S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/09/2016 - 01:18

ముంబయి: ఫీల్డ్ అంపైర్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ పేసర్ పాల్ రీఫెల్ బ్యాటింగ్ చేయలేదు. కానీ, భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన బంతి తలకు తగలడంతో కిందపడిపోయాడు. అనంతరం వైద్య చికిత్స కోసం అతను మైదానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌తో గురువారం మొదలైన నాలుగో టెస్టు మ్యాచ్ రెండో సెషన్ ఆట ప్రారంభంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది.

12/09/2016 - 01:17

సిడ్నీ, డిసెంబర్ 8: పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు బ్రిస్బేన్‌లో జరిగే మొదటి, డే/నైట్ టెస్టు మ్యాచ్‌కి ఎలాంటి మార్పులు లేకుండా 12 మందితో కూడిన జట్టునే కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో మొదటి రెండు టెస్టులుసహా వరుసగా ఐదు టెస్టుల్లో పరాజయాలను చవిచూసింది.

12/09/2016 - 01:14

బెంగళూరులో గురువారం జరిగిన బెంగళూరు బ్లాస్టర్స్ బాడ్మింటన్ జట్టు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జట్టు సహ భాగస్వామి సచిన్ తెండూల్కర్. చిత్రంలో ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, హీరో అల్లు అర్జున్, బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. ఫుట్‌బాల్‌లో కేరళ ఫ్రాంచైజీలో భాగస్వామ్యం ఉన్న సచిన్ ఇప్పుడు బాడ్మింటన్ ఫ్రాంచైజీలోనూ సహ భాగస్వామిగా అవతరించాడు

12/09/2016 - 01:13

మెల్బోర్న్, డిసెంబర్ 8: వచ్చేనెల జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాప్ స్టార్లు ధ్రువీకరించారు. గర్భవతి కావడంతో వికోట్టరియా అజరెన్కా ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌కు రావడం లేదు. ఆమెను మినహాయిస్తే, సెరెనా విలియమ్స్, ఏంజెలిక్ కెర్బర్, రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రే, ఏంజెలిక్ కెర్బర్ వంటి సూపర్ స్టార్లు ఈ టోర్నీలో ఆడతారు.

12/08/2016 - 05:34

ముంబయి, డిసెంబర్ 7: ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి క్రికెట్ టెస్టులో కొంత తడబడి, డ్రాతో బయటపడినా, ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థిని చిత్తుచేసిన టీమిండియా గురువారం నుంచి ఇక్కడ మొదలుకానున్న నాలుగో టెస్టుపై కనే్నసింది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ టెస్టును గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.

12/08/2016 - 05:31

ముంబయి: ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడిన పార్థీవ్ పటేల్ ఇంగ్లాండ్‌తో గురువారం నుంచి మొదలయ్యే నాలుగో టెస్టులో కీపింగ్‌కు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టులకు గుడ్‌బై చెప్పిన తర్వాత రెగ్యులర్ వికెట్‌కీపర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్న వృద్ధిమాన్ సాహా గాయపడడంతో పార్థీవ్ జట్టులోకి వచ్చాడు.

12/08/2016 - 05:31

ముంబయి: భారత బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో అతని కుడి చూపుడు వేలుగు గాయమైంది. దీనితో అతను మిగతా రెండు టెస్టుల్లో ఆడే అవకాశం లేదని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతని స్థానంలో జట్టులోకి మనీష్ పాండేను తీసుకున్నట్టు పేర్కొంది. కొంతకాలంగా రహానే ఫామ్‌లో లేకపోవడం అభిమానులను వేధిస్తున్నది.

12/08/2016 - 05:31

లక్నో, డిసెంబర్ 7: స్వదేశంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న 11వ ఎఫ్‌ఐహెచ్ జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు టైటిల్‌పై గురిపెట్టి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. 2001లో హోబర్ట్ (ఆస్ట్రేలియా)లో భారత్ చివరిసారి ఈ టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకుంది.

12/08/2016 - 05:30

ముంబయి: ఇంగ్లాండ్ కెప్టెన్ అలస్టర్ కుక్‌పై ఒత్తిడి తీవ్రమవుతున్నది. వరుసగా రెండు మ్యాచ్‌లు చేజార్చుకొని, సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడిన జట్టు పరువు నిలవాలంటే చివరి రెండు టెస్టుల్లోనూ గెలిచి తీరాలి. భారత్‌లో టీమిండియాను ఓడించడం అనుకున్నంత సులభం కాదన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో ముంబయి టెస్టును గెలవడం మినహా ఇంగ్లాండ్ ముందు మరో ప్రత్యమ్నాయం లేదు. ఈ విషయం కుక్‌కు తెలియందికాదు.

12/08/2016 - 05:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే చివరి రెండు టెస్టులకు నిధుల కొరత ఏర్పడుతుందేమోన్న ఆందోళన నుంచి బిసిసిఐ బయటపడింది. ఈ మ్యాచ్‌లను నిర్వహించే సభ్య సంఘాలకు నిధులు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతినివ్వడంతో ఊపిరి పీల్చుకుంది.

Pages