S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/30/2016 - 04:54

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇంతవరకు 8,51,501 దీపం కనెక్షన్లను మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభకు చెప్పారు. అసెంబ్లీలో గురువారం టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, అజ్మీరా రేఖ, కోవా లక్ష్మి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ దీపం పథకం కింద ఇంతవరకు 3,61,716 కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందన్నారు.

12/30/2016 - 04:53

హైదరాబాద్, డిసెంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, జర్నలిస్టులకు ఔట్ పేషెంట్లుగా చికిత్స అందించేందుకు ఈ నెల 17వ తేదీన వెల్‌నెస్ సెంటర్లను ప్రారంభించామని, త్వరలో జిల్లాల్లో కూడా ఈ తరహా సెంటర్లను ఏర్పాటు చేస్తామని వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు.

12/30/2016 - 04:52

చౌటుప్పల్, డిసెంబర్ 29: చౌటుప్పల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గల శ్రీ రామ కూరగాయల మార్కెట్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 12 షెడ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటిలో ఉన్న కూరగాయలు, దస్త్రాలు, ఎలక్ట్రికల్ కాంటాలు దగ్ధమైపోయాయి. సుమారు రూ. 15 లక్షల మేర నష్టం జరిగింది. కూరగాయల వ్యాపారి ఆర్. అల్లారి పెంచుకుంటున్న 15 కుందేళ్లు, వాటి ఎనిమిది కూనలు అగ్నిప్రమాదంలో సజీవదహనమయ్యాయి.

12/30/2016 - 04:51

పటన్‌చెరు, డిసెంబర్ 29: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్, ఆయన సోదరుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సహా పలువురు పార్టీ శాసనసభ్యులకు ఊరట లభించింది.

12/30/2016 - 04:50

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకునే విధంగా ఉందని టిపిసిసి నేత మల్లు రవి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం 2014 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారన్నారు. వాస్తవానికి 2014 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదన్నారు.

12/30/2016 - 02:20

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణలో పాడిపరిశ్రమాభవృద్ధిపై త్వరలో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామని అన్నిపార్టీలు, డెయిరీ నిపుణుల అభిప్రాయాలను స్వీకరిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాగా పని చేస్తున్నారని, తెలంగాణలోని చెరువుల్లో 4కోట్లకు పైగా చేపపిల్లల పెంపకానికి అద్భుతంగా పనిచేశారని కితాబునిచ్చారు.

12/30/2016 - 02:19

హైదరాబాద్, డిసెంబర్ 29: హరితహారంను సామాజిక ఉద్యమంగా చేపట్టనున్నట్టు, గ్రామస్థాయి నుంచి రాష్టస్థ్రాయి వరకు ప్రజాప్రతినిధులను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గురువారం శాసన సభలో హరిత హారంపై లఘు చర్చ జరిగింది. హరిత హారంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేస్తూ, దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా రాష్ట్రంలో హరితహారాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు.

12/30/2016 - 02:14

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూసేకరణ బిల్లుకు గురువారం శాసన మండలి ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ శాసనమండలి నుండి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. భూసేకరణ, పునరావాసం, పున: పరిష్కారంలో న్యాయమైన పరిహారం, పారదర్శక హక్కు(తెలంగాణ సవరణ)బిల్లు,2016ను నీటిపారుదల మంత్రి టి. హరీష్‌రావు కౌన్సిల్‌లో ప్రతిపాదించారు.

12/30/2016 - 02:14

హైదరాబాద్, డిసెంబర్ 29: సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మించి ఓ మైనర్ బాలికపై 17 రోజులపాటు అత్యాచారానికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బంజారాహిల్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు సినీ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు.

12/30/2016 - 01:50

సికిందరాబాద్, డిసెంబర్ 29: ప్రజాసామ్యయుతంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు. 2013 భూ సేకరణ చట్టానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను విరమించుకోవాలని, బలవంతపు భూసేకరణను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గురువారం తార్నాకాలోని తన నివాసంలో దీక్ష చేపట్టారు.

Pages