S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/15/2017 - 04:05

హైదరాబాద్, జూన్ 14: పోలీసులు టెక్నాలజీని వినియోగించుకోవడమే కాకుండా, నూతన టెక్నాలజీని గుర్తించే సామర్ధ్యం, నైపుణ్యాన్ని పెంచుకోవాలని తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మ పిలుపునిచ్చారు. పోలీస్ అధికారుల్లో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వడంతోనే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన ఉద్ఘాటించారు.

06/15/2017 - 04:03

హైదరాబాద్, జూన్ 14: నెలన్నర కిందట పంట రుణ మాఫీ చివరి వాయిదా డబ్బులను బ్యాంకర్లకు చెల్లించినా కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రెండు రోజులలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని బ్యాంకర్లను ఆర్థికశాఖ ఆదేశించింది.

06/15/2017 - 04:01

హైదరాబాద్, జూన్ 14: గొర్రెల పంపిణీ పథకంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కొనుగోలు చేసే ప్రతి గొర్రెకు ట్యాగింగ్ చేయాలని సూచించారు. గొర్రెల పంపిణీ పథకానికి అనూహ్య స్పందన లభించిందన్నారు.

06/15/2017 - 04:01

హైదరాబాద్, జూన్ 14: హైదరాబాద్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్లు కలిగిన 15 ప్రైవేటు ట్రావెల్స్‌ను రవాణాశాఖ అధికారులు బుధవారం సీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను సీజ్ చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రభుత్వాలు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

06/15/2017 - 04:00

హైదరాబాద్, జూన్ 14: ఆసియా ఫసిఫిక్ రీజియన్‌లోనే వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించే కార్యాలయాల ఆవరణ (ఆఫీస్ స్పేస్) కోసం పెట్టిన పెట్టుబడుల్లో హైదరాబాద్ నెంబర్ వన్‌గా నిలిచింది. దేశ రాజధాని న్యూఢిల్లీ, బెంగళూరు, వాణిజ్య రాజధాని ముంబయిని మించి హైదరాబాద్ తొలి స్థానాన్ని ఆక్రమించింది.

06/15/2017 - 04:00

హైదరాబాద్, జూన్ 14: మియాపూర్ భూస్కాం కేసులో ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్ డైరెక్టర్ పిఎస్ పార్ధసారథి, సువిశాల్ పవర్ జనరేషన్ సంస్థ డైరెక్టర్ పివిఎస్ శర్మకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కాం కేసులో కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. కింది కోర్టు బెయిల్ తిరస్కరించడంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు.

06/15/2017 - 03:59

హైదరాబాద్, జూన్ 14: రంజాన్ సందర్భంగా ఈ నెల 18వ తేదీన ముస్లింలకు ఇస్తున్న ఇఫ్తార్ విందుకు అయ్యే వ్యయంపై వివరాలు ఇవ్వాలంటూ హైకోర్టు మైనార్టీ సంక్షేమ శాఖను ఆదేశించింది. నగరానికి చెందిన ఒక సామాజిక కార్యకర్త హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం వివరాలు ఇవ్వాలని మైనార్టీ సంక్షేమ శాఖను ఆదేశించింది.

06/15/2017 - 03:58

హైదరాబాద్, జూన్ 14: భూకుంభకోణంలో ముఖ్యమంత్రి పాత్రపై సిబిఐ విచారణ జరిపించాలని, లేదంటే సిఎం పదవి నుండి కెసిఆర్ తప్పుకోవాలని బిజెపి సీనియర్ నేతలు ఎన్ ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్ధనరెడ్డిలు డిమాండ్ చేశారు. భూకుంభకోణాల నేపథ్యంలో నాగం జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.

06/15/2017 - 03:58

హైదరాబాద్, జూన్ 14: పాఠశాలల్లో , కాలేజీల్లో సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ విద్యార్థి సంఘాలు ఎలుగెత్తాయి. ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ అడ్మిషన్లు చేస్తామని చెప్పిన ప్రభుత్వం వెనుకడుగు వేయడం కార్పొరేట్ కాలేజీలకు రెడ్ కార్పెట్ పరచడమేనని పేర్కొంటూ ఎబివిపి రాష్ట్ర బంద్ నిర్వహించింది.

06/15/2017 - 01:24

హైదరాబాద్, జూన్ 14: తెలంగాణ రాష్ట్రంలో 2017-18 సంవత్సరంలో 90 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 2017 వానాకాలంలో 54.60 లక్షల టన్నులు, 2017-18 యాసంగిలో 36.28 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్ నేతృత్వంలో సమగ్ర ప్రణాళికను రూపొందించారు.

Pages