S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/23/2016 - 03:14

హైదరాబాద్, నవంబర్ 22:పెద్దనోట్ల రద్దుపై కేంద్రం రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది. నగరానికి చెందిన సయ్యద్ రియాజుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారించింది. పెద్దనోట్లను రద్దు చేయడంవల్ల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.

11/23/2016 - 03:13

హైదరాబాద్, నవంబర్ 22: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఏకంగా నీలిచిత్రాలు చూపిస్తూ విద్యాపోషకుల ఆగ్రహాన్ని చవిచూశాడు. ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్‌లో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. నాగాల్‌లోని జనప్రియ ఒలంపియాడ్ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వర్మ యూట్యూబ్‌లో విద్యార్థులకు నీలి చిత్రాలు చూపెడుతున్నాడు.

11/23/2016 - 03:12

హైదరాబాద్, నవంబర్ 22: నోట్ల రద్దువల్ల రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, సామాన్య ప్రజలు, రైతులు, అసంఘటిత వ్యాపారులు, చిరు వ్యాపారులకు తలెత్తిన ఇబ్బందులను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఇబ్బందులు తొలగించడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ఢిల్లీ పర్యటన విశేషాలను వివరించారు.

11/23/2016 - 03:03

కరీంనగర్, నవంబర్ 22: రియాల్టీషో మోజు ఓ బాలుడి ప్రాణం తీసింది. యూట్యూబ్‌లో ఉన్న ఓ వీడియో సాహస దృశ్యాన్ని అనుకరిస్తూ చేసిన ప్రయోగం వికటించి తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిన సంఘటన విషాదాన్ని నింపిం ది. మంటల్లో చిక్కుకుని కాలిన గాయాలతో ఐదురోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన కోడూరి ఘనశ్యాం (12) అనే బాలు డు చివరకు మంగళవారం ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన కరీంనగర్‌లో కలకలం రేపింది.

11/23/2016 - 02:59

రామాయంపేట, నవంబర్ 22: వలసల బతుకులు మారాలన్నా..కరవు బాధలు తీరాలన్నా కాలువలు తవ్వాల్సిందేనని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. మంగళవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి సిసి రోడ్డు, ఫీడర్‌చానల్, కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపనలు, సబ్ మార్కె ట్ యార్డు ప్రారంభోత్సవం చేసి సమావేశంలో మంత్రి మాట్లాడారు.

11/23/2016 - 02:56

మహబూబ్‌నగర్, నవంబర్ 22: మరోసారి మహబూబ్‌నగర్ తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తన గళాన్ని విప్పారు. ఇది వరకే మహబూబ్‌నగర్ జిల్లాలో పలు సమావేశాలకు హజరైన మంత్రుల ఎదుట లోపాలను ఎత్తి చూపుతూ తన గళాన్ని వినిపిస్తూ మంత్రులను ఇరకాటంలో పెట్టిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మరోసారి మంత్రుల ఎదుట ఇసుక కొరతపై తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.

11/23/2016 - 02:54

హైదరాబాద్, నవంబర్ 22:కొత్త సంవత్సరంలో సెలవు దినాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2017 సెలవు దినాలను ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
2017లో మొత్తం 19 సెలవు దినాలు ఉన్నాయి.
ఇవీ సెలవుదినాలు
జనవరి 26 గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 24 మహాశివరాత్రి
మార్చి 29 ఉగాది
ఏప్రిల్ 1 ఖాతాల నిర్వహణ సెలవు
ఏప్రిల్ 5 శ్రీరామ నవమి, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి

11/23/2016 - 02:53

కెరమెరి, నవంబర్ 23: కుమ్రంబీం జిల్లా కెరమెరి మండల పరిధిలోని జోడేఘాట్ అటవీ ప్రాంతంలోని కలప స్మగ్లర్ల స్థావరాలపై అటవీ శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్మగ్లర్లు తిరగబడ్డా బెదరకుండా ప్రతిఘటించినా అటవీశాఖ సిబ్బంది పెద్ద మొత్తంలో టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

11/23/2016 - 02:52

హైదరాబాద్, నవంబర్ 22: నూతన విధానం ద్వారా సన్న బియ్యం, దొడ్డు బియ్యం కొనుగోళ్లలో ఈసారి 124 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. రాష్ట్రంలో ప్రజా పంపిణీ అవసరాలకు ఈ సంవత్సరం కస్టమ్ మిల్లింగ్ రైస్ అందుబాటులో లేనందున మిల్లర్లనుండి అదనంగా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది.

11/23/2016 - 02:51

హైదరాబాద్, నవంబర్ 22: పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇబ్బందులు,శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

Pages