S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/15/2017 - 03:04

హైదరాబాద్, మే 14: ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ‘ది ఆల్వేస్ బి చీర్‌ఫుల్ (ఎబిసి)’, లాఫ్టర్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్య యోగ ప్రక్రియను కూడా చేపట్టారు.

05/15/2017 - 02:53

వనపర్తి/ఆత్మకూరు, మే 14: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని పరమేశ్వరస్వామి చెరువు సమీపంలో ఆదివారం సాయంత్రం 11 జాతీయ పక్షులైన నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయ. ఆత్మకూరు ఎస్సై సిహెచ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఆత్మకూరు పరమేశ్వరస్వామి చెరువుకట్ట సమీపంలో ఒకేచోట నెమళ్ల గుంపు స్థబ్ధుగా పడి ఉన్న విషయాన్ని ప్రత్యక్షసాక్షులు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

05/15/2017 - 02:51

హైదరాబాద్, మే 14: తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతైతే కృషి చేశారో అంతే స్థాయిలో తెరాస ప్రభుత్వం కళ్లు తెరిపించేలా రైతుల దుస్థితిని తెలియజేస్తూ పాటలు రాయాలని టిటిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి కవులు, కళాకారులకు విజ్ఞప్తి చేశారు.

05/15/2017 - 01:44

హైదరాబాద్, మే 14: పేదలు, మధ్య తరగతికి చెందిన కుటుంబాల్లో మగపిల్లవాడి పెళ్లయినా, ఆడపిల్ల పెళ్లయినా అప్పుల ఊబిలో కూరుకుపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో దాదాపు కోటి కుటుంబాలు ఉండగా, వీటిలో 60శాతం కుటుంబాలు పెళ్లిళ్ల కారణంగా ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నాయి. బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల ముందు డాంబికం ప్రదర్శించాలన్న ఉత్సాహంతోనే అనేక కుటుంబాలు వివాహాల కోసం అప్పులు చేస్తున్నాయి.

05/15/2017 - 01:43

హైదరాబాద్, మే 14: హైదరాబాద్ నగరశివారులో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసివున్న ఇళ్లను, ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం ఓ వృద్ధురాలిని బంధించి పది తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. పివి ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ 38 సమీపంలోని దిల్షాద్‌నగర్‌లో నిర్మల అనే వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను బంధించారు.

05/15/2017 - 01:43

న్యూఢిల్లీ, మే 14: దేశ వ్యాప్తంగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించవలసిన అవసరం ఉందని కేంద్ర సామాజిక న్యా యం, సాధికారత మంత్రి రాందాస్ అథావలే అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఏపీ భవన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రజతోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.

05/15/2017 - 01:42

హైదరాబాద్, మే 14: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోట్లాది రూపాయలు పనులు జరుగుతుంటాయి. అదే సమయంలో అవినీతి వ్యవహారాలు సైతం ఇదే స్థాయిలో జరుగుతున్నాయి.

05/15/2017 - 01:41

హైదరాబాద్, మే 14:అక్రమ రేషన్ బియ్యం వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్ఫోర్స్ విభాగంతో మంచి ఫలితాలు వస్తున్నాయని పౌరసరఫరాల శాఖ కమీషనర్ సివి ఆనంద్ తెలిపారు.

05/14/2017 - 04:36

పరకాల, మే 13: తెలంగాణ రాష్ట్రంలో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. శనివారం భూపాలపల్లిలో మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మిర్చిని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్యా హ్నం నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు.

05/14/2017 - 04:33

కరీంనగర్, మే 14: ప్రభుత్వ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న అధ్యాపకుల క్రమబద్దీకరణ వివాదంగా మారుతోంది. తప్పుడు దృవీకరణ పత్రాలతో విధుల్లో చేరిన వారిని, ఎలాంటి పరిశీలనలు జరపకుండానే క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటంతో, దీనిని నిరసిస్తూ కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు లోకాయుక్తను ఆశ్రయించగా, విషయం వెలుగులోనికి వచ్చింది.

Pages