S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/15/2017 - 01:23

హైదరాబాద్, జూన్ 14: దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి అమలులోకి రానున్న వస్తు వినియోగ పన్ను (జిఎస్‌టి) తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు ఇక్ఫాయి జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సు 17, 18 తేదీల్లో హోటల్ తాజ్ డక్కన్‌లో నిర్వహిస్తున్నట్టు లా స్కూల్ డీన్ ప్రొఫెసర్ ఎ వి నర్సింహారావు, డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకరరావు తెలిపారు.

06/15/2017 - 01:22

హైదరాబాద్, జూన్ 14: గజ్వేల్ ప్రాంత అభివృద్ధి అథారిటీ (గడా) కి 12.50 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ ప్రాంతాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వీలుగా గడాను ఏర్పాటు చేశారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ తదితర ప్రాంతాలను కలిపి గడాగా ఏర్పాటు చేశారు.

06/15/2017 - 01:22

హైదరాబాద్, జూన్ 14: తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి వివిధ భవనాలు నిర్మించేందుకు, పరిశోధనల కోసం 150 ఎకరాల భూమి అవసరమవుతుందని ఈ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు.

06/14/2017 - 04:04

హైదరాబాద్, జూన్ 13: భారతదేశంలో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే విధానం రావాలని, వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరగాల్సిన అవసరం ఉందని ఇస్రో మాజీ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు పద్మవిభూషణ్ కె. కస్తూరిరంగన్ తెలిపారు.

06/14/2017 - 04:03

హైదరాబాద్, జూన్ 13: మియాపూర్ ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవాలని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి బస్తీల్లోని పేద ప్రజలకు పిలుపునిచ్చారు. మియాపూర్ భూ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని టి.టిడిపి నేతలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి కోరారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.

06/14/2017 - 04:01

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఈ సంవత్సరం 46 వేల కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వాలని భావిస్తున్నట్టు సేద్యం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 2017-18 సంవత్సరం ‘వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక’ను సచివాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యవసాయ రుణప్రణాళిక మరోవారంరోజుల్లో ఖరారవుతుందన్నారు.

06/14/2017 - 02:58

హైదరాబాద్, జూన్ 13: ఈ ఏడాది వేసవి తీవ్రత కారణంగా దేశ వ్యాప్తంగా పలు జలాశయాల్లో నీరు తగ్గినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లోని 31 జలాశయాలతో పోలిస్తే తెలంగాణలో మాత్రం ఉన్నంతలో జలసిరి ఎక్కువగా ఉందని కేంద్ర జల సంఘం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని జలాశయాల్లో కూడా నీటి నిల్వలు తగ్గినా, గతంతో పోలిస్తే, ఇతర రాష్ట్రాల కంటే నీటి లభ్యత పరిస్ధితి బాగుంది.

06/14/2017 - 02:56

హైదరాబాద్, జూన్ 13: దువ్వాడ జగన్నాథం సినిమాలో ‘బడిలో గుడిలో’ పాటలోని బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే పదాలను దర్శక నిర్మాతలు తొలగించక పోతే సినిమా విడుదలను అడ్డుకోవడానికి వెనుకాడబోమని తెలంగాణ బ్రాహ్మణ సంఘాలు హెచ్చరించాయి. ఈ సినిమాలోని హైందవ వ్యతిరేక సన్నివేశాలను, పాటలను తొలగించాలని కోరుతూ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.

06/14/2017 - 02:55

హైదరాబాద్, జూన్ 13: కాంగ్రెస్, టిడిపి నాయకులు, టిజెఎసి నాయకులు కోదండరామ్ ఒకే మాట మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ ఎంపి బాల్కసుమన్, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

06/14/2017 - 02:55

హైదరాబాద్, జూన్ 13: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష ప్రస్తుతం నర్స్ కోర్స్ చదువుతోంది. సవతి తల్లి పెట్టిన చిత్రహింసల వల్ల ఆస్పత్రి పాలైన ప్రత్యూషను గత ఏడాది ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పరామర్శించి, ప్రభుత్వం తరఫున విద్య, వసతి కల్పించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చూపిన ఔధార్యంతో ప్రత్యూష చదువుకొని నర్స్ కోర్స్ చేయడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

Pages