S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/13/2017 - 02:31

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది నియమించిన మార్కెట్ కమిటీలకు గడువు మీరుతుండటంతో మరో ఆరునెలల పాటు వీటి గడువును ప్రభుత్వం పొడిగించింది. గత రెండునెలల్లో దాదాపు వందకుపైగా కమిటీల గడువును పొడిగించారు.

06/13/2017 - 01:24

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు గడిచినా ‘్ధర్మిక పరిషత్’ను ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ యావత్తూ ‘దైవాధీనం’లో నడుస్తోంది. ఎండోమెంట్స్ మంత్రిగా ఇంద్రకరణ్‌రెడ్డి సమర్థతగా పనిచేస్తున్నప్పటికీ, ఈ శాఖలో తగినంత మంది సిబ్బంది లేక ఆయన ఇబ్బందికరంగానే పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఎండోమెంట్స్ శాఖకు సంబంధించిన కీలకపోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి.

06/13/2017 - 01:23

కొత్తగూడెం, జూన్ 12: తెలంగాణ రాష్ట్రంలో భూ, ఇసుక మాఫియా పరిపాలన సాగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ధ్వజమెత్తారు. పోడు భూములను లాక్కునే ప్రభుత్వాన్ని పాతరేస్తామని హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబులు మోకరిల్లుతున్నారని ఎద్దేవా చేశారు.

06/13/2017 - 01:22

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ రాష్ట్రంలో బయటపడిన మియాపూర్ భారీ భూ కుంభకోణంపై ఎందుకు నోరు విప్పడం లేదని టిపిసిసి కిసాన్ విభాగం అధ్యక్షుడు ఎం.కోదండ రెడ్డి సిఎం కెసిఆర్‌ను నిలదీశారు. రోజు రోజుకీ ఈ కుంభకోణంలో కొత్త కొత్త అంశాలు బయటపడుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం దారుణమని అన్నారు.

06/13/2017 - 00:06

హైదరాబాద్, జూన్ 12: నైరుతి రుతుపవనాలు తెలంగాణను సోమవారం తాకడమే కాకుండా రాష్టవ్య్రాప్తంగా ఒకేరోజు విస్తరించాయి. సాధారణంగా తెలంగాణ సరిహద్దులో ఉండే జోగులాంబ గద్వాల జిల్లాను రుతుపవనాలు తాకిన తర్వాత రెండు, మూడు రోజులకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ ఉంటాయి. గతంలో చాలాసార్లు ఇలాగే జరిగింది. ఈ సంవత్సరం రుతుపవనాలు ఒకేరోజు రాష్ట్రంలో ప్రవేశించడమే కాకుండా, రాష్టవ్య్రాప్తంగా విస్తరించాయి.

06/13/2017 - 00:05

హైదరాబాద్, జూన్ 12: విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజుననే 169 గురుకుల విద్యాలయాలు ప్రారంభం కావడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే రోజు ఇన్ని గురుకుల విద్యాలయాలు ప్రారంభం కావడం చరిత్రలో రికార్డు ఆయన అన్నారు. కెజి టు పిజి విద్యను ప్రవేశపెడుతామని ఎన్నికలలో ఇచ్చిన హామీకి గురుకుల విద్యాలయాల ప్రారంభంతో అంకురార్పరణ జరిగిందన్నారు.

06/12/2017 - 03:13

నల్లగొండ, జూన్ 11: నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్, కరవు పీడిత మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగుతాగునీటితో పాటు జంటనగరాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన డిండి ప్రాజెక్టుకు సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేసి సోమవారంతో రెండేళ్లు పూర్తికానుంది.

06/12/2017 - 03:11

సిద్దిపేట, జూన్ 11 : తెలంగాణ సర్కార్ మైనార్టీ ల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.

06/12/2017 - 02:42

హైదరాబాద్, జూన్ 11: భారత్-పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడిన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జమ్ము,కశ్మీర్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తునారని, హైదరాబాద్, బెంగుళూరు టార్గెట్‌గా దాడులకు దిగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ అలర్టయింది.

06/12/2017 - 02:40

హైదరాబాద్, జూన్ 11: ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఒయు)లో అడుగు పెట్టే ధైర్యం లేదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సిఎం వ్యవహార శైలి ఒయు విద్యార్థులపై కక్ష కట్టినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులను అణచివేసేందుకే ఒయులో నిషేదాజ్ఞల జివో ను జారీ చేశారని అన్నారు.

Pages