S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/25/2016 - 18:13

గోదావరి ఖని: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రజలంతా ఆ సంస్థ మనుగడను కాపాడుకోవాలని మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్ రెడ్డి అన్నారు. గోదావరి ఖనిలో శనివారం నాడు పది సిటీ బస్సులను, తిరుపతికి ఏసీ బస్సును వారు ప్రారంభించారు. నష్టాలతో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తోందన్నారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

06/25/2016 - 18:12

హైదరాబాద్: యువ దర్శకుడు క్రిష్‌కు డాక్టర్ రమ్యతో శనివారం నగరంలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, రానా తదితరులు హాజరై క్రిష్-రమ్య జంటను ఆశీర్వదించారు. బాలకృష్ణ నటిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

06/25/2016 - 18:11

మహబూబ్‌నగర్: హైదరాబాద్ నుంచి కర్నూలు వెళుతున్న ఓ కారు అడ్డాకుల మండలం పొన్నకల్ వద్ద శనివారం మధ్యాహ్నం బోల్తా పడడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

06/25/2016 - 15:37

సంగారెడ్డి: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా టి.టిడిపి నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి శనివారం రెండురోజుల నిరాహార దీక్షను ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడిని సందర్శించిన అనంతరం ఆయన ఏటిగడ్డ కిష్టాపూర్ చేరుకుని దీక్ష ప్రారంభించారు. భూములను కోల్పోయే రైతులకు న్యాయమైన రీతిలో పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

06/25/2016 - 15:36

హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు చైన్‌స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా రెండు బృందాలుగా విడిపోయి ఒంటరిగా వెళుతున్న మహిళల నుంచి బంగారు గొలుసులు లాక్కెళుతున్నారు. వీరి నుంచి 91 తులాల బంగారం, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు.

06/25/2016 - 15:35

హైదరాబాద్: కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఓ ఉపాధ్యాయుడు తాను పనిచేస్తున్న ప్రైవేటు పాఠశాల భవనం పైనుంచి కిందకు దూకి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే రాజు అనే ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

06/25/2016 - 15:34

హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయే రైతులకు వారు కోరుకున్న రీతిలోనే నష్టపరిహారం చెల్లిస్తామని సిఎం కెసిఆర్ శనివారం ప్రకటించారు. నిర్వాసిత రైతులకు నష్టపరిహారం విషయమై విపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు ఈరోజు సిఎంను కలిసి తాజా పరిస్థితిని వివరించారు.

06/25/2016 - 13:44

హైదరాబాద్: రాజేంద్రనగర్ మండలంలో హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళుతున్న డిసిఎం వ్యాన్ రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని ఢీకొంది. దీంతో వ్యాన్ డ్రైవర్ సహా మరోవ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఇదే ఘటనలో గాయపడిన ముగ్గురిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

06/25/2016 - 13:44

హైదరాబాద్: తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఆటో డ్రైవర్ నర్సింహులు, శ్రీను శుక్రవారం రాత్రి కల్లు తాగి గొడవ పడ్డారు. ఘర్షణ ముదరడంతో పరస్పరం కొట్టుకున్నారు. ఆ క్రమంలో చేతికందిన బండరాయితో శ్రీను ఆవేశంతో నర్సింహులు తలపై గట్టిగా మోదాడు. దీంతో నర్సింహులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

06/25/2016 - 13:44

హైదరాబాద్: తెలంగాణ సర్కారు విద్యుత్ ఛార్జీలను పెంచినందుకు నిరసనగా నగరంలోని విద్యుత్ సౌధ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ధర్నా నిర్వహించారు. విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, శ్రీశైలం గౌడ్ తదితరులు పోలీసులు అరెస్టు చేశారు.

Pages