S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/04/2018 - 04:19

నల్లగొండ, మార్చి 3: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ కూటమి విజయం ప్రధాని నరేంద్ర మోదీ పాలన పట్ల ప్రజాదరణకు నిదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అభివర్ణించారు. శనివారం నల్లగొండ బీజేపీ కార్యాలయంలో బీజేపీ విజయోత్సవ సంబరాల్లో పాలొన్న సందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

03/04/2018 - 04:19

హైదరాబాద్, మార్చి 3: ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఇంగ్లీషు పేపర్ -1 పరీక్ష శనివారం నాడు ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 4,93,996 మంది రిజిస్టర్ చేసుకోగా, 4,73,480 మంది హాజరయ్యారు. 20,516 మంది అంటే 4.5 శాతం మంది గైర్హాజరయ్యారని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని చెప్పారు.

03/04/2018 - 04:18

హైదరాబాద్, మార్చి 3: ముఖ్యమంత్రి అసభ్యంగా, అవమానపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడటాన్ని యావత్తు తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బిజెపి శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రిని ఉద్ధేశించి అసభ్యంగా మాట్లాడటమే బంగారు తెలంగాణ అవుతుందా అని నిలదీశారు. ఎంతో హుందాగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి చాలా హీనంగా మాట్లాడారని పేర్కొన్నారు.

03/04/2018 - 04:17

హైదరాబాద్, మార్చి 3: యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్‌లో 377 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వాడకు త్వరలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేస్తారని టిఎస్-ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. వంద శాతం కాలుష్య రహిత పరిశ్రమలను నెలకొల్పే ఈ ఇండస్ట్రీయల్ పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.

03/03/2018 - 02:59

నాగార్జునసాగర్, మార్చి 2: నాగార్జునసాగర్‌లో మత్య్స కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఫిష్ టూరిజం(మీన యానం)ను త్వరలో ఏర్పాటుచేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. శుక్రవారం నాగార్జున సాగర్ జలాశయంలో మత్య్స శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేజీ కల్చర్ చేపల పెంప కం కేంద్రాన్ని సందర్శించారు. గత 8 నెలల నుండి సాగర్ జలాశయంలో మత్య్స శాఖ ఆధ్వర్యంలో సంగాసియాస్ చేపలను 50కేజీలలో పెంచుతున్నారు.

03/03/2018 - 02:56

వలిగొండ, మార్చి 2: ఒకనాడు స్వచ్ఛమైన తాగునీటితో నాలుగు జిల్లాల గుండా గలగల పారే మూచుకుందా (మూసీ) నది నేడు పారిశ్రామిక వ్యర్థాలతో మూసీ మురికికూపంగా మారి జాతీయ స్థాయిలో అత్యంత కాలుష్యం ఉన్న నదిగా మూసీ నది నాలుగో స్థానానికి చేరుకుంది. దీనితో త్రాగునీటి మూసీ కనీసం పంట పొలాలకు ఉపయోగించుకునేందుకై వీలులేని విధంగా మూసీ నీరు విషతుల్యమైంది.

03/03/2018 - 02:54

మంథని, మార్చి 2: తెలంగాణ ప్రభుత్వం దోచుకునేందుకే ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తుందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మాజీ శాసన సభ స్పీకర్ దివంగత శ్రీపాధ రావు జయంతి సందర్బంగా మంథనిలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.

03/03/2018 - 02:53

యైటింక్లయిన్‌కాలనీ, మార్చి 2: సింగరేణి ఆర్జీ-2 పరిధిలోని ఓసిపి-3లో జిఎంవిజయబాబు మూడు కొత్త డంపర్లను శుక్రవారం ప్రారంభించారు. గురువారం బేస్ వర్క్‌షాపులో జరిగిన కార్యక్రమంలో జిఎం 300 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల డంపర్లు, ఒక డోజర్‌ను జిఎం విజయబాబు ప్రారంభించారు.

03/03/2018 - 02:52

కమాన్‌పూర్, మార్చి 2: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే టి ఆర్ ఎస్ ప్రభుత్వ లక్ష్యమని పుట్ట మధు అన్నారు. ఎస్ ఆర్ ఎస్‌పి డి-83 రంగపురం వద్ద కాలువకు సుందిల్ల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పైప్‌లైన్‌ను అనుసంధానం చేసి కమాన్‌పూర్ మండలంలోని చెరువులు, కుంటలు నింపే ప్రక్రియలో భాగంగా శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ సూపరింటెండెంట్ నల్లా వెంకటేశ్వర్లుతో కాలువ పాయింట్‌ను పరిశీలించారు.

03/03/2018 - 02:52

హైదరాబాద్, ఫిబ్రవరి 2: జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభను ఈ నెల 14న గుంటూరులో లాంఛనంగా ప్రారంభించనున్నట్టు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ శుక్రవారం నాడు తెలిపారు.

Pages