S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/08/2017 - 00:06

పారిస్, ఆగస్టు 7: రష్యా అందాల భామ మరియా షరపోవా బీజింగ్‌లో వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడేందుకు అంగీకరించింది. టోర్నీ నిర్వాహకుల ఆహ్వానం మేరకు వైల్డ్‌కార్డుతో ఆడేందుకు ఆమె సిద్ధమవుతోంది.

08/07/2017 - 01:32

లండన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 100 మీటర్ల పరుగులో అందరి కంటే ముందు లక్ష్యాన్ని చేరుకున్న జస్టిన్ గాల్టిన్ (ఎడమ) ఆనందం. ఫేవరిట్ ఉసేన్ బోల్ట్‌ను ఓడించి గాల్టిన్ సంచలనం సృష్టించాడు. ఈ రేస్‌లో బోల్ట్ మూడో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యకరం

08/07/2017 - 01:42

లండన్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 100 మీటర్ల స్ప్రింట్‌లో హాట్ ఫేవరిట్ ఉసేన్ బోల్ట్‌ను ఓడించి జస్టిన్ గాల్టిన్ తన చిరకాల లక్ష్యాన్ని సాధించాడు. అయితే, స్టేడియం యావత్తు బోల్ట్ నామస్మరణ చేయడం గాల్టిన్‌కు అతనికి ఉన్న ఫాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో స్పష్టం చేసింది.

08/07/2017 - 01:06

లండన్, ఆగస్టు 6: ప్రపంచ మేటి అథ్లెట్, ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌కు కెరీర్‌లో చివరి స్ప్రింట్‌లో ఊహించని ఓటమి ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి, అమెరికా అథ్లెట్ జస్టిన్ గాల్టిన్ చేతిలో షాక్ తిన్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 100 మీటర్ల పరుగు కోసం బోల్ట్ అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎదురుచూశారో, ఫలితం తారుమారు కావడంతో అంతగా నిరాశ చెందారు.

08/07/2017 - 00:59

లండన్: ఉసేన్ బోల్ట్‌ను ఓడించి, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో 100 మీటర్ల స్ప్రింట్ టైటిల్‌ను గెల్చుకున్నప్పటికీ జస్టిన్ గాల్టిన్ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. గతంలో డప్ పరీక్షలో పట్టుబడిన అతను కొన్నాళ్లు సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్నాడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.

08/07/2017 - 00:56

కొలంబో, ఆగస్టు 6: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. దీనితో ఈనెల 12 నుంచి పల్లేకల్ స్టేడియంలో ప్రారంభం కానున్న చివరి, మూడో టెస్టుకు ప్రాధాన్యం లేకుండాపోయింది. రెండో టెస్టులో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ శ్రీలంకకు 53 పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు.

08/07/2017 - 00:54

ముంబయి, ఆగస్టు 6: చైనా బాక్సర్ జుల్పీకర్ మైమైతియాలిని ఓడించి తాను సాధించిన డబ్లుబివో ఓరియంటల్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను అతనికే తిరిగి ఇచ్చేస్తానని భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రకటించాడు. భారత్, చైనా దేశాల మధ్య శాంతి నెలకొలడానికి ఈ చర్య ఉపయోగపడితే తాను చాలా ఆనందిస్తానని తెలిపాడు.

08/07/2017 - 00:53

నాగపూర్, ఆగస్టు 6: ప్రో కబడ్డీ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యుపి యోద్ధను బెంగాల్ వారియర్స్ 20 పాయింట్ల తేడాతో చిత్తుచేసింది. బెంగాల్ 40 పాయింట్లు సాధించగా, శనివారం బెంగళూరు బుల్స్‌ను ఓడించి సంచలనం సృష్టించిన యుపి యోద్ధ ఈ మ్యాచ్‌లో నీరుగారిపోయి, 20 పాయింట్లతో సరిపుచ్చింది.

08/06/2017 - 00:31

కొలంబో, ఆగస్టు 5: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌పై టీమిండియా పట్టు బిగిస్తున్నది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫాలోఆన్‌కు దిగిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 209 పరుగులు చేసింది ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఈ జట్టు ఇంకా 230 పరుగులు చేయాలి. ఎనిమిది వికెట్లు, రెండు రోజుల ఆట చేతిలో ఉన్నాయి.

08/06/2017 - 00:30

లండన్, ఆగస్టు 5: బ్రిటిష్ సూపర్ అథ్లెట్ మో ఫరా 10,000 మీటర్ల పరుగులో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో అతను ఈ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. లక్ష్యాన్ని మో ఫరా 26:49.51 నిమిషాల్లో పూర్తి చేయగా, చివరి వరకూ అతనికి గట్టిపోటీనిచ్చిన ఉగాండా యువ అథ్లెట్ జాషువా చెప్టేగెయ్ 26:49.94 నిమిషాలతో రజత పతకాన్ని అందుకున్నాడు.

Pages