S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/14/2017 - 02:53

హైదరాబాద్, జూన్ 13: హెచ్‌ఎండిఏ పరిధిలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరిధిలో జీవో 111ను ఉల్లంఘించి భవనాలను నిర్మించిన 40 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు, అధికారులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ అంశంపై దాఖలైన పిల్‌ను జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎన్ బాలయోగితో కూడిన ధర్మాసనం విచారించింది. క్వాలిటీ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ఈ పిల్‌ను దాఖలు చేసింది.

06/14/2017 - 02:51

హైదరాబాద్, జూన్ 13: మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహిత, దివంతగ డాక్టర్ సి. నారాయణ రెడ్డి అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. డాక్టర్ సినారెను కడసారి దర్శించుకుని, అంత్యక్రియల్లో పాల్గొనాలనుకునే వారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ ఆర్టీసీని ఆదేశించారు.

06/13/2017 - 23:51

హైదరాబాద్, జూన్ 13: మిషన్ భగీరథ పైప్‌లైన్ కోసం తవ్విన సిసి రోడ్లను వెంటనే తిరిగి నిర్మించాలని, వర్షాకాలం ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని పైప్‌లైన్ పనులు వెంటనే పూర్తి చేయాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంట్రా పనుల కోసం గ్రామాల్లో తవ్విన గుంతల్లో పైపులువేసి వెంటనే పూడ్చాలన్నారు. మంగళవారం ఆయన మిషన్ భగీరథ పనులను సమీక్షించారు.

06/13/2017 - 23:51

హైదరాబాద్, జూన్ 13: రాష్ట్ర చరిత్రలో ఇంత కుముందు ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ప్రభభుత్వం, ఏడు లక్షల మంది రైతులకు ఆన్‌లైన్ ద్వారా రూ.5 వేల కోట్లు చెల్లించింది.

06/13/2017 - 23:50

హైదరాబాద్, జూన్ 13: అంతర్జాతీయ విత్తన సదస్సుకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ ఏజెన్సీ (ఇస్తా) నేతృత్వంలో 2019 జూన్‌లో ఈ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ దేశాలకు ఇందుకు సంబంధించి ఆహ్వాన పత్రాలు పంపించేందుకు సన్సాహాలు జరుగుతున్నాయి. దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే ‘ఇస్తా’ నేతృత్వంలో సదస్సు జరగడం ఇదే ప్రథమం అవుతుంది.

06/13/2017 - 23:49

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌లో తొలుత వర్షాలు వచ్చి, ఆ తర్వాత నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. ఆదేవిధంగా సోమవారం రుతుపవనాలు వచ్చీ రాగానే రాష్టవ్య్రాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో పగటి వేళ గరిష్ఠ ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గిపోయింది.

06/13/2017 - 23:49

హైదరాబాద్, జూన్ 13: ఈ ఏడాది వేసవి తీవ్రత కారణంగా దేశ వ్యాప్తంగా పలు జలాశయాల్లో నీరు తగ్గినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లోని 31 జలాశయాలతో పోలిస్తే తెలంగాణలో మాత్రం ఉన్నంతలో జలసిరి ఎక్కువగా ఉందని కేంద్ర జల సంఘం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని జలాశయాల్లో కూడా నీటి నిల్వలు తగ్గినా, గతంతో పోలిస్తే, ఇతర రాష్ట్రాల కంటే నీటి లభ్యత పరిస్ధితి బాగుంది.

06/13/2017 - 23:48

హైదరాబాద్, జూన్ 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరుచేసే విషయమై కేంద్ర పర్యావరణ శాఖ ఈ నెల 15వ తేదీన సమావేశమవుతోంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి 4,500 హెక్టార్ల అటవీ భూములు అవసరమైనందున కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తప్పనిసరి.

06/13/2017 - 03:44

మెదక్ రూరల్, జూన్ 12: ఒకేరోజు రాష్ట్రంలో 119 బిసి గురుకుల పాఠశాలలు ప్రారంభించడం దేశంలోనే రికార్డని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. బిసిల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక కృషిచేస్తున్నారని పేర్కొన్నారు.

06/13/2017 - 03:41

కరీంనగర్, జూన్ 12: రాష్ట్రంలో 16 వేల కోట్ల రూపాయలతో గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం మంత్రి కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ భవన నిర్మాణానికి రూ.30 కోట్ల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని చెప్పారు.

Pages