S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/16/2018 - 02:21

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణలో వెయ్యికోట్ల రూపాయల విలువైన కందులను కొనుగోలు చేసినట్టు మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు తెలిపారు. పంటల ఉత్పత్తుల సేకరణపై సంబంధిత అధికారులతో అసెంబ్లీ హాలులో గురువారం రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చర్చించారు. కందులు, మినుములు, సెనగ, ఎర్రజొన్న తదితర పంటల ఉత్పత్తుల కొనుగోళ్లపై సమగ్రంగా చర్చించారు.

03/16/2018 - 02:20

హైదరాబాద్, మార్చి 15: వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, కెసిఆర్ నాయకత్వాన్ని గద్దెదించాలని, అంత వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలతో కలిసి సమిష్టిగా ఉద్యమిస్తారని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు.

03/16/2018 - 02:17

హైదరాబాద్/నార్సింగి, మార్చి 15: సరోజనిదేవి కంటి ఆసుపత్రి వైద్యులు ఎంతో చక్కగా వైద్యం చేశారని వైద్యులతోపాటు సిబ్బందికి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం అసెంబ్లీలో కుడికంటికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

03/16/2018 - 02:09

హైదరాబాద్, మార్చి 15: ప్రతీ ఏటా నిధుల కేటాయింపులో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసే పరంపరను ఈ సారి బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం కొనసాగించింది. కోటి ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారానే బంగారు తెలంగాణ కలను సాకారం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించిన రూ. 25 వేల కోట్ల నిధులు ప్రతిబింభించాయి.

03/16/2018 - 02:05

హైదరాబాద్, మార్చి 15: దేవాలయాల అభివృద్ధి, అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల కోసం 2018-19 బడ్జెట్‌లో 622 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆలయాలకు సంబంధించి బడ్జెట్‌లో పెద్దపీఠ వేశారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

03/15/2018 - 23:57

హైదరాబాద్, మార్చి 15: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 2018-19 బడ్జెట్‌లో 15,563 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 69,500 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్త పంచాయతీరాజ్ బిల్లును ప్రస్తుత సమావేశాల్లో తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

03/15/2018 - 23:56

హైదరాబాద్, మార్చి 15: జనసేన ఆవిర్భావ సభలో పవన్‌కళ్యాణ్ తెలంగాణ నుంచి కబ్జాల కల్చర్‌ను ఏపీకి తీసుకువచ్చారని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు డిమాండ్ చేసింది. బుధవారం గుంటూరు సభలో పవన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

03/15/2018 - 23:56

హైదరాబాద్, మార్చి 15: పదో తరగతి పరీక్షలు గురువారం తెలంగాణలో ప్రశాంతంగా మొదలయ్యాయి. అయితే పలు చోట్ల విద్యార్థులు హాల్‌టిక్కెట్ల కోసం నానా అగచాట్లు పడ్డారు. సరూర్‌నగర్‌లో అనుమతి లేని న్యూ రెయిన్‌బో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు మరో స్కూల్ నుండి పరీక్షలకు ఎన్‌రోల్ చేశారు.

03/15/2018 - 23:55

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దగాకోర్ బడ్జెట్ అని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. గురువారం గాంధీభవన్‌లో సీఎల్‌పీ లీడర్ చిన్నారెడ్డితో కలిసి మాట్లాడారు. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చూపిస్తూ ఖర్చు చేయడంలో వెనుకంజ వేయడం కేసీ ఆర్ ప్రభుత్వానికి అనవాయితీగా మారిందని విమర్శించారు.

03/15/2018 - 23:55

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తిలో తక్కువ కాలంలోనే ఎక్కువ ఉత్పత్తి చేసి, వివిధ ప్లాంట్లను నిర్మించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన సమయంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీ 7778 మెగావాట్లు ఉండగా, 2017 డిసెంబర్ నాటికి 14913 మెగావాట్లకు చేరుకుంది. కాగా 13,183 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోంది.

Pages