S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/20/2017 - 04:39

హైదరాబాద్, ఏప్రిల్ 19: విద్యుత్తు వినియోగదారులైన ప్రజలు బిల్లు చెల్లించకపోతే ‘్ఠపీ’మని విద్యుత్తు సరఫరా నిలిపి వేసే విద్యుత్తు శాఖకు కష్టాలు వచ్చి పడ్డాయి. వంద, రెండు వందల కోట్లు కాదు ఏకంగా 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వ శాఖల నుంచి, స్థానిక సంస్థల నుంచి వసూలు చేయలేక చతికిలపడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు విద్యుత్తు శాఖ వ్యూహంతో ముందుకెళ్ళేందుకు సమాయత్తమైంది.

04/20/2017 - 04:38

హైదరాబాద్, ఏప్రిల్ 19: ప్రభుత్వ అసమర్థత వల్ల సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల కల్పన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. సమర్థత లేని న్యాయవాదులను నియమించుకోవడం వల్లే ఇలా సింగరేణి సహా దాదాపు 20 కేసుల్లో న్యాయస్థానాల నుంచి ప్రభుత్వానికి చుక్కెదురైందని అన్నారు.

04/20/2017 - 04:37

హైదరాబాద్, ఏప్రిల్ 19: హైదరాబాద్ నగర శివారులోని కొంపల్లిలో ఈ నెల 21న నిర్వహించనున్న టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తి అయినట్టు ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్లీనరీ ప్రాంగణాన్ని మంత్రి కెటిఆర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, ప్లీనరీకి 15 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు.

04/20/2017 - 04:35

హైదరాబాద్, ఏప్రిల్ 19: తీవ్రమైన వడగాల్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పాఠశాలలకు బుధవారం నుంచే వేసవి సెలవులు ఇవ్వాలలని సిఎం కె చంద్రశేఖరరావు ఆదేశించారు. ఎండవేడి కారణంగా బయట తిరిగే పరిస్థితి లేదని, విద్యార్ధులను బడికి పంపడం శ్రేయస్కరం కాదని సిఎం అభిప్రాయపడ్డారు. బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వేసవి సెలులు అమలయ్యేలా చూడాలని విద్యామంత్రిని, అధికారులను ఆదేశించారు.

04/19/2017 - 08:27

హైదరాబాద్, ఏప్రిల్ 18: భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత, అంబర్‌పేట ఎమ్మెల్యే జి కిషన్‌రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈమేరకు ఆయన మంగళవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను చంపుతానంటూ గుర్తు తెలియని కొందరు ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేస్తున్నారని ఆయన సిసిఎస్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నామని డిసిపి అవినాష్ మహంతి తెలిపారు.

04/19/2017 - 08:26

హైదరాబాద్, ఏప్రిల్ 18: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోని వివిధ బ్యాంకుల ఎటిఎంలు గత వారం, పదిరోజుల నుండి పనిచేయడం లేదు. ప్రతి ఎటిఎం ముందు ‘డబ్బులేదు’ (నోక్యాష్) అన్న బోర్డు వేలాడుతోంది. కనీసం 500రూపాయలు తీసుకోవాలన్నా వినియోగదారులకు ఇబ్బంది అవుతోంది. ఏ ఎటిఎంలోనూ సంబంధిత బ్యాంకు వాళ్లు ఎప్పుడు డబ్బు పెడతారో తెలియడం లేదు. ఎటిఎంలో డబ్బు పెట్టిన గంటలోగా సదరు ఎటిఎం ఖాళీ అయిపోతోంది.

04/19/2017 - 08:25

హైదరాబాద్, ఏప్రిల్ 18:‘‘హలో మంత్రిగారున్నారా? లేరండి కూలీ పనికి వెళ్లారు....’’మంత్రి కోసం ఫోన్ చేస్తే వినిపించే సమాధానం ఇది.. ‘‘మంత్రిగారు ఎప్పుడొస్తారు.. సార్ కూలీ పనిలో ఉన్నారు.. ఈ రోజు రారు’’సచివాలయంలో మంత్రి చాంబర్‌లో వినిపిస్తున్న మాటలివి. దాదాపు అందరు మంత్రుల నుంచి ఇవే సమాధానాలు. టిఆర్‌ఎస్ ప్లీనరీ, బహిరంగ సభ కోసం వారం రోజుల పాటు కూలీ వారోత్సవం నిర్వహిస్తున్నారు.

04/19/2017 - 01:58

మార్కెట్‌లో
ప్రతి బుధవారం

ప్రతి శనివారం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు బంద్
ఎనుమాముల మార్కెట్ పాలకవర్గం తాజా నిర్ణయం

04/19/2017 - 01:27

సాధారణ బదిలీలపై ఉద్యోగ జెఎసికి సిఎస్ హామీ

త్వరలో పిఆర్‌సి బకాయిల చెల్లింపు వారంలో సమస్యల పరిష్కారానికి కృషి

04/19/2017 - 01:26

హైదరాబాద్, ఏప్రిల్ 18:నగరంలో పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించేందుకు 2013లో విడుదల చేసిన జీవో 20ని కచ్చితంగా అమలు చేస్తామని ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. అటవీ, కాలుష్య నియంత్రణ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి పరిశ్రమల యాజమాన్యాలతో కెటిఆర్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Pages