S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంపాదకీయం
సైనిక దళాలలో పదోన్నతులను ఇప్పించడానికై లంచాలను దండుకుంటున్న ముఠాలు ఏర్పడి ఉన్నాయన్నది ప్రచారవౌతున్న అభియోగం. మేజర్ జనరల్ స్థాయి ఉన్నత సైనిక అధికారులిద్దరు ఈ ముఠాలలో కీలకపాత్ర వహిస్తున్నారన్నది అవినీతి ప్రహనంలో సరికొత్త ఘట్టం. ఈ ఇద్దరి అవినీతి గురించి దర్యాప్తు జరుపవలసిందిగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆదేశించడం సమస్య తీవ్రతకు నిదర్శనం.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జెపి రాజఖోవాకు తాకీదు పంపించడం పొరపాటని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం అంగీకరించడం రాజ్యాం నియమావళికి మరో ధ్రువీకరణ. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడంపై ఏర్పడిన వివాదంలో జనవరి 27న సర్వోన్నత న్యాయస్థానం గవర్నర్‌కు తాకీదు-నోటీసు-జారీ చేయడం పెద్దగా ప్రచారానికి నోచుకోని రాజ్యాంగ సంచలనం.
విశాఖపట్టణం నుంచి విజయవాడకు వెడుతుండిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం నాడు తునివద్ద తగలబడి పోవడం ఊహించని ఆశనిపాతం. ప్రశాంత ప్రకృతి అమితవేగంగా అశాంత వికృతిగా మారడం కాపుల సంక్షేమ ఉద్యమంపై పడిన పిడుగు. రైలును తగులబెట్టిన వారు కాపుకులస్థులకు అపకీర్తి తెచ్చిపెట్టారు. పథకం ప్రకారం ఉద్యమ గతిని తప్పుదోవ పట్టించారా? హఠాత్తుగా ఆవేశం కట్టలు తెంచుకున్నదా? అన్నది బహుశా నిర్ధారణ కాకపోవచ్చు.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి పదవిని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ-పిడిపి-అధినేత్రి ముఫ్తీమెహబూబా చేపట్టడానికి భారతీయ జనతాపార్టీ వారు అంగీకరిస్తారా? అన్నది ఊహాగానాలకు శ్రీకారం. ‘‘తమరు తప్ప ఆ పదవిని నిభాయించడానికి మరెవ్వరూ అర్హులు కారు...తమంత వారు తమరే!’’ అని ముఫ్తీ మెహబూబాను భాజపా వారు బతిమాలుకొంటున్నారన్నది ఈ ఊహాగానాలలో ప్రస్తుత ఘట్టం.
ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల భూమి సేకరణ విధానాలు వివాదగ్రస్తం అవుతుండడానికి ప్రధాన కారణం ప్రపంచీకరణ వ్యవస్థ పేరుతో విస్తరిస్తున్న కాలుష్యం..పారిశ్రామిక కాలుష్యం మొదటిది, రెండవది అవినీతి కాలుష్యం. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను బృహత్ హైదరాబాద్ నగర పాలక సంస్థ-జిహెచ్‌ఎంసి-కమిషనర్ బి.
అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనపై విభిన్న విశే్లషణలు, వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ఏమయినప్పటికీ రాజ్యాంగంలోని 356వ అధికరణం ప్రకారం రాష్ట్రాలలో రాష్టప్రతి పాలన విధించడానికి వీలు కల్పించే అధికారంపై న్యాయసమీక్ష పరిధి క్రమంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు, దాదాపు క్రీస్తుశకం 1980వ దశకం చివరి వరకూ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం విధించే రాష్టప్రతి పాలనను న్యాయస్థానాలలో ప్రశ్నించడానికి వీలుండేది కాదు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ విషాదాంత కథ మరింత విషాదకరమైన మలుపు తిరిగింది. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉండడని, ఎవరో అతనిని హత్యచేసి ఉంటారని రోహిత్ తండ్రి వేముల నాగమణి కుమార్ మంగళవారం విజయవాడలో వ్యక్తం చేసిన అనుమానం ఈ విషాదతరమైన మలుపు...నిండు నూరేళ్లు జీవించవలసి ఉండిన రోహిత్ ఇలా మొగ్గగానే రాలిపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యం.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే మనదేశంలో జరిపిన పర్యటన ఐరోపాలోని ప్రధాన దేశాలతో మనకు పెరుగుతున్న వ్యూహాత్మక, ద్వైపాక్షిక మైత్రికి నిదర్శనం. ఇరవైతొమ్మిది దేశాల ఐరోపా సమాఖ్య వారు అప్పుడప్పుడు మనదేశం పట్ల వ్యూహాత్మక వ్యతిరేకత వెళ్లగక్కుతున్నారు. మనదేశంలో అక్రమ ప్రమేయం కల్పించుకొనడానికి యత్నిస్తున్నారు.
నేపాల్ ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియలో విజ్ఞత మళ్లీ మొలకెత్తడం హర్షణీయ పరిణామం. ఈ మొలకలు పల్లవించి, పరిమళిస్తాయా అన్నది వేచి చూడవలసిన వ్యవహారం. తెరాయ్ ప్రాంతలోని మాధేశీలు తదితర జనసముదాయాల ఆకాంక్షలను నెరవేర్చడానికి దోహదం చేయగల రెండు రాజ్యాంగ సవరణలను శనివారం నేపాల్ పార్లమెంట్ ఆమోదించడం హర్షణీయ పరిణామం. ఈ సవరణలను మన ప్రభుత్వం స్వాగతించడం సహజం.
నేతాజీ సుభాస్ చంద్రుడు అమరుడు...అమరుడు అని చెప్పడం ప్రతీక-సింబాలిక్-మైన అభివర్ణన కాదు, భారత జాతీయ చారిత్రక జీవన వాస్తవం! ఈ వాస్తవం శనివారంనాడు మరోసారి సమావిష్కృతమైంది. నేతాజీ సుభాస్ చంద్రబోస్‌కు సంబంధించిన వంద దస్త్రాలను ప్రధాని నరేంద్ర మోదీ సార్వజనీకరించడం ఈ నూతన ఆవిష్కరణ!