S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/15/2018 - 23:54

హైదరాబాద్, మార్చి 15: స్వరాష్ట్రంలో బీసీలకు స్వర్ణయుగం వచ్చిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ ప్రస్తుతం మూడింతలు అయిందని వివరించారు. గత ఏడాది రూ.5,920కోట్లుగా ఉన్న బడ్జెట్ ఈ ఏడాది రూ.5,920 కోట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుతం రూ.850 కోట్లు పెంచుతూ ఆర్ధిక మంత్రి ఈటెల బీసీలపై వరాలు కురిపించారని అన్నారు.

03/15/2018 - 23:54

సిరిసిల్ల, మార్చి 15: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ప్రగతి బాటన పయనిస్తూ అభివృద్ధికి చిరునామాగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలో రూ.కోటి 95 లక్షల నిధులతో నిర్మించిన అయిదు కమ్యూనిటీ హాళ్ళు, రెండు చిన్నారుల పార్కులను మంత్రి ప్రారంభించారు.

03/15/2018 - 23:53

చార్మినార్, మార్చి 15: జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకువస్తే రాష్టవ్య్రాప్తంగా ఆందోళన తప్పదని టీయూడబ్ల్యుజే (ఐజేయూ) సలహాదారుడు కే.శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షుడు నంగనూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాత్ అలీ గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.

03/15/2018 - 23:51

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష బీజేపీ, టీపీపీ, సీపీఎం పార్టీల సభ్యులు పెదవి విరిచారు. రూ.1,74,553 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం బాజా మోగిస్తున్నా వాస్తవ రూపంలో ఆ మేరకు ఖర్చులు కావడం లేదని మండిపడ్డాయి. మొత్తం బడ్జెట్ వాస్తవ విరుద్దంగా ఉందని బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్‌రెడ్డి విమర్శించారు.

03/15/2018 - 23:45

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ బడ్జెట్‌ను ప్రతిపాదించిన ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఇంటికీ శుద్ధి జలాలు అందిస్తామని, రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన వైద్య రక్షణ అందిస్తామని పేర్కొన్నారు.

03/15/2018 - 23:44

హైదరాబాద్, మార్చి 15: విద్యారంగానికి ఈ సారి బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. విద్యారంగం అభివృద్ధి చెందితేనే పిల్లలకు సుస్థిర భవిష్యత్, తద్వారా సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందనే భావనతో ఈసారి విద్యారంగానికి పెద్ద పీట వేసింది. కేవలం పాఠశాల విద్యకు 10,830 కోట్లు కేటాయించగా, ఉన్నత విద్యా రంగానికి 2448 కోట్లు కేటాయించింది. రెసిడెన్షియల్ విద్యకు 2823 కోట్లు ప్రతిపాదించింది.

03/15/2018 - 23:43

హైదరాబాద్, మార్చి 15: పంటల పెట్టుబడికి ఎకరానికి నాలుగువేల రూపాయల చొప్పున ఇస్తామంటూ తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు వీలుగా 2018-19 సంవత్సరం బడ్జెట్‌లో 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. వ్యవసాయ రంగానికి మొత్తం 15,780 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇందులో దాదాపు 75 శాతం నిధులు ‘రైతుల పెట్టుబడి పథకం’ (4 వేల పథకం) కోసం కేటాయించినట్టయింది.

03/15/2018 - 23:43

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్‌పాస్ పారిశ్రామిక విధానం హిట్టయింది. వినూత్న విధానం వల్ల ఈ స్కీం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు 3551 పరిశ్రమలను స్థాపించారు. రూ.32,558 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

03/15/2018 - 23:42

హైదరాబాద్, మార్చి 15: వైద్య, ఆరోగ్య రంగానికి 2018-19 సంవత్సరంలో 7375 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి రూపొందించిన సమగ్ర ప్రణాళిక వల్ల ప్రజారోగ్య వ్యవస్థ చాలా మెరుగైందని ప్రకటించారు. గతంలో సర్కారు దవాఖానాలపై ప్రజలకు నమ్మకం ఉండేదికాదని, ఇప్పుడు వీటిపై నమ్మకం పెరిగిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.

03/15/2018 - 23:41

హైదరాబాద్, మార్చి 15: సాధారణ ఎన్నికలకు ముందటి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడంతో ఎన్నికలు, ఓట్ల కోణంలో బడ్జెట్ ప్రజారంజకంగా ఉండవచ్చన్న అంచనాల మేరకు కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతానికి శాశ్వత పునాదులు పడే విధంగా రూపొందించినట్టు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Pages