S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/13/2017 - 03:39

హైదరాబాద్, జూన్ 12: హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేటకు చెందిన ఓ బాలిక అదృశ్యంపై ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ స్పందించారు. బాలిక ఆచూకీ కనుగొనాలంటూ ట్విట్టర్ ద్వారా నగర పోలీస్ కమిషనర్లను మంత్రి కేటిఆర్ ఆదేశించారు. దీంతో ఆ బాలిక కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

06/13/2017 - 03:37

ఆదిలాబాద్,జూన్ 12: బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంగా నైరుతి రుతుపవనాలు రాయలసీమ మీదుగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాను తాకడంతో భారీ వర్షాలు నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన తొలకరి వర్షాలకు రహదారులన్నీ జలమయం కాగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో మొన్నటి వరకు ఏడారిని తలపించిన కుంటలు, చెరువులు, జలాశయాలు తొలకరి వర్షాలకే జలకళను సంతరించుకున్నాయి.

06/13/2017 - 03:36

వరంగల్, జూన్ 12: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు.. పెళ్లిళ్ల సందర్భంగా సముద్రం లోతులోకి వెళ్లి పెళ్లి చేసుకోవడం, ఆకాశంలో బెలూన్లలో విహారం చేస్తూ పరిణయమాడటం వంటి, పెళ్లిళ్ల సందర్భంగా టెక్నాలజీని ఉపయోగించిన పెళ్లిపత్రికలు పంపిణీ చేయడం వంటి వార్తలు చదువుతున్నాం.. చూస్తున్నాం..

06/13/2017 - 02:43

హైదరాబాద్, జూన్ 12: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్‌స్టర్ నరుూం ఇంట్లోని డెన్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ జరుపుతున్న దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. రహస్యంగా ఉన్న డెన్‌లో తుపాకులు, ఆయుధాలే కాదు.. బుల్లెట్లతోపాటు పలువురు ప్రముఖల పేర్లతో ఉన్న మరో డైరీ లభ్యమైనట్టు తెలిసింది. వీరిలో మరో ఆరుగురు పోలీస్ అధికారుల పేరున్నట్టు తెలుస్తోంది.

06/13/2017 - 02:41

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ ప్రభుత్వం వినూత్న పద్ధతిలో పశువుల అమ్మకం, కొనుగోలుకు ఆన్‌లైన్ సౌకర్యం కల్పించింది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఈ తరహా విధానంలో క్రయవిక్రయాలు చేపట్టలేదని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టమవుతోంది. నేషనల్ ఇన్‌ఫర్మెటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) సహకారంతో పశుసంవర్థక శాఖ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

06/13/2017 - 02:39

హైదరాబాద్, జూన్ 12:్భ కుంభకోణంలో దోషులు ఎంతటి వారైనా ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తమ భూ భాగోతం బయటపడుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. 2006 నుంచి 2014 వరకు ఢిల్లీ పెద్దల అండతోనే కాంగ్రెస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారని అన్నారు. టిఆర్‌ఎస్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో కర్నె ప్రభాకర్ మాట్లాడారు.

06/13/2017 - 02:38

హైదరాబాద్, జూన్ 12: రాష్ట్రంలో రెచ్చిపోతున్న అడవి దొంగలకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అటవీ సంపదను కొల్లగొట్టడమే కాకుండా అడవుల్లోని జంతువులను వేటాడుతున్న వేటగాళ్లను అడ్డుకోవాలని అటవీ శాఖ నిర్ణయించింది. వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి దీనిపై ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. తరుచుగా జంతువులను వేటాడే అటవీ ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రతా చర్యలు ఎక్కువ చేస్తారు.

06/13/2017 - 02:36

హైదరాబాద్, జూన్ 12: ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌వన్‌గా ఖ్యాతి గడించారని, ఇక్కడి పోలీస్ శిక్షణ పలు రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆదిభట్ల నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆయన డిజిపి అనురాగ్‌శర్మ, కమిషనర్లు మహేశ్ ఎం భగవత్‌లతో కలసి ప్రారంభించారు.

06/13/2017 - 02:34

హైదరాబాద్, జూన్ 12: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు భారీ కోత విధించారు. 2017-18 సంవత్సరానికి గానూ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు జెఎన్‌టియు, ఉస్మానియా యూనివర్శిటీలు అనుబంధ గుర్తింపును జారీ చేశాయి. 250కాలేజీలకు గుర్తింపు లభించగా అందులో 1,26,315 సీట్లు ఉన్నాయి. బి ఫార్మసీలో 137కాలేజీలుండగా అందులో 12,931 సీట్లు ఉన్నాయి.

06/13/2017 - 02:31

హైదరాబాద్, జూన్ 12: గురుకులాల్లో పిజిటి, టిజిటి ఎంపికకు ఈ నెల 14న తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఎంపిక పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష ఉదయం 10 నుండి 12.30 వరకూ జరుగుతుంది. హెచ్‌ఎండిఎ పరిధిలో 51 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 36,480 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేశారు. అభ్యర్ధులకు ఇప్పటికే హాల్ టిక్కెట్లు జారీ చేశామని, అభ్యర్ధులు కనీసం గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు.

Pages