S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/29/2016 - 04:43

హైదరాబాద్, నవంబర్ 28: శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ నుంచి నిర్వహించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. వర్షాకాల సమావేశాలు నిర్వహించుకోలేకపోయామని అన్నారు. వర్షాకాల, శీతాకాల సమావేశాలు కలిపి డిసెంబర్‌లో జరుగుతాయన్నారు. అయితే, తేదీ ఇంకా ఖరారు కాలేదని వెల్లడించారు.

11/29/2016 - 01:19

హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌తో సహా దాదాపు అన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి ఏడు డిగ్రీల వరకూ చేరడంతో గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు శాపంగా మారింది. ఆదిలాబాద్ , కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో విద్యార్ధులు తగ్గిన ఉష్ణోగ్రతలతో ఒణికిపోతున్నారు. చలి తీవ్రత కూడా బాగా పెరిగి కనీస స్థాయికి మించి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

11/29/2016 - 01:16

ప్రయోగాత్మకంగా సిద్దిపేట సెగ్మెంట్ ఎంపిక సంపూర్ణ ఆర్థిక క్రాంతికి స్వాగతం
ప్రధాని మోదీది సాహసోపేత నిర్ణయమే తెలంగాణ ఆదాయానికి గండి పడింది
కేంద్రం ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది ప్రధాని అసలు వ్యూహం తెలిస్తే అంతే..
నన్ను విమర్శించేవారి గుండెలు గుభేల్ చెల్లింపులకు కొత్తగా టిఎస్ వ్యాలెట్ యాప్
ఇక రెండే పన్నులు.. జిఎస్‌టి, బిటిటి కేబినెట్ భేటీ వివరాలు వెల్లడించిన కెసిఆర్

11/28/2016 - 07:49

హైదరాబాద్, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వౌన ప్రేక్షక పాత్ర పోషించడం సరైంది కాదని, ఇబ్బందుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

11/27/2016 - 05:39

హైదరాబాద్/ రాజేంద్రనగర్, నవంబర్ 26: ప్రధాని నరేంద్ర మోదీ బందోబస్తుకు వచ్చిన ఎస్‌ఐ తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. హన్మకొండ జిల్లా పైడిపల్లికి చెందిన శ్రీ్ధర్ (30) కొమరం భీమ్ జిల్లా ఆసీఫాబాద్ మండలం పెంచికల్‌పేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.

11/27/2016 - 06:58

హైదరాబాద్/ గచ్చిబౌలి, నవంబర్ 26: పెద్ద నోట్లను రద్దు చేయడంలో భాగంగా కేంద్రం కొత్తగా 2వేల నోటు తీసుకొస్తే, అది ప్రజల చేతికి పూర్తిగా అందకముందే నకిలీ నోట్లను తయారు చేస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. కొంత కాలంగా వంద, యాభై, ఇరవై, పది రూపాయల నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు.

11/26/2016 - 07:19

ప్రభుత్వ, ప్రైవేటు వర్గాల్లో ఆందోళన పెన్షనర్లు, ఉద్యోగుల్లో కంగారు
జీతాలేమో నేరుగా ఖాతాల్లోకి జమ ఎటిఎంల నుంచి వచ్చేది కేవలం 2వేలు
బ్యాంకుల నుంచి వారానికి 24 వేలే సామాన్యుడి బతుకు బండికి కరెన్సీ కుదుపు

11/26/2016 - 07:12

ఖమ్మం, నవంబర్ 25: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న నకిలీ కారం దందా ఖమ్మం జిల్లా నుంచే నడిచినట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఉన్న కోల్ట్ స్టోరేజ్‌లలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేయగా ఈ విషయం స్పష్టమైంది.

11/25/2016 - 08:14

హైదరాబాద్, నవంబర్ 24: ఎస్సీ, బిసిలకు మాదిరిగానే ఇకపై ఎస్టీ విద్యార్థులకు కూడా పోస్టు మెట్రిక్ హాస్టళ్ల నెలవారిగా నిర్వహణ ఖర్చులను చెల్లించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై గురువారం ముఖ్యమంత్రి సంతకం చేశారు. క్యాంపు కార్యాలయం కొత్త భవనంలోకి గృహ ప్రవేశం చేశాక ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకం ఈ ఫైలుపైనే కావడం విశేషం.

11/25/2016 - 07:37

హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కరెన్సీ నోట్ల సమస్య పరిష్కారానికి తక్షణమే ఐదువేల కోట్ల రూపాయల చిన్ననోట్లను పంపించాలని కేంద్రాన్ని కోరామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇక్కడి ఎస్‌బిహెచ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 13వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ, 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం మంచిదేనని అన్నారు.

Pages