S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/18/2018 - 00:45

హైదరాబాద్, మార్చి 17: నిరుద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, లక్షా 68 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్కలు చెప్పారని కనుకుల శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

03/17/2018 - 03:13

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణలోని 31 జిల్లాల్లో తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా అత్యధిక ఆదాయంతో అగ్రగామిగా నిలిచింది. రంగారెడ్డి జిల్లా సంపన్నమైన జిల్లాగా తన పేరును నిలబెట్టుకుంది. రెండవ స్థానంలో హైదరాబాద్, మూడవ స్థానంలో మేడ్చెల్-మల్కాజగిరి నిలిచాయి. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.2,80,602గా నమోదైంది. హైదరాబాద్ జిల్లా తలసరి ఆదాయం రూ.2,48,275తో రెండవ స్థానంలో, మేడ్చెల్-మల్కాజగిరి జిల్లా రూ.

03/17/2018 - 03:08

హైదరాబాద్, మార్చి 16: కొత్త పెన్షన్ విధానం (సిపిఎస్) రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనలో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర కొత్త పెన్షన్ ఉద్యోగుల సంఘం ఖండించింది.

03/17/2018 - 03:08

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ధీమాగా అన్నారు. త్రిపురలో తమ పార్టీకి సంస్థాగతంగా ఎలాంటి బలం లేకపోయినా అధికారంలోకి వచ్చిందని ఆయ న గుర్తు చేశారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం అరుణ్ సింగ్ హైదరాబాద్‌కు చేరుకున్నారు.

03/17/2018 - 02:58

హైదరాబాద్, మార్చి 16: గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నాయకులు దొంగ దీక్షలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని టిఆర్‌ఎస్ మండిపడింది. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచేలా చేయడంతో ఇక తమకు రాజకీయ భవిష్యత్ లేదన్న భయం కాంగ్రెస్ నాయకులను వెంటాడుతుందని టిఆర్‌ఎస్ విమర్శించింది.

03/17/2018 - 02:57

హైదరాబాద్, మార్చి 16: మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయిన మానువాడ గ్రామ నిర్వాసితులకు న్యాయం చేయాలని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

03/17/2018 - 02:56

హైదరాబాద్, మార్చి 16: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పలు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడ విద్యార్ధులు ఇబ్బందులను తెలుసుకున్నారు.

03/17/2018 - 02:56

హైదరాబాద్, మార్చి 16: గత 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న తుకారంగేట్ ఆర్‌యూబీ పనులను త్వరలో ప్రారంభించనున్నట్టు మంత్రి పద్మరావు గౌడ్ తెలిపారు. శుక్రవారం నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల నుంచి సమస్యల అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకున్నారు.

03/17/2018 - 02:55

హైదరాబాద్, మార్చి 16: శాంతి-్భద్రత ల పరిరక్షణ దృష్ట్యా రానున్న రెండు నెలల పాటు సచివాలయానికి మూడు కిలో మీటర్ల పరిధిలో నిషేదాజ్ఞలు విధించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ నెల 19 నుంచి మే 18వ తేదీ వరకు ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉం టాయని స్పష్టం చేశారు.

03/17/2018 - 02:55

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణలో నగరాల్లో నివసించే జనాభా పెరుగుతోంది. నగరాల జనాభా పెరగడం ఆర్థికాభివృద్ధికి సూచికగా భావించాలని సామాజిక, ఆర్థిక అవుట్‌లుక్ 2018లో రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. దేశం మొత్తంపైన నగరాలుశరవేగంగా అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ నగర స్వరూపాలు మారిపోతున్నాయి. రాష్ట్ర జనాభా 3.5 కోట్లు.

Pages