S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/25/2016 - 07:33

హైదరాబాద్, నవంబర్ 24: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్ బస్తా 230 రూపాలయలకు ఇచ్చే విధంగా హౌజింగ్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. 32 సిమెంట్ కంపెనీలు, హౌసింగ్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం జరిగింది. మూడు సంవత్సరాల వరకు బస్తా సిమెంట్‌ను 230కి అమ్మేందుకు కంపెనీలు సమ్మతించాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

11/25/2016 - 07:15

హైదరాబాద్, నవంబర్ 24: ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయం ‘ప్రగతి భవన్’ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకం చేసే వేదికగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు.

11/24/2016 - 07:21

హైదరాబాద్, నవంబర్ 23: ప్రధాని మోదీ ఉదాత్త ఆశయాలతో పనిచేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్లలో సాధించలేనిది, బిజెపి సాధిస్తోందని, తాజాగా వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఓట్ల రద్దు తర్వాత జరిగిన ఎన్నికల్లో బిజెపి గెలిచిందంటే ప్రజల మద్దతు ఏ తీరున ఉందో అర్థం అవుతోందని పేర్కొన్నారు.

11/24/2016 - 07:19

దమ్మపేట, నవంబర్ 23: రాష్ట్రం విడిపోయి ఇరు రాష్ట్రాల్లో ప్రజలు ఒక విధంగా ఉంటే ముంపుమండలాల ప్రజల పరిస్థితి మరో విధంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు తాము ఏ ప్రాంతంలో ఉన్నామో గర్వంగా చెప్పగలుగుతుంటే ఏడు ముంపు మండలాల్లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల పరిస్థితి విభిన్నంగా ఉంది.

11/24/2016 - 07:19

నిజామాబాద్, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దుతో తెరపైకి వచ్చిన కరెన్సీ కష్టాల గురించి వాస్తవాలను తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు బుధవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలన జరిపాయి.

11/24/2016 - 07:17

హైదరాబాద్, నవంబర్ 23: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత నోట్ల రద్దుపై ఎందుకు మాట్లాడడం లేదని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో పార్టీ ఆఫీసు బేరర్లు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యులతో సమావేశమై చర్చించారు.

11/24/2016 - 07:16

ఆదిలాబాద్, నవంబర్ 23: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేరుకుపోతున్న విద్యుత్ బకాయిలు ట్రాన్స్‌కోకు గుదిబండగా మారాయి. వివిధ కేటగిరిల కింద విద్యుత్ చార్జీలను వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో సిబ్బంది పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా వినియోగదారుల నుండి స్పందన కరువైంది. రద్దయిన నోట్లను బిల్లుల రూపంలో చెల్లించేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించినా ఫలితం కనిపించలేదు.

11/24/2016 - 07:15

ములుగు, నవంబర్ 23: రాష్ట్రప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలోని పడిగాపూర్, ఊరట్టం సమీపంలోని జంపన్నవాగుపై ఆయన బుధవారం నాలుగు చెక్‌డ్యాంలు, కాటాపూర్‌లో రైతుల సౌకర్యార్థం 1.20 కోట్ల రూపాయలతో నిర్మించే 33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్, 30 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

11/24/2016 - 05:20

హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పూర్వవైభవాన్ని తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ వర్కుషాప్‌ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రిన్సిపాల్స్ ఆలోచించాలని అన్నారు. అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోంది కనుక ఫలితాల్లో మార్పు రావాలని ఆయన చెప్పారు.

11/24/2016 - 05:19

హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణ రాష్ట్ర సచివాలయం కోసం కొత్త భవనాల ప్రతిపాదనలు వెనక్కు వెళ్లినట్టే కనిపిస్తోంది. హైకోర్టులో కేసు నడుస్తుండటం, తాజాగా 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్ల రద్దుతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గడంతో కొత్త్భవనాలకు నిధులలేమి ఏర్పడుతోందని స్పష్టమవుతోంది.

Pages