S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/25/2017 - 03:53

హైదరాబాద్, ఫిబ్రవరి 24: రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రాష్ట్రంలోని 21 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు, మిగిలిన 10 జిల్లాల్లో 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది.

02/25/2017 - 03:52

హైదరాబాద్, ఫిబ్రవరి 24: వివాహ సంబంధ వివాదం కేసులో ఒక వ్యక్తిని పుంసత్వ పరీక్ష చేయించుకోవాలని కోర్టు ఆదేశించడమంటే ప్రాథమిక హక్కుకు భంగం కలిగించినట్లుగా భావించరాదని హైకోర్టు పేర్కొంది. పోలీసులు ఈ పరీక్షను అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి వైద్యుల ద్వారా నిర్వహించడం దర్యాప్తులో భాగమని కోర్టు పేర్కొంది.

02/25/2017 - 03:52

హైదరాబాద్, ఫిబ్రవరి 24: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌పై తెలంగాణ ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (1980 ఎపి రివైజ్డ్ పెన్షన్ రూల్స్)ను అమలుచేయాలని కోరుతున్నారు.

02/25/2017 - 03:51

హైదరాబాద్, ఫిబ్రవరి 24: విశ్వవిద్యాలయాల్లో దేశ వ్యతిరేక చర్యలను సహించొద్దని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్ అయ్యప్ప పేర్కొన్నారు. ఈ నెల 21న ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని రాంజస్ కాలేజీలో ఇంగ్లీషు డిపార్టుమెంట్ నిర్వహించిన కల్చరల్ ఫెస్టివల్‌లో జెఎన్‌యు ఘటనలో వివాదాస్పద వ్యక్తులు ఉమర్ ఖలీద్, షీలా రషీద్‌లు పాల్గొనడమే గాక, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు.

02/25/2017 - 03:50

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు చైర్ పర్సన్‌గా ఎమ్మెల్సీ సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వక్ఫ్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం నూతనంగా ఎన్నికైన బోర్డు సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు ఈ మేరకు సమావేశమై చైర్ పర్సన్‌ను ఎన్నుకున్నట్టు వక్ఫ్ బోర్డు సిఇవో అసదుల్లా అధికారికంగా ప్రకటించారు.

02/25/2017 - 02:39

హైదరాబాద్, ఫిబ్రవరి 24: భూదాన్ యజ్ఞ బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదో రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహారాష్టక్రు చెందిన సర్వ సేవా సంఘ్ దాఖలు చేసిన పిటీషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది.

02/25/2017 - 02:38

హైదరాబాద్, ఫిబ్రవరి 24: న్యాయవ్యవస్థలో సంస్కరణలు అనే అంశంపై రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సును ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టిస్ ప్రతినిధి నజీర్ ఖాన్ తెలిపారు. ఒయులోని పిజిఆర్‌ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్లాటినమ్ జూబ్లీ ఆడిటోరియంలో ఈ సదస్సు జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

02/25/2017 - 02:37

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తార్నాకలోని ఐఐసిటి ఆడిటోరియంలో రిసెర్చ్ అండ్ ఇన్నో వేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్)ను కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయని తెలిపారు. పరిశోధనల్లో దేశంలో హైదరాబాద్ టాప్ అని అన్నారు.

02/24/2017 - 11:48

మహబూబాబాద్ : కురవి వీరభద్ర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి బంగారు కోర మీసాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో పాటు జిల్లా టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

02/24/2017 - 11:46

నకిరేకల్‌: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న కెమికల్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన జిల్లాలోని నకిరేకల్‌ మండలం ఐటిపాముల సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Pages