S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/18/2018 - 21:47

హైదరాబాద్, మార్చి 18: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని బడంగ్‌పేట నగర పంచాయతీ పరిధిలోని ఎస్‌బీఆర్, ఎస్‌ఎస్‌ఆర్, లక్ష్మీనగర్ కాలనీల ప్రజలు తమ ప్రాంతంలో సెల్‌టవర్ నిర్మించ వద్దని ఆదివారం ధర్నా చేశారు. కాలనీలోని ఒక వ్యక్తి ఇంటిపైభాగాన సెల్‌టవర్ నిర్మించాలని ప్రతిపాదన వచ్చింది. సెల్‌టవర్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతుండగా మూడు కాలనీల ప్రజలు ఆందోళనకు దిగారు. సెల్ టవర్‌తో రేడియేషన్ ప్రభావం..

03/18/2018 - 04:37

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం వీహబ్‌ను ప్రారంభించిందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శనివారం నగరంలో ఓ హోటల్‌లో నల్సార్ లా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మహిళా లీడర్ షిప్ సమ్మిట్-2018 జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ అవనిలో సగంగా ఉన్న మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు.

03/18/2018 - 04:34

హైదరాబాద్, మార్చి 17: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కాంగ్రెస్ పార్టీ తుచ్ఛమైన రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర గ్రామీణ, పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు చేపట్టకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

03/18/2018 - 04:32

హైదరాబాద్, మార్చి 17: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే తెరాస ప్రభుత్వ హయాంలో ఇసుకపై వచ్చే ఆదాయం వంద రెట్లు పెరిగిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు సగటున నాలుగు కోట్ల చొప్పున రూ.39 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు.

03/18/2018 - 04:41

మహదేవ్‌పూర్: రాబోయే వర్షాకాలం జూన్ మొదటి వారంలో మేడిగడ్డ నుండి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుండి ఎల్లంపల్లి బ్యారేజీ వరకు నీటిని తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు.

03/18/2018 - 00:47

హైదరాబాద్, మార్చి 17: విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో కుడి చేయిని కోల్పోయిన కార్మికుడికి నెలకు రూ.12వేల వేతనం ఇస్తామని తెలంగాణ సదరన్ డిస్కాం హైకోర్టుకు తెలిపింది. తనకు కోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగం కల్పించలేదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన పి వెంకటేశ్వర్లు దాఖలు చేసిన కోర్టు ధిక్కారం కేసును జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.

03/18/2018 - 00:47

హైదరాబాద్, మార్చి 17: తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న ఘనంగా వేడుకలు నిర్వహించాలని టి.టిడిపి నిర్ణయించింది. శనివారం టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో పాటు పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులూ హాజరయ్యారు. 29న ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి, ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.

03/18/2018 - 00:46

హైదరాబాద్, మార్చి 17: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులు రాజకీయ సమితులుగా మారాయని టి.కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు. రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసి, అవి వ్యవసాయ రంగానికి సర్వ రోగ నివారిణిలా చెబుతూ అన్ని సమస్యలకు అవే పరిష్కారం అని వాటి గురించి గొప్పగా చెబుతున్న ముఖ్యమంత్రి కె.

03/18/2018 - 00:46

హైదరాబాద్, మార్చి 17: మానవునికి సంక్రమించే వివిధ రకాల వ్యాధులకు ప్రకృతి సిద్దంగా చికిత్సలు అందించే వైద్య విధానంపై ప్రజల్లో నానాటికి ఆసక్తి పెరుగుతుంది. ఇటీవల ప్రభుత్వం సంప్రదాయ, ఆయుర్వేద వైద్య విధానాలపై విస్తృత ప్రచారం నిర్వహించడంతో అల్లోపతి కంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి వైద్యం ఎంతో మెరుగని భావిస్తున్నారు. దీంతో ఈ వైద్యవిధానాన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

03/18/2018 - 00:45

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో మొండి చెయ్యి చూపించిందని ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, కె.రాజిరెడ్డి అన్నారు. శనివారం నాడిక్కడ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఏడాదిగా ఆర్టీసి కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు.

Pages