S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/10/2017 - 02:18

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చెలరేగిపోయింది. తొలి మ్యాచ్‌లో నిరుటి రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 35 పరుగుల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్ రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ను తొమ్మిది వికెట్ల ఆధిక్యంతో చిత్తుచేసింది. డేవిడ్ వార్నర్, మోజెస్ హెన్రిక్స్ అర్ధ శతకాలతో కదంతొక్కి, జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు.

04/10/2017 - 01:07

గుజరాత్ లయన్స్: జాసన్ రాయ్ సి శిఖర్ ధావన్ బి భువనేశ్వర్ కుమార్ 31, బ్రెండన్ మెక్‌కలమ్ ఎల్‌బి రషీద్ ఖాన్ 5, సురేష్ రైనా ఎల్‌బి రషీద్ ఖాన్ 5, ఆరోన్ ఫించ్ ఎల్‌బి రషీద్ ఖాన్ 3, దినేష్ కార్తీక్ సి నమన్ ఓఝా బి ఆశిష్ నెహ్రా 30, డ్వెయిన్ స్మిత్ సి సబ్‌స్టిట్యూట్ (శంకర్) బి భువనేశ్వర్ కుమార్ 37, ధవళ్ కులకర్ణి రనౌట్ 1, ప్రవీణ్ కుమార్ 7 నాటౌట్, బాసిల్ థంపి 13 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 7 వ

04/10/2017 - 01:04

ముంబయ, ఏప్రిల్ 9: హాట్ ఫేవరిట్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరి గిన మ్యాచ్‌లో ముంబయ ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజ యం సాధించి సంచలనం సృష్టించింది. నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేయగా, ముంబయ మరో బంతి మిగిలి ఉం డగా, ఆరు వికెట్లను చేజార్చుకొని లక్ష్యాన్ని ఛేదించింది. చివరిలో హార్ది క్ పాండ్య 11 బంతుల్లో 26 పరుగులు చేసి ముంబయని గెలిపించాడు.

04/10/2017 - 01:04

బెంగళూరు, ఏప్రిల్ 9: డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా/ ఓషియానియా గ్రూప్-1లో ఇప్పటికే ఉజ్బెకిస్తాన్‌ను ఓడించి, ప్లే ఆఫ్ దశకు చేరుకున్న భారత్ ఆదివారం నాటి రివర్స్ సింగిల్స్‌లో ఒక మ్యాచ్‌ని గెల్చుకొని, మరో మ్యాచ్‌ని చేజార్చుకొని, 4-1 తేడాతో పోటీలను ముగించింది. తొలి మ్యాచ్‌లో రాంకుమార్ రామనాథన్ తన ప్రత్యర్థి సంజార్ ఫైజీవ్‌ను 6-3, 6-2 తేడాతో చిత్తుచేశాడు.

04/10/2017 - 01:03

చుచింగ్ (మలేసియా), ఏప్రిల్ 9: చైనాకు చెందిన మాజీ ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్ కెరీర్‌లో మొట్టమొదటిసారి మలేసియా ఓపెన్ బాడ్మింటన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అతను తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నంబర్ వన్ లీ చాంగ్ వెయ్‌ని 21-19, 21-14 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. ఈ మ్యాచ్ కేవలం 55 నిమిషాల్లోనే ముగియడం విశేషం.

04/10/2017 - 01:02

షాంఘైలో ఆదివారం జరిగిన చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను గెల్చుకున్న ప్రపంచ చాంపియన్,
మెర్సిడిజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్.
ఈ రేసులో సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ), మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు

04/10/2017 - 01:00

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి అతను హాజరుకావడంతో, ఇది చట్టబద్ధమైందా? కాదా? అన్న విషయాన్ని తేల్చుకోలేకపోయిన పాలక మండలి ఏకంగా సమావేశానే్న వాయిదా వేసింది. కాగా, సమావేశాలకు హాజరయ్యేందుకు శ్రీని అర్హుడా? కాదా?

04/09/2017 - 01:04

సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ లయన్స్
(హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో
సాయంత్రం 4 గంటలకు మొదలు)
*
ముంబయి ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్
(ముంబయిలో రాత్రి 8 గంటలకు ప్రారంభం)

04/09/2017 - 01:03

ఇండోర్, ఏప్రిల్ 8: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ విజయం సాధించింది. లోస్కోరింగ్ నమోదైన ఈ పోరులో పుణే సూపర్‌జెయింట్స్ ఆరు వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేస్తే, ఈ సాధారణమైన లక్ష్యాన్ని ఛేదించడానికి పంజాబ్ 19 ఓవర్లు తీసుకుంది. నాలుగు వికెట్లకు 164 పరుగులు చేసి, ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.

04/09/2017 - 01:01

బెంగళూరు, ఏప్రిల్ 8: ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో శనివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అసాధారణ ప్రతిభ కనబరచి, 15 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసి, ఎనిమిది వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు బౌలింగ్‌లో రాణించి, ఢిల్లీని తొమ్మిది వికెట్లకు 142 పరుగులకే కట్టడి చేసింది.

Pages