S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/03/2018 - 02:19

హైదరాబాద్, జనవరి 2: వివిధ ప్రాజెక్టుల కోసం జరిపే భూసేకరణకు అయ్యే వ్యయానికంటే ప్రకటనలకయ్యే ఖర్చు ఎక్కువగా పెట్టే విధానానికి స్వస్తి పలకాలని నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి కలెక్టర్లను ఆదేశించారు. భూ సేకరణ ప్రక్రియ కోసం విస్తృత ప్రచారం జరగాల్సి ఉన్నప్పటికీ సదరు భూములకు చెల్లించే నష్టపరిహారం కంటే ప్రకటనలకు ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూడాలని జోషి సూచించారు.

01/03/2018 - 02:18

హైదరాబాద్, జనవరి 2: దివ్యాంగులకు, మహిళలకు చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, దివ్యాంగుల సంక్షేమం, రోడ్లుభవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు, మహిళలు ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారని, ప్రభుత్వం ఇప్పటికే వీరికోసం ప్రతిపాదించిన పథకాలు, కార్యక్రమాలు 2018 సంవత్సరంలో నూటికి నూరుశాతం అమలు చేయాలని కోరారు.

01/03/2018 - 00:55

వేములవాడ, జనవరి 2: శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం పాలనలో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు దేవాదాయ శాఖ సంస్కరణలు చేపట్టనుంది. ఇదే సమయంలో అక్రమార్కులకు, అవినీతిపరులకు కళ్లెం వేసేందుకు చర్యలు చేపడుతోంది. పాలననూ ప్రక్షాళన చేయడానికి శ్రీకారం చూడుతోంది..

01/02/2018 - 04:01

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ రాష్ట్రం యావత్తూ రైతులు సోమవారం ఆనందంగా పండగ చేసుకున్నారు. 2018 కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా సేద్యం బావులకు నిరంతర విద్యుత్తు ఇవ్వడం ఈరోజు ప్రారంభం కావడమే ఈ ఆనందానికి, పండగకు కారణం. రైతులు వేలాది మంది తమ తమ బావుల వద్దకు వెళ్లి కొబ్బరి కాయలు కొట్టి కుటుంబ సభ్యులతో పాటు పండగ చేసుకున్నారు.

01/02/2018 - 03:59

హైదరాబాద్, జనవరి 1: నూతన సంవత్సర వేడుకల్లో మితిమీరి మద్యం సేవించి వాహనాలు నడప వద్దని పోలీసులు విధించిన ఆంక్షలను చాలా మంది లెక్కచేయలేదు. మా దారి మాదే అన్నట్లు పూటుగా మద్యం సేవించి రోడ్లపై హల్‌చల్ చేశారు. పోలీసులు తమ ప్రణాళిక ప్రకారం ముందే డిసెంబర్ 31 రాత్రి పకడ్భందీగా చెక్‌పోస్టులు, బ్రీతింగ్ అనలైజర్‌తో మద్యం ఏమేరకు సేవించిందీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

01/02/2018 - 03:58

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కితాబిచ్చారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) డైరీ-2018 ని సిఎం సోమవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారని శ్లాఘించారు.

01/02/2018 - 03:57

హైదరాబాద్, జనవరి 1: ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుద్దామని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన నూతన సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రవాణా శాఖను ప్రజావసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్దంగా కృషి చేయాలని అన్నారు.

01/02/2018 - 03:55

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ పోలీసు శాఖ ఆధునాతన సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పని చేసేందుకు మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో ప్రయోగాత్మకంగా అమలు చేసి విజయవంతమైన ‘హైడ్‌కాప్’ను రాష్ట్ర స్థాయిలో ‘టిఎస్‌కాప్’గా విస్తరించింది. డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం నాడిక్కడ తన కార్యాలయంలో ‘టిఎస్‌కాప్’ను లాంఛనంగా ప్రారంభించారు.

01/01/2018 - 04:24

నిర్మల్, డిసెంబర్ 31: ఓవర్‌హెడ్ ట్యాం కుల నిర్మాణంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తామని రాష్ట్ర న్యాయ, గృహనిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని రూ.39.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఐదు ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, పైప్‌లైన్ తదితర పనులను గాంధీపార్క్‌లో జిల్లా కలెక్టర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

01/01/2018 - 04:27

సిద్దిపేట, డిసెంబర్ 31 :దేశంలో తెలంగాణ పోలీస్ నెంబర్ వన్‌గా ఉన్నారని, వారు ప్రపంచ పోలీసింగ్ స్థాయికి ఎదగాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో 2018 సంవత్సరంలో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం, కొత్త టెక్నాలజీని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అన్ని జిల్లాలో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు.

Pages