S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/15/2018 - 00:36

మాస్కో : క్రీడారంగంలోనే అతి పెద్ద ఈవెంట్ ప్రపంచ కప్ సాకర్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. సుమారు 80,000 మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన లుజ్నికీ స్టేడియంలో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ మొదలైనట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ప్రకటించారు. సుమారు 13 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కోసం రష్యా అన్నివిధాల సిద్ధమైంది.

06/15/2018 - 00:22

సౌదీ అరేబియా నుంచి వేలాదిగా అభిమానులు తరలి రావడంతో రష్యాతో ఆ జట్టు మొదటి మ్యాచ్‌లో తలపడినపుడు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో మ్యాచ్ సజావుగా సాగిపోయింది. 2016 యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో రష్యా హూలిగల్‌ను విచక్షణారహితంగా ఇంగ్లాండ్ అభిమానులపై దాడులకు దిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని వరల్డ్ కప్ సాకర్ నిర్వాహణ బృందం మరింత అప్రమత్తమైంది.

06/15/2018 - 00:18

బెంగళూరు: టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా స్టయిలిష్ బ్యాట్స్‌మన్ రికార్డు సృష్టించాడు. లంచ్ విరామ సమయానికి సెంచరీ చేసి ఇంతవరకూ ఏ భారత క్రికెట్ సాధించని ఘనత సాధించాడు. బెంగళూరులో గురువారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ తొలిరోజున ఓపెనర్‌గా దిగిన ధావన్ భోజన విరామ సమయాని కంటే ముందు 91 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, 19 ఫోర్లతో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.

06/15/2018 - 00:17

మాస్కో, జూన్ 14: వరల్డ్ కప్ సాకర్‌కు ఆతిధ్యమిస్తున్న రష్యా తొలి మ్యాచ్‌లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. సౌదీ అరేబియాతో జరిగిన తొలి పోరులో 5-0 తేడాతో స్వంతం చేసుకుంది. మ్యాచ్ ప్రారంభమైన క్షణం నుంచి ఇన్‌జూరీ టైమ్ వరకు అడుగడుగునా ఆధిపత్యాన్ని కొనసాగించిన రష్యాను సౌదీ అరేబియా ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయింది. ఫలితంగా మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది.

06/15/2018 - 00:15

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 14: వరల్డ్ కప్ క్రికెట్‌లో ఇరాన్ జట్టుకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఒప్పందం కుదుర్చుకున్న నైక్ సంస్థ ఆ జట్టు ఆటగాళ్లకు బూట్లుసహా కిట్‌ను అందించడం లేదని చివరి క్షణంలో ప్రకటించింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు నైక్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

06/15/2018 - 00:14

బెంగళూరు, జూన్ 14: టెస్టుల్లో తొలిసారిగా ఆరంగేట్రం చేస్తున్న అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అఫ్గాన్ తొలిసారిగా టీమిండియాతో గురువారం నుంచి ప్రారంభమైన టెస్టు మ్యాచ్‌లో ఆడుతోంది. ఈ సందర్భంగా ప్రధాని అఫ్గాన్ జట్టు టెస్టు మ్యాచ్‌లలో ఆడాలని ఉవ్విళ్లూరడం అభినందనీయమని అన్నారు.

06/15/2018 - 00:13

మాస్కో, జూన్ 14: రష్యాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ బ్లాక్ మార్కెటీర్లకు ఒక వరంలా మారింది. కొందరు వ్యక్తులు మాస్కోలోని టికెట్ల విక్రయ కేంద్రం మెయిన్ గేట్ వద్ద పలువురు వ్యక్తులు గుమికూడి విదేశాల నుంచి వచ్చే ఫుట్‌బాల్ అభిమానుల వద్దనున్న టికెట్లను కొనుగోలు చేస్తూ ఇతరులకు ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

06/15/2018 - 00:11

కజాన్ (రష్యా), జూన్ 14: ఆస్ట్రేలియా సీనియర్ ఫుట్‌బాలర్ టిమ్ కాహిల్ అరుదైన ఒక రికార్డును సాధించే దిశగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే వరుసగా మూడు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్స్‌లో అతను గోల్స్ చేశాడు. 38 ఏళ్ల కాహిల్‌కు ఇది నాలుగో వరల్డ్ కప్.

06/14/2018 - 16:42

బెంగళూరు: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో సెంచరీ బాదిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 96 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో సాయంతో 107 పరుగులు చేసిన ధవన్.. భారత జట్టు గతంలో ఎన్నడూ సాధించని అరుదైన రికార్డు సృష్టించాడు. ఆట తొలి రోజు లంచ్ విరామానికి ముందే సెంచరీ సాధించిన ఆటగాడిగా ధవన్ రికార్డులకెక్కాడు.

06/13/2018 - 05:01

బ్రోన్నిట్సీ, (రష్యా): అర్జెంటీనా సాకర్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే, మెస్సీని స్వయంగా చూసేందుకు ప్రతిఒక్కరూ తహతహలాడుతుంటారు. అలాంటి అవకాశం ఒరిజినల్ మ్యాచ్ కాకపోయినా ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో దాదాపు 400 మంది అభిమానులకు దక్కింది. సోమవారం మెస్సీతోపాటు అతని జట్టు సహచరుల ఆటతీరును వారు కాసేపు స్వయంగా వీక్షించి ఎంతో సంబరపడ్డారు.

Pages