ్య స్ఫూర్తికి సరికొత్త నిదర్శనం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో కేంద్ర రహదారి రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం వరంగల్లులో ఆవిష్కరించిన ఈ పథకం తెలంగాణకు మరో ప్రగతి తోరణం! తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే మాతృభూమికి హరిత హారాన్ని సమర్పించడానికై నడుంబిగించి ఉంది! ఈ రహదారులు భూమాతకు మరో తోరణం!
హంతకుడు అభియోగాన్ని విచారించి తీర్పు చెప్పడమన్న ప్రక్రియ మళ్లీ మొదలైపోయింది. ఇలా మొదలు కావడం ఇది మొదటిసారి కాదు. పాకిస్తాన్ ప్రభుత్వం రెండు దశాబ్దులకు పైగా ఇలా అభియోగాలను విచారిస్తూనే ఉంది. మన ప్రభుత్వం మోసపోతూనే ఉంది. పంజాబ్‌లో పఠాన్‌కోట వైమానిక దళ స్థావరంపై మూడు రోజులపాటు నాలుగవ తేదీ వరకు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ హంతకులు దాడి చేయడం ఈ పునరావృత్తికి సరికొత్త నేపథ్యం.
కంచెలు ఎలా చేను మేస్తాయి? వాటికి నోరు ఉందా? కాళ్లు చేతులు లేవు కదా? కడుపు ఎక్కడుంది? అన్నవి చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలు. అందువల్ల ‘కంచే చేను మేసినట్టు’ అన్న నానుడి నిజం కాదన్నది పసిమి వదలని మిసిమి వయసు వారి విశ్వాసం. కానీ వారు పెరిగి పెద్దయిన తరువాత కంచెలకు చేతులు కాళ్లు వచ్చిన సంగతిని గుర్తిస్తున్నారు. ఈ కంచెలకు నోరు కడుపు మరింత పెద్దవి.
పంజాబ్‌లోని పఠాన్‌కోట వద్ద గల మన వైమానిక దళ స్థావరంపై పాకిస్తానీ టెర్రరిస్టులు శనివారం దాడి చేయడం ఆశ్చర్యకరం కాదు. ఆవుల మందలోకి తోడేళ్లు దూకడం ఆశ్చర్యకరం! పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ స్వభావం గురించి తెలిసిన వారికి ఇలా మన వాయుసేనపై ఉగ్రవాదులు దాడి చేయడం ఎలాంటి దిగ్భ్రాంతిని కలిగించడం లేదు!
అయుత చండీయాగానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకాకపోవడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు, ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు అసహనంతో ఉన్నట్టుగా అగుపిస్తోంది. యాగం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని కెటిఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు.
రైతులనుంచి నేరుగా విత్తనాలను కొనుగోలు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ సంస్థల నిర్ణయం సజావుగా అమలు జరిగినట్టయితే దళారీ వాణిజ్య సంస్థల దోపిడీని నిరోధించవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తనాల భాండాగారంగా మార్చి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు విత్తనాలను ఎగుమతి చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ఏడాది క్రితమే ఆవిష్కరించింది.
నేపాల్‌కూ మనకూ మధ్య స్నేహ సంబంధాలు అడుగంటిపోతుండడం చైనా ప్రభుత్వం వారి వ్యూహంలో భాగం. మన ఇరుగు పొరుగు దేశాలతో మన మైత్రిని చెడగొట్టడం చైనా ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. చైనా జరుపుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి నేపాల్ రంగస్థలం కావడం వర్తమాన ఘట్టం. నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ ఓలీ శర్మ జనవరి నెలలో చైనాను సందర్శిస్తున్నట్టు ఉప ప్రధాని కమల్ థాఫా వెల్లడించారు.