S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/17/2018 - 02:40

న్యూఢిల్లీ, మార్చి 16: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుటుంబాన్ని జైల్లో పెట్టాలన్నదే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. శుక్రవారం నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఇలా ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు.

03/17/2018 - 02:07

సూర్యాపేట: రాష్ట్రంలో రైతాంగ సంక్షేమాన్ని, సమస్యలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరిస్తుందని, రైతాంగం పట్ల ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలుకావడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం, స్వరాజ్ అభియాన్ జాతీయ అధ్యక్షుడు యోగేంద్రయాదవ్ విమర్శించారు. ఎంఎస్‌పీ సత్యాగ్రహయాత్రలో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డును సందర్శించారు.

03/17/2018 - 00:18

బెల్లంపల్లి, మార్చి 16: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బొగ్గు గనిలో శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాం తంలో కార్మికులపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. శాంతిఖని గని వద్ద క్యాంటీన్ వద్ద కార్మికులు టిఫిన్ చేస్తుండగా, ఆప్రదేశంలో చెట్లపైన కోతులు ఎగిరి వచ్చి చెట్లపైన దూకాయి. దాంతో చెట్టుపై ఉన్న తేనెపట్టు లోని తేనెటీగలు ఒక్కసారిగా విజృంభించడంతో కార్మికులు గాయాలపాలయ్యారు.

03/17/2018 - 00:14

మెదక్, మార్చి 16 : పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థిని పట్ల ఇన్విజిలేటర్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన మెదక్‌లో జరిగింది. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థిని పట్ల ఇన్విజిలేటర్ రామకృష్ణ అసభ్యంగా ప్రవర్తిం చాడు. ఈ సంఘటన అనంతరం ఇన్విజిలేటర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

03/17/2018 - 00:14

కరీంనగర్ టౌన్, మార్చి 16: పాలకుల నిర్లక్ష్యంతో దేశానికి అన్నంపెట్టే అన్నదాతల సంక్షేమం కోసం మహారాష్ట్ర తరహా రైతు ఉద్యమాన్ని తెలంగాణలో కూడా చేపడుతామని టీ మాస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ. కంచ అయిలయ్య తెలిపారు. ఆ సంఘం ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం నగరంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కర్షకుల క్షేమం వీడిన ప్రభు త్వం ఈ పాపం మాది కాదు..

03/17/2018 - 02:02

సంగారెడ్డి: దేశంలో జనాభాను నియంత్రించడానికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్న భారత్ బచావో బస్సు యాత్రను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. మేమిద్దరం..మాకిద్దరు..అందరికీ ఇద్దరు అనే నినాదంతో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఈ యాత్రను నిర్వహిస్తూ మహారాష్ట్ర, కర్నాటకల మీదుగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టింది.

03/17/2018 - 00:08

వరంగల్, మార్చి 16: వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నుండి

03/17/2018 - 00:06

హైదరాబాద్, మార్చి 16: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు చేయనందుకు నిరసనగా పార్లమెంటులో వైకాపా, టిడిపి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే టిఆర్‌ఎస్ గొడవ చేస్తూ అడ్డుపడడం దురదృష్టకరమని కాం గ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకుడు టి. జీవన్‌రెడ్డి అన్నారు.

03/17/2018 - 00:05

హైదరాబాద్, మార్చి 16: మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేసింది శూన్యమని టి.టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ తాజుద్దీన్ విమర్శించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసగించారని వారు శుక్రవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

03/17/2018 - 00:04

హైదరాబాద్, మార్చి 16: స్వచ్ఛ భారత్ మిషన్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన సీడీలను శుక్రవారం పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సీడీల ద్వారా పజల్లో మరుగుదొడ్ల నిర్మించుకోవల్సిన అవసరాన్ని, ఆడపడుచుల ఆత్మగౌరం, పరిశుభ్రత వల్ల చేకూరే ప్రయోజనాలు తదిత అంశాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు.

Pages